సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున వైజాగ్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వసంత్‌కుమార్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూళ్ళ గ్రామం. కాగా అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకురానున్నారు.
ఆది నుంచి వసంత్‌కుమార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2004, 2009లో ఉంగుటూరు నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్ కేబినెట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత రోశయ్య కేబినెట్‌లోనూ అదే శాఖా మంత్రిగా పని చేశారు. ఇక కిరణ్‌కుమార్ రెడ్డి కేబినెట్‌లో పర్యాటక శాఖ మంత్రి విధులు నిర్వర్తించారు. 2018 లో టీడీపీ-కాంగ్రెస్ కలయిక తర్వాత ఆయన పార్టీకి దూరమయ్యారు. 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న వసంత్‌కుమార్ విశాఖలో కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment