
బెంగళూరు: మాజీమంత్రి, ఉత్తర కన్నడ జిల్లా కారవారలో పలు విద్యాసంస్థలను స్థాపించిన ప్రభాకర్ రాణె (81) సోమవారం మధ్యాహ్నం తన స్వగృహంలో కన్నుమూశారు. నెల క్రితం జ్వరం రావటంతో ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఇంటిలోనే చికిత్స తీసుకుంటున్నారు. కారవార జోయిడా స్థానం నుంచి క్రాంతిరంగ పార్టీ నుండి ఒకసారి, కాంగ్రెస్ తరపున ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1993లో వీరప్ప మెయిలీ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment