
సాక్షి, విజయవాడ: రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు పూర్తి భద్రత ఉందని.. ఇంటి భోజనం, మందులు అందిస్తూ ప్రభుత్వం అన్ని విధాల సదుపాయాన్ని కల్పిస్తున్న విషయాన్ని అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మరోసారి ప్రస్తావిస్తున్నారు. ఈ కేసులో చంద్రబాబు అన్ని ఆధారాలతో దొరికిపోయారని.. ఇప్పుడు న్యాయవ్యస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఏఏజీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కేసులో చంద్రబాబు అన్ని ఆధారాలతో దొరికిపోయారు. జైల్లో ఆయనకు పూర్తి భద్రత ఉంది. జైల్లో ఖైదీలు కాక.. స్వామిలు ఉంటారా?. చంద్రబాబుకి ఇంటి భోజనం, మందులు కూడా అందిస్తున్నారు. ఆయనకు అక్కడే అన్ని విధాల భద్రత ఉంటుందని మరోసారి ఉద్ఘాటించారు. అలాగే బెయిల్, హౌజ్ అరెస్ట్.. ఇలా పిటిషన్లు వేసుకునే హక్కులు అందరికీ ఉంటాయని తెలిపారాయన.
అందుకే జైల్లో ఉండాలనేది
ఇక కేవలం తన స్టేట్‌మెంట్ ఆధారంగానే కేసు నడవడాన్ని మాజీ అధికారి పీవీ రమేష్ ఆక్షేపించడాన్ని ఏఏజీ సుధాకర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. జడ్జి ముందు పీవీ రమేష్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఉందని, అందులో వాస్తవాలు ఉన్నాయని, ఈ పరిణామాలు చూస్తుంటే అప్పుడే ఓ వికెట్ పడిపోయిందనే అనుమానాలు కలుగుతున్నాయని ఏఏజీ అంటున్నారు. పీవీ రమేష్‌ను అప్పుడే ప్రలోభ పెట్టినట్లు కనిపిస్తోందని.. ప్రలోభాలు, లోబర్చుకోవడం, మేనేజ్ చేయడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య అని ఏఏజీ విమర్శించారు. కాబట్టే చంద్రబాబు జైల్లోనే ఉండాలని బలంగా చెబుతున్నామని ఏఏజీ అంటున్నారు. .
దురదృష్టకరం
తప్పు అని నిరూపిస్తే.. ఏ వ్యవస్థనైనా భ్రష్టు పట్టించగల సమర్థత వాళ్లకు ఉందని ఏఏజీ సుధాకర్‌రెడ్డి అంటున్నారు. అనుకూలంగా ఆర్డర్ రాకపోయేసరికి ఇప్పుడు న్యాయవ్యవస్థను సైతం నిందిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపై దాడి దురదృష్టకరమని.. న్యాయ వ్యవస్థను కూలదోయాలని ప్రయత్నిస్తే వాళ్లే కూలిపోతారని హితవు పలికారాయన.
భయం నా బ్లడ్‌లోనే లేదు
స్కిల్ స్కాం కేసులో సీఐడీ తరపున తాను తన వృత్తిపరంగానే పని చేస్తున్నానని, తనపై ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు లేవని స్పష్టం చేశారు ఏఏజీ పొన్నవోలు. అలాగే.. వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేసేవాళ్లను తాను పట్టించుకోబోనని అంటున్నారాయన. వాళ్లు చెబుతున్న డైలాగులే తాను చెబుతున్నానని, బెదిరింపులకు తాను భయపడే రకం కాదని.. భయం తన బ్లడ్‌లోనే లేదని ఆయన అన్నారు.
లోకేష్ అలా ఎలా అంటారు?
షెల్ కంపెనీల ద్వారా డబ్బులు క్రెడిట్ అయ్యాయని కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో తేలిందని, ఆధారాలు లేవని నారా లోకేష్ ఎలా అంటారని ఏఏజీ సుధాకర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని వ్యవస్థలకు పట్టిన చంద్ర గ్రహణం ఇప్పుడిప్పుడే వీడుతోందంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారాయన.
ఇదీ చదవండి: ఆ రెడ్ డెయిరీ ఏందో.. లోకేష్ ఏందో..!
Comments
Please login to add a commentAdd a comment