
హైదరాబాద్‌కు నీళ్లు తెచ్చింది కాంగ్రెస్సే
మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి గోదావరి, కృష్ణా నదుల నుంచి నీళ్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీ నేతలు కమలాకర్‌రావు, జి.నిరంజన్‌లతో కలిసి గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గోదావరి, కృష్ణా జలాలను హైదరాబాద్‌కు తామే తెచ్చినట్టుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం హోర్డింగులు పెట్టుకొని ప్రచారం చేసుకోవడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మర్రి అన్నారు.