
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హుబ్లీ(కర్ణాటక): దిగజారిన నేటి రాజకీయాల విష వలయంలో తాను ఇరుక్కున్నానని మాజీమంత్రి సంతోష్‌లాడ్ రేషన్ కిట్లు పంపిణీ వేళ ఉద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. కలఘటికి తాలూకా కూడళిగి గ్రామంలో పేదలకు రేషన్ కిట్లు పంపిణీ చేస్తూ ఉద్వేగంతో మాట్లాడారు. కిట్లు ఇచ్చేటప్పుడు చాలా బాధేస్తుందన్నారు. రేషన్‌కిట్లు ఇచ్చి ఫొటోలు తీసుకోవడం నాకు సిగ్గు కలిగిస్తుందన్నారు.
కలఘటికిలో క్యాంటీన్ ఓపెన్ చేశా మని రోజు 1000 మందికి ఆహారం అందిస్తున్నామని ఇది తనకెంతో ఆత్మ సంతృప్తి కలిగిందన్నారు. ప్రస్తుతం సహాయం చేసిన విషయాలన్ని చెప్పు కోవడం వంటి విచిత్రమైన పరిస్థిలో ఉన్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment