Kit bags
-
జనంలోకి జగనన్న సైన్యం!
మాట నిలబెట్టుకుంటూ 46 నెలల్లో 98.5 శాతం ఎన్నికల హామీలను అమలు చేసి మేనిఫెస్టోకు సిసలైన నిర్వచనం ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కూడా గడవక ముందే సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2 లక్షల కోట్లు జమ చేశారు. వార్డు మెంబర్ నుంచి కేబినెట్ వరకూ సింహభాగం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు, మహిళలకు రిజర్వ్ చేస్తూ చట్టం తెచ్చి మరీ చిత్తశుద్ధి చాటుకున్నారు. 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు.. 2.60 లక్షల మంది వలంటీర్లు.. 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరణతో పరిపాలనను వికేంద్రీకరించి ఇంటివద్దే సుపరిపాలన అందిస్తున్నారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆదర్శ పాలనతో ముఖ్యమంత్రి జగన్ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచారు. ఇదే అంశాన్ని చాటి చెబుతూ టీడీపీ సర్కార్‌కు, వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ మరోసారి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతూ ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నేటి నుంచి ప్రారంభమయ్యే ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకూ కొనసాగనుంది. సచివాలయానికి ముగ్గురు చొప్పున నియమించిన కన్వినర్లు, ప్రతి 50 నుంచి వంద ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమించిన గృహ సారథులతో కూడిన ఏడు లక్షల మంది సైన్యం ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. దీనికి సంబంధించి వారికి ప్రత్యేకమైన కిట్ బ్యాగ్‌లు అందచేశారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఆయా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారు. 14 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 15,004 సచివాలయాల పరిధిలో 1.60 కోట్ల కుటుంబాలలోని ఐదు కోట్ల మంది ప్రజలను కలుసుకోనున్నారు. నమ్మకం రెట్టింపు సుమారు 18 నెలల పాటు పట్టి పీడించిన కరోనాతో ప్రపంచమంతా ఆర్థి క సంక్షోభంతో తల్లడిల్లినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ ఒక్క సంక్షేమ పథకాన్నీ ఆపలేదు. 46 నెలల్లో సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో రూ.రెండు లక్షల కోట్లను జమ చేయడం దేశ చరిత్రలో రికార్డు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షల మేరకు 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్ వ్యవస్థీకరించి పరిపాలనను వికేంద్రీకరించారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ఆర్థి క చేయూతతో పేదరిక నిర్మూలనతోపాటు రాజ్యాధికారంలో సింహభాగం వాటా ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయం చేకూర్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు సామాజిక సాధికారత సాధించేలా బాటలు వేశారు. తాము పెట్టుకున్న నమ్మకం కంటే రెండింతలు అధికంగా న్యాయం చేస్తూ పరిపాలిస్తుండటంతో ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ ప్రజలు నినదిస్తున్నారు. ప్రజల్లో నుంచి వ చ్చిన ఈ నినాదాన్నే ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ చేర్చింది. ప్రజా మద్దతు పుస్తకంలో ప్రశ్నలివీ.. 1 . ఇంతకు ముందు పాలనతో పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో మీకు, మీ కుటుంబానికి మంచి జరిగిందా? 2 . మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా? 3 .గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పింఛన్, అమ్మ ఒడి, ఆసరా, చేయూత లాంటి అనేక పథకాల ద్వారా డబ్బులను నేరుగా మీ అకౌంట్లో వేయడం లేదా వలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా? 4 . నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా? 5. జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతిస్తారా? కిట్ బ్యాగ్‌లో ఏముంటాయంటే.. ♦ ఒక్కో కిట్ బ్యాగ్‌లో 200 ఇళ్లకు సరిపడా సామగ్రి ఉంటుంది. ♦టీడీపీ సర్కార్‌కు, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను వివరిస్తూ రూపొందించిన 200 కరపత్రాలు ♦ ప్రజా మద్దతు పుస్తకాలు టమూడు పెన్నులు ♦ ఇద్దరు గృహ సారథులు, ముగ్గురు కన్వినర్లు ధరించేందుకు సీఎం జగన్ ఫొటోతో కూడిన ఐదు బ్యాడ్జీలు ♦సీఎం వైఎస్ జగన్ ఫొటో ఉన్న 200 స్టిక్కర్లు ♦ సీఎం జగన్ ఫోటో ఉన్న 200 మొబైల్ ఫోన్ స్టిక్కర్లు కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారంటే.. ♦ ప్రతి ఇంటి వద్దకు ఇద్దరు గృహ సారథులు, వలంటీరు వెళతారు. టీడీపీ సర్కార్‌కు, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను ఆ కుటుంబ సభ్యులకు వివరిస్తూ రూపొందించిన కరపత్రాన్ని చదివి వినిపిస్తారు. తర్వాత కరపత్రాన్ని వారికి అందజేస్తారు. ♦ప్రజా మద్దతు పుస్తకంలో ప్రజా సర్వేకు సంబంధించి ఐదు ప్రశ్నలు ఉన్న స్లిప్పుపై కుటుంబ పెద్ద పేరు, ఫోన్ నంబర్ నమోదు చేస్తారు. ఆ తర్వాత ఐదు ప్రశ్నలను చదివి ఆయా కుటుంబాలు ఇచ్చే సమాధానాల ఆధారంగా అవును / కాదు అనే వివరాలను నమోదు చేస్తారు. స్లిప్పు కుడి వైపున ఉన్న రసీదును ఆ కుటుంబానికి ఇస్తారు. ♦వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారిని 82960–82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరతారు. మిస్డ్ కాల్ ఇచ్చిన నిముషంలోపే కృతజ్ఞతలు తెలియచేస్తూ సీఎం జగన్ సందేశంతో ఐవీఆర్ఎస్ కాల్ ఆ కుటుంబానికి వస్తుంది. ♦ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారి ఇంటి తలుపునకు సీఎం వైఎస్ జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్ అతికించేందుకు అనుమతి కోరతారు. సమ్మతించిన వారి ఇంటి తలుపునకు స్టిక్కర్ అతికిస్తారు. అదే రీతిలో మొబైల్ ఫోన్‌కు స్టిక్కర్ అతికించి ధన్యవాదాలు తెలియచేస్తారు. ♦ ఈ కార్యక్రమం పూర్తయ్యాక ప్రజల అభిప్రాయాన్ని సేకరించిన ప్రజా మద్దతు పుస్తకాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపుతారు. 15,004 సచివాలయాల్లో ఏకకాలంలో రాష్ట్రంలోని 15,004 సచివాలయాల్లో శుక్రవారం ఏకకాలంలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ప్రారంభమవుతుందని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 7వ తేదీన మొదలయ్యే ఈ కార్యక్రమం 20వ తేదీ వరకు కొనసాగుతుంది. ఏడు లక్షల మంది పార్టీ సైనికులు 14 రోజుల్లో దాదాపు 1.60 కోట్ల కుటుంబాలను నేరుగా కలుసుకుంటారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్–అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ సూచించింది. -
జగనన్న విద్యాకానుక కిట్టు.. విద్యార్థులు అదిరేట్టు
రాప్తాడురూరల్: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ విద్యకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. నాడు–నేడు కార్యక్రమంతో ప్రతి ప్రభుత్వ పాఠశాలకు లక్షలాది రూపాయలు వెచ్చించి మౌలిక వసతులు కల్పించారు. కొత్త భవనాలు, మరుగుదొడ్లు, తరగతి గదులు, పెయింటింగ్, ఫర్నీచర్ ఇలా ఒకసారి పరిశీలిస్తే కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులకు పైసా భారం పడకుండా 9 రకాల వస్తువులతో కూడిన ‘జగనన్న విద్యా కానుక’ కిట్లను 1–10 తరగతుల విద్యార్థులకు అందజేస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్, ఆక్స్ఫర్డ్, పిక్టోరియల్ డిక్షనరీలు, బ్యాగు, మూడు జతల యూనిఫాం, షూ, బెల్ట్ కిట్‌లో ఉంటాయి. ఇప్పటికే మూడేళ్లు కిట్లను ఇచ్చారు. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి నాల్గో విడత కిట్లను అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 1–10 తరగతుల విద్యార్థులు 2,22,212 మంది ఉన్నారు. వీరికోసం రూ. 36.66 కోట్లు ఖర్చు చేసి కిట్లు అందజేస్తున్నారు. కార్పొరేట్ విద్యార్థుల్లా.. ప్రభుత్వ విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులు ఎలాగైతే యూనిఫాం, షూ, బెల్ట్ ధరించి వెళతారో మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అదే తరహాలో వారికి ఏమాత్రం తీసిపోని విధంగా పాఠశాలలకు వెళ్తున్నారు. డ్రెస్ కోడ్‌తో పాటు ప్రతి విద్యార్థీ షూ వేసుకుంటున్నారు. ఈసారి యూ‘న్యూ’ఫాం విద్యార్థుల యూనిఫాం ఈసారి రంగు మారింది. గతంలో బాలికలకు పింక్, బ్లూ కాంబినేషన్, బాలురకు లైట్ స్కై, థిక్ బ్లూ కాంబినేషన్లో యూనిఫాం ఇచ్చేవారు. గతంలో ప్లెయిన్లో ఉండే యూనిఫాం ఈసారి బాలికలకు మాత్రం చెక్స్ కల్గినవి ఇస్తున్నారు. బ్యాగులు గతంలో ముందువైపు స్కై బ్లూ, వెనుక వైపు నేవీబ్లూ కలరు ఉండేది. ఈసారి యూనిఫాం, బ్యాగులు రంగులు మారాయి. కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగించే తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపాలంటే ఆర్థిక ఇబ్బందులతో గతంలో వెనుకడుగు వేసేవారు. ఒకవేళ పంపినా ఆ తర్వాత నోట్ పుస్తకాలు, ఇతర సామగ్రి కొనుగోలుకు అరకొర ఖర్చు కూడా భరించలేక చాలామంది డ్రాపౌట్స్‌గా మారేవారు. అయితే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. విద్యార్థులకు పుస్తకాలే కాదు... జగనన్న విద్యాకానుక రూపంలో రూ. 1,650 విలువైన సామగ్రి ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పటికే మూడేళ్లు కిట్లు అందజేసిన ప్రభుత్వం.. నాలుగో సారి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేదు ప్రభుత్వ పాఠశాలల పిల్లల యూనిఫాం, షూ క్వాలిటీని ఒక ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించి ఇవ్వడం అనేది దేశంలో ఎక్కడా లేదు. కార్పొరేట్ తరహా డ్రెస్‌కోడ్‌తో తమ పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారనే ఆనందం తల్లిదండ్రుల్లో ఉంది. జగనన్న విద్యా కిట్లు చాలా నాణ్యతగా ఉంటున్నాయి. ప్రభుత్వం పిల్లల చదువు విషయంలో రాజీలేకుండా ఖర్చు చేస్తోంది. - ఎం.సాయిరామ్, ఏపీఓ, సమగ్ర శిక్ష -
సాయం చేసి ఫోటోలు తీసుకోవడమా ?
సాక్షి, హుబ్లీ(కర్ణాటక): దిగజారిన నేటి రాజకీయాల విష వలయంలో తాను ఇరుక్కున్నానని మాజీమంత్రి సంతోష్‌లాడ్ రేషన్ కిట్లు పంపిణీ వేళ ఉద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. కలఘటికి తాలూకా కూడళిగి గ్రామంలో పేదలకు రేషన్ కిట్లు పంపిణీ చేస్తూ ఉద్వేగంతో మాట్లాడారు. కిట్లు ఇచ్చేటప్పుడు చాలా బాధేస్తుందన్నారు. రేషన్కిట్లు ఇచ్చి ఫొటోలు తీసుకోవడం నాకు సిగ్గు కలిగిస్తుందన్నారు. కలఘటికిలో క్యాంటీన్ ఓపెన్ చేశా మని రోజు 1000 మందికి ఆహారం అందిస్తున్నామని ఇది తనకెంతో ఆత్మ సంతృప్తి కలిగిందన్నారు. ప్రస్తుతం సహాయం చేసిన విషయాలన్ని చెప్పు కోవడం వంటి విచిత్రమైన పరిస్థిలో ఉన్నామన్నారు. చదవండి: మొదటి భార్యను వదిలేసి రెండో పెళ్లి.. మూడు రోజులకే.. -
మా మంచి ఎమ్మెల్సీనే: కరోనా కిట్‌తో విస్కీ మందు
సాక్షి, మహబూబాబాద్ : లీడరా.. మజాకా! ఈ ఎమ్మెల్సీ రూటే సెపరేటు. కరోనా కష్టకాలంలో ప్రజలకు కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు తమకు తోచిన సాయం చేస్తున్నారు కదా! అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాత్రం మరో అడుగు ముందుకేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించినవారికి కిట్బ్యాగులను పంపించారు. అయితే ఇందులో విశేషమేముందని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జెడ్పీ, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లకు ‘ఇంట్లోనే ఉందాం.. క్షేమంగా ఉందాం’ అనే నినాదంతోపాటు శ్రీనివాస్‌రెడ్డి ఫొటోతో ఉన్న కిట్‌బ్యాగ్‌ను గురువారం ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పంపిణీ చేశారు. మెడికల్ కిట్లు అనగానే శానిటైజర్, మాస్కులు, పల్స్ ఆక్సీమీటర్.. మహా అయితే డ్రైఫ్రూట్స్ ఉంటాయని అంతా భావించారు. కానీ, ఆ ప్యాక్ తెరిచి చూసినవారు అవాక్కయ్యారు. ఎందుకంటారా?! పైన చెప్పినవే కాకుండా ఆ ప్యాక్‌లో టీచర్స్ విస్కీ బాటిల్ కూడా ఉంది మరి! దీంతో ప్యాక్ తీసుకున్న వారందరూ ‘మా మంచి లీడర్’ అంటూ మురిసిపోతూ ఇళ్లకు బయలుదేరారు. -
కోవిడ్ కిట్.. హోం డెలివరీ
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్– 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ కరోనా వ్యాధి తీవ్రత తక్కువగా ఉండి ఇంట్లోనే హోం ఐసోలేషన్‌గా ఉంటూ చికిత్స పొందుతున్న వారి కోసం ఇళ్లకే ‘హోం ఐసోలేషన్ కిట్’ పంపిణీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో మెడికల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో ఆరోగ్య సిబ్బంది ద్వారా పాజిటివ్ వ్యక్తులున్న ఇళ్లకు వీటిని అందజేస్తున్నారు. గతంలో సమీపంలోని అర్బన్ హెల్త్ సెంటర్లకు వెళ్లిన హోం ఐసోలేషన్‌లోని వారికి వీటిని అందజేశారు. దాదాపు పది రోజులుగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ద్వారా నేరుగా బాధితుల ఇళ్లకే వీటిని పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 20వేల కిట్స్ తెప్పించిన జీహెచ్ఎంసీవాటిల్లో 15 వేలు పంపిణీ చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఐదువేలు అందుబాటులో ఉండగా, పాజిటివ్ కేసుల సంఖ్యను బట్టి కిట్లను తెప్పించి పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 17 రోజులు హోం ఐసొలేషన్‌లో ఉండాలని, అందుకనుగుణంగా అన్ని రోజులకు సరిపడేలా.. త్వరగా కోలుకునేందుకు ఉపయోగపడే వస్తువులు, టాబ్లెట్లు ఇస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారుకిట్ బ్యాగ్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం కోవిడ్– 19 నియంత్రణకు జారీ చేసిన సలహాలు, సూచనలు తెలుస్తాయని పేర్కొన్నప్పటికీ, స్కాన్ చేసిన కొందరు జీహెచ్ఎంసీ వెబ్సైట్ లింక్ వస్తోందని తెలిపారు. కాల్‌సెంటర్ ద్వారా ఫీడ్‌బ్యాక్.. హోం ఐసోలేషన్ కిట్స్ పంపిణీ జరిగిన వారికి కోవిడ్– 19 కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ చేసి, బాధితుల నుంచి ఫీడ్‌బ్యాక్ తెలుసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. కిట్ బాగుందని, కోలుకుంటున్నామని వారి నుంచి సమాధానాలొస్తున్నట్లు పేర్కొంది. కిట్‌లో ఏమున్నాయి? ♦ విటమిన్– సి టాబ్లెట్స్: 34 ♦ జింక్ టాబ్లెట్లు : 17 ♦ బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు: 17 ♦ క్లాత్ మాస్కులు :6 ♦ శానిటైజర్ బాటిల్ : 1 ♦ లిక్విడ్ హ్యాండ్‌వాష్ : 1 ♦ చేతి గ్లవ్స్ :2 జతలు ♦ సోడియం హైపోక్లోరైట్ ద్రావణం బాటిల్: 1 ♦ హోమ్ ఐసోలేషన్‌లో పాటించాల్సిన నిబంధనల బ్రోచర్ -
వైద్యులకు పీపీఈ కిట్లు పంపిణీ చేసిన ఎంపీ
-
అంచనాలకు మించి..!
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో కేసీఆర్ కిట్ సత్ఫలితాలిస్తోంది. పథకం ప్రారంభంలో కొంత మందకొడిగా సాగినా.. ఆ తర్వాత అంచనాలకు మించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జ రుగుతున్నాయి. దీంతో ప్రభు త్వ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరినట్లయింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017, జూన్ 2వ తేదీన కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకం ప్రారంభమై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితోపాటు ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు కలుపుకుని ప్రసవాలు అంచనాలను మించిపోతున్నాయి. రెండేళ్ల క్రితం ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంవత్సరానికి 5వేలకు మించి ప్రసవాలు జరగకపోయేవి. అదే సందర్భంలో వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏడాదిలో ఇంచుమించుగా 22వేల వరకు ప్రసవాలు జరిగేవి. ఈ దశలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించుకుంటే రూ.2వేల విలువ చేసే కేసీఆర్ కిట్‌ను ఉచితంగా అందజేయడంతోపాటు ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగపిల్లాడు పుడితే రూ.12వేలు తల్లులకు ఇస్తుండడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య మరింత పెరుగుతూ వస్తోంది. ఆశించిన లక్ష్యంకన్నా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరుగుతుండడంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించుకోవడం ద్వారా లభించే ప్రయోజనాల గురించి వివరిస్తున్నారు. రెండేళ్లు.. 20,306 ప్రసవాలు పథకం ప్రారంభమైన రెండేళ్ల కాలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య క్రమక్రమంగాపెరుగుతూ వస్తోంది. రెండేళ్లలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కలుపుకుని 20,306 ప్రసవాలు జరగడం గమనార్హం. అందుకుగాను 17,056 కేసీఆర్ కిట్లు ప్రసవం చేయించుకున్న మహిళలకు అందజేశారు. 22 పీహెచ్‌సీలు, 3 సీహెచ్‌సీలు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితో కలిపి ఈ ప్రసవాలు జరిగాయి. అందులో అత్యధికంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మూడు వంతులకుపైగా ప్రసవాలు జరగడం విశేషం. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఆస్పత్రిలో మాతా, శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత వాటి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక్కడ వైద్యులు ప్రతి రోజు 25 నుంచి 30 వరకు ప్రసవాలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఏడాది కాలంలో 20,306 ప్రసవాలు జరగగా.. ఒక్క జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోనే 16,717 ప్రసవాలు జరగడం విశేషంగా చెప్పొచ్చు. నగదు కోసం ఎదురుచూపులు అయితే.. జిల్లాలో కేసీఆర్ కిట్ పథకం విజయవంతమైనప్పటికీ ఆ పథకం కింద అందించే నగదు విషయంలో లబ్ధిదారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. గత 9 నెలలుగా నగదు అందక లబ్ధిదారులు ప్రభుత్వ ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కేసీఆర్ కిట్ పథకం ద్వారా అమ్మాయి పుడితే రూ.13వేలు, అబ్బాయి పుడితే రూ.12వేలు నగదు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మహిళ గర్భవతి అయిన 5 నెలల్లోపు ప్రభుత్వ ఆస్పత్రిలో రెండుసార్లు పరీక్ష చేయించుకొని.. నమోదు చేయిస్తే మొదటి విడత రూ.3వేలు చెల్లిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం అయిన వెంటనే కేసీఆర్ కిట్‌తోపాటు రెండో విడత ఆడపిల్ల పుడితే రూ.5వేలు, మగపిల్లాడు పుడితే రూ.4వేలు చెల్లిస్తారు. ఇమ్యూనైజేషన్ మూడు డోసులు నాలుగు నెలల్లో పూర్తి చేస్తే మూడో విడత రూ.2వేలు చెల్లిస్తారు. బిడ్డపుట్టి 9 నెలలు పూర్తయ్యాక నాలుగో విడతగా రూ.3వేలు చెల్లిస్తారు. బ్యాంక్ అకౌంట్ ద్వారా విడతలవారీగా నగదు చెల్లిస్తారు. అయితే జిల్లాలో మొదటి విడతలో 8,417, రెండో విడతలో 4,742, మూడో విడతలో 8,879, నాలుగో విడతలో 7,119 మంది లబ్ధిదారులకు చెల్లింపులు జరపాల్సి ఉంది. వీరంతా తిమ్మిది నెలలుగా ఎప్పుడు డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడతాయా.. అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. నగదు అందుతుంది.. కేసీఆర్ కిట్ పథకం ద్వారా లబ్ధిదారులందరికీ నగదు తప్పకుండా అందుతుంది. ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ నంబర్ అందజేయాలి. పథకం ద్వారా రెండేళ్లలో గణనీయంగా ప్రసవాలు జరిగాయి. ఇది అందరి కృషితోనే సాధ్యమైంది. జిల్లాలోని గర్భిణులు ప్రతి ఒక్కరు కేసీఆర్ కిట్ పథకాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలి. – డాక్టర్ కళావతిబాయి, డీఎంహెచ్ఓ -
కిట్.. కట్..!
సాక్షి, యాదాద్రి : రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో ఒక్కటైన కేసీఆర్ కిట్ జిల్లాలో కొంతకాలంగా ఆగిపోయింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ పథకం ద్వారా చేకూరే లబ్ధి అక్టోబర్ నుంచి నిలిచిపోయింది. జిల్లాలోని భువనగిరి, రామన్నపేట ఏరియా ఆస్పత్రులు, చౌటుప్పల్, ఆలేరు సీహెచ్‌సీల్లో కాన్పులు జరిగిన వారికి కేసీఆర్ కిట్లు ఇస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచడంతోపాటు తల్లీబిడ్డల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా కేసీఆర్ కిట్‌ను సీఎం కేసీఆర్ 2017 జూన్ 2న ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ప్రవేశపెట్టిన ఈపథకంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే రెండు నెలలుగా కేసీఆర్ కిట్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో లేవు. దీంతో ప్రసవం అయిన వెంటనే ఇవ్వాల్సిన కిట్ ఇవ్వకపోవడంతో బాలింతలు, శిశువుల కోసం బహిరంగ మార్కెట్లో వస్తువులను కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈవిషయంలో స్టాక్ లేదని వచ్చిన తర్వాత ఇస్తామని అధికారులు చెబుతున్నారు. అందని నగదు సాయం ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేయించుకున్న వారికి కేసీఆర్ కిట్లతో పాటు మూడు నెలలుగా ఆర్థిక సాయం అందడం లేదు. అమ్మఒడి పథకంలో భాగంగా ఇస్తున్న మొత్తం కూడా అందడం లేదు. మూడు విడతల్లో ఇచ్చే మొత్తం నిలిచిపోయింది. ఆడపిల్ల పుడితే రూ.13,000, మగ పిల్లవాడు పుడితే రూ.12,000 అమ్మ ఒడి పథకంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. కానీ నిధుల లేమి కారణంగా ఆర్థిక సహాయం కూడాఆగిపోయింది. పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారుల వివరాలు అక్టోబర్‌లో 255, నవంబర్‌లో 232, డిసెంబర్లో 262, జనవరిలో 221 ప్రసవాలు జరిగినా డబ్బులు రాలేదు. డిసెంబర్ నుంచి జనవరి వరకు సుమారు 292 మందికి కేసీఆర్ కిట్లు అందలేదు. కేసీఆర్ కిట్‌లో ఇచ్చే వస్తువులుతల్లి, పిల్లల సంరక్షణకు సబ్బు, బేబీ బేడ్షీట్, బేబీ ఆయిల్, దోమ తెర, తల్లిచీర, బ్యాగ్, టవల్, నేప్కిన్లు, బేబీ డ్రెస్, బేబీ పౌడర్, డ్రైపర్స్, షాంపో, ఆట బొమ్మలు. కేసీఆర్ కిట్ ఇవ్వలేదు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం జరిగితే కేసీఆర్ కిట్ ఇవ్వలేదు. ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ఇక్కడి వచ్చాం. కానీ, ప్రసవం జరిగిన మూడు రోజులైనా కేసీఆర్ కిట్ ఇవ్వలేదు. ప్రసవం అయిన వెంటనే ఇవ్వాల్సిన వస్తువులు కూడా అందకపోవడంతో బయట నుంచి కొనుగోలు చేస్తున్నాం. బహిరంగ మార్కెట్లో వస్తువుల ధర ఎక్కువగా ఉంది. స్టాక్ లేదని చెబుతున్నారు. –ప్రియాంక, చౌళ్లరామారం, అడ్డగూడూరు మండలం ప్రభుత్వానికి ఇండెంట్ పంపాం అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ పథకాల్లో భాగంగా రావాల్సిన నగదు, కిట్లు కొంతకాలంగా నిలిచిపోయాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగిన వెంటనే లబ్ధిదారులకు కేసీఆర్ కిట్లతోపాటు ఆర్థిక సాయం అందజేయాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల ఆలస్యమవుతుంది. ప్రతిరోజూ ప్రభుత్వానికి ఇండెంట్ పంపిస్తున్నాం. కిట్లు రాగానే లబ్ధిదారులందరికీ అందజేస్తాం. –డాక్టర్ కోట్యానాయక్, డీసీహెచ్ఎస్ -
బసవతారకం కిట్ల పథకానికి హైకోర్టు బ్రేక్
-
‘మావో’ల సామగ్రి స్వాధీనం
బెల్లంపల్లి : తిర్యాణి మండలం పంగిడి మాదర అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులకు చెందిన సామగ్రి లభించినట్లు ఎస్పీ గజ రావుభూపాల్ తెలిపారు. శనివారం రాత్రి స్థాని క డీఎస్పీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 14వ తేదీన పంగిడిమాదర అడవుల్లో గ్రేహౌండ్స్ పోలీసులు కూంబింగ్ చేపట్టారు. అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు 12 మంది మావోయిస్టులు అలీవ్గ్రీవ్ దుస్తుల్లో ఆయుధాలతో కనిపించారు. సాయుధులైన మావోయిస్టులను లొంగిపోవాల ని హెచ్చరికలు చేయగా పోలీసులపై కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు చేయగా మావోయిస్టులు పారిపోయా రు. అనంతరం ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించగా మావోయిస్టులకు చెందిన కిట్‌బ్యాగులు, మెడికల్ కిట్, విప్లవ సాహిత్యం, హవర్సాక్స్, వంట పాత్రలు, గొడుగులు లభించినట్లు వివరించా రు. జిల్లాలో పట్టు సాధించడానికి మావోయిస్టు జిల్లా కమిటీ కార్యదర్శి బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాకర్ అలియాస్ క్రాంతి, ఏరియా కమిటీ కార్యదర్శి ఆత్రం శోభన్ అలియాస్ చార్లెస్, జిల్లా కమిటీ సభ్యుడు మైలారపు అడేల్లు అలి యాస్ భాస్కర్, ఇద్దరు మహిళా మావోయిస్టులు, మరో తొమ్మిది మంది సభ్యులు సంచరిస్తున్నారన్నారు. ఖాళీ చేయిస్తాం మావోయిస్టులను జిల్లా నుంచి ఖాళీ చేయిస్తామని ఎస్పీ గజరావు భూపాల్ స్పష్టం చేశారు. జిల్లాలో మావోయిస్టుల ఉనికి లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుత పరి స్థితుల్లో మావోయిస్టులు పోలీసులకు లొంగిపోవడమో లేక జిల్లా నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవడ మో చేయాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో డీఎస్పీ కె.ఈశ్వర్రావు, సీఐ బాలాజీ, టూటౌన్ ఎస్హెచ్ఓ మహేశ్‌బాబు, తిర్యాణి ఎస్సై మో హన్, దేవాపూర్ ఎస్సై కె.స్వామి పాల్గొన్నారు.