needy
-
అమెరికా చదువులకు ఐదుగురు గురుకుల విద్యార్థులు
సాక్షి, అమరావతి: అమెరికా చదువులకు ఎంపికైన విద్యార్థులకు అవసరమైన సాయం అందించడమే కాకుండా వాళ్లు తిరిగి వచ్చాక కూడా ఉన్నత చదువులు అభ్యసించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘కెన్నడీ లుగర్–యూత్ ఎక్స్ఛంజ్ అండ్ స్టడీ (కేఎల్–వైఈఎస్)’ కార్యక్రమం ద్వారా ఈ ఏడాది దేశంలో 30 మంది విద్యార్థులకు అమెరికాలో చదువుకునే అవకాశం దక్కింది.వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లనున్న విద్యార్థులు.. డి.నవీన, ఎస్.జ్ఞానేశ్వరరావు, రోడా ఇవాంజిలి, బి.హాసిని, సీహెచ్.ఆకాంక్షలు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎంను కలిశారు. వారితోపాటు గతేడాది అమెరికా వెళ్లి కోర్సు పూర్తి చేసుకుని వచ్చిన విద్యార్థులు.. కె.అక్ష, సి.తేజ కూడా ఉన్నారు. విద్యార్థులను సీఎం జగన్ అభినందించి కుటుంబ నేపథ్యం, విద్యా సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో విద్యార్థికి ప్రోత్సాహకంగా రూ.లక్ష ప్రకటించడంతోపాటు, వారికి శాంసంగ్ ట్యాబ్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ముఖ్య కార్యదర్శి జయలక్షి్మ, ఎస్సీ గురుకులాల సంస్థ కార్యదర్శి పావనమూర్తి తదితరులున్నారు. కేఎల్–వైఈఎస్ ‘కెన్నడీ లుగర్–యూత్ ఎక్స్ఛంజ్ అండ్ స్టడీ ప్రోగ్రామ్‌ను అమెరికాకు చెందిన సాంస్కృతిక వ్యవహారాల శాఖ సాంస్కృతిక మారి్పడి కోసం నిర్వహిస్తోంది. దీనికి ఎంపికైన విద్యార్థులు పది నెలలపాటు అమెరికాలో ఉంటారు. వారిని అక్కడ ఎంపిక చేసిన పాఠశాలలో నమోదు చేస్తారు. ఎంపికైన విద్యార్థులు పరీక్షలు, క్రీడలతోపాటు మొత్తం పాఠశాల ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. విద్యార్థులకు అమెరికాలో ఎంపిక చేసిన కుటుంబాలు ఆతిథ్యం ఇస్తాయి. ఒక్కో విద్యార్థికి దాదాపు 200 డాలర్లు (సుమారు రూ.16,500) నెలవారీ స్టైఫండ్‌ను అందిస్తారు. ఈ ఏడాది ఎంపికైన ఐదుగురు విద్యార్థులు సెపె్టంబర్ మొదటివారంలో అమెరికాకు బయలుదేరి వెళ్తారు. వీరికి అవసరమైన నిత్యావసరాలు, దుస్తులు, బ్యాగులు, మొబైల్ ఫోన్ల కొనుగోలుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆర్థిక సాయం అందిస్తోంది. కాగా, ఈ ఏడాది దేశం మొత్తం మీద 30 మంది ఎంపికైతే మన ఒక్క రాష్ట్రం నుంచే ఐదుగురు గురుకుల విద్యార్థులు ఎంపిక కావడం విశేషమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. పేద కుటుంబం నుంచి అమెరికా మాది విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం పెదగంట్యాడ. అమ్మానాన్న.. సుకాంతి, ప్రవీణ్‌రాజ్. నాన్న చిన్నపాటి కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ గృహిణి. పేద కుటుంబానికి చెందిన నేను అమెరికా చదువులకు ఎంపికయ్యానంటే అది ప్రభుత్వ ప్రోత్సాహమే. – రోడా ఇవాంజిలి, ఇంటర్ సెకండ్ ఇయర్ మధురవాడ అంబేడ్కర్ గురుకులం, విశాఖ కలలో కూడా ఊహించలేదు.. మాది అనకాపల్లి జిల్లా జి.కొత్తూరు. నాన్న కృష్ణ మృతి చెందడంతో అమ్మ రాము కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. నేను అమెరికా చదువుకు ఎంపికవుతానని కలలో కూడా ఊహించలేదు. ప్రభుత్వం, ఉపాధ్యాయుల సహకారం వల్లే ఈ స్థాయికి వచ్చాను. – ఎస్.జ్ఞానేశ్వరరావు, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి, శ్రీకృష్ణాపురం గురుకులం, విశాఖ జిల్లా సీఎం సార్ ప్రోత్సాహమే.. మాది సత్యసాయి జిల్లా మల్లెనిపల్లి. నాన్న నరసింహులు ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్. తల్లి నాగమణి గృహిణి. నేను అమెరికా చదువులకు ఎంపికయ్యానంటే దానికి సీఎం సార్ ప్రోత్సాహమే కారణం. – బలిగా హాసిని, ఇంటర్ సెకండ్ ఇయర్ ఈడ్పుగల్లు ఐఐటీ–నీట్ అకాడమీ,ఎస్సీ గురుకులం, కృష్ణా జిల్లా విద్యాలయాలను తీర్చిదిద్దారు.. మాది ప్రకాశం జిల్లా పుచ్చకాయలపల్లి. నాన్న కేశయ్య రైతు. అమ్మ ఆదిలక్ష్మి గృహిణి. మా వంటి పేద వర్గాల పిల్లలు చదివే విద్యాలయాలను సీఎం వైఎస్ జగన్ ఎంతో బాగా తీర్చిదిద్దారు. నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు. – డి.నవీన, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని, మార్కాపురం గురుకులం, ప్రకాశం జిల్లా ఎప్పటికీ మర్చిపోలేను.. మాది విజయవాడ. నాన్న సురేశ్.. అటెండర్. అమ్మ వనజ గృహిణి. ప్రభుత్వ గురుకులంలో చదివిన నేను అమెరికా చదువులకు ఎంపిక కావడం పట్ల ఆనందంగా ఉంది. సీఎం వైఎస్ జగన్, ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. – ఆకాంక్ష, ఇంటర్ సెకండ్ ఇయర్, ఈడ్పుగల్లు ఐఐటీ–ఎన్ఐటీ అకాడమీ, కృష్ణా జిల్లా -
Anila Parashar: మహిళా పోలీస్..శీతల సైనికురాలు
Madhya Pradesh: Woman Police Anila Parashar donate blankets to homeless people: నిరాశ్రయులై వీధుల్లో తలదాచుకునేవారికి ఒంటిమీద బట్టలే సరిగా ఉండవు. ఇక చలి నుంచి రక్షణకు కంబళ్లు, దుప్పట్లు అంటే కష్టమైన పనే. అలాంటి వారు పడే ఇబ్బందులను గుర్తించిన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో మహిళా సబ్ ఇన్స్పెక్టర్ అనిలా పరాశర్ రాత్రిపూట వీధుల్లో పడుకునే నిరాశ్రయులకు దుప్పట్లు, రగ్గులు పంచుతూ ఉదారతను చాటుకుంటోంది. ఈ మహిళా పోలీస్ చేసే పని పై అధికారులను కూడా కదిలించింది. పోలీసులే బృందాలుగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని మూడేళ్ల నుంచి నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తోంది. అనిలా పరాశర్ చేస్తున్న ఈ దాతృత్వాన్ని తెలుసుకోవడానికి అక్కడి ఏ పోలీసును అడిగినా ఆమె గొప్పతనాన్ని చెబుతారు. కదిలించిన సంఘటనలు మూడేళ్ల క్రితం చలికాలంలో రాత్రిపూట ఆమె విధుల్లో భాగంగా పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు విపరీతమైన చలి కారణంగా కొందరు మహిళలు, వృద్థులు చనిపోవడం చూశామని చెబుతారు అనిల. ‘ఆ హృదయవిదారక సంఘటనలు ఇప్పటికీ నా కళ్లముందు కదులుతూనే ఉంటాయి. ఆ పరిస్థితులను గమనించాక ఇంటి నుంచి దుప్పట్లు, కంబళ్లు తీసుకెళ్లి పంచేదాన్ని. పోలీసుల బృందాలనే కదిలించి.. అది కాస్తా ఓ కార్యక్రమంగా ప్రారంభమైంది. పరిస్థితి వివరించినప్పుడు నా భర్త వికాస్ పరాశర్ కూడా ఇందుకు సాయం చేస్తా అని చెప్పాడు. దీంతో ‘తాండ్ కే సిపాయ్’ (శీతల సైనికుడు) అనే పేరుతో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మా పోలీసులూ ఇందుకు ముందుకు వచ్చారు. ఒక బృందం ఏయే ప్రాంతాల్లో నిరాశ్రయులు ఉన్నారో గుర్తిస్తుంది. ఆ పై నిర్దిష్ట ప్రాంతాల్లో మరో బృందం దుప్పట్లు, కంబళ్లు పంపిణీ డ్రైవ్ నిర్వహిస్తుంది’ అని వివరిస్తారు ఈ మహిళా పోలీస్. సామాజిక సంస్థలూ చేయూత ‘ఈ ధార్మిక కార్యక్రమంలో నేనూ పాలుపంచుకోవడం అనిల భర్తగా పిలిపించుకోవడం నాకు చాలా గర్వంగా ఉందంటారు ఈ మహిళా పోలీస్ భర్త వికాస్ పరాశర్. అనిలా ప్రారంభించిన ఈ కార్యక్రమం మూడేళ్లుగా తన సేవలు అందిస్తోంది. కిందటేడాది ఎనిమిది వేలకు పైగా దుప్పట్లు, కంబ్లళ్లను పంచింది. ‘ఇండోర్‌లో రాత్రిళ్లు పనిచేసే సమయాల్లో అధికారులు సైతం చలిలో వణుకుతూ విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితులు ఎదురవు తుంటాయి. అలాంటి పరిస్థితిలో పోలీసులకు దుప్పట్లను ఇచ్చేవారు. అందులో భాగంగానే పోలీసులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని సామాజిక సంస్థలు కూడా చేరాయి. దీంతో ఈ కార్యక్రమం ద్వారా అసుపత్రులు, అనాథ శరణాలయాల్లోనూ దుప్పట్లు, కంబళ్లు పంపిణీ చేస్తున్నారు. సాధారణంగా ఖాకీ డ్రెస్ వేసుకున్నవారిలో కాఠిన్యమే కనిపిస్తుంది అనుకుంటారు చాలా మంది. కానీ, సమాజ రక్షణలో నలుదిక్కులను గమనించేవారికే సమస్యలు బాగా కనిపిస్తాయని, వాటికి పరిష్కార మార్గం కూడా వారికే బాగా తెలుస్తుందని నిరూపిస్తుంది అనిలా పరాశర్. మహిళా పోలీసుగా ఒక చిన్న అడుగుతో మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడు పోలీసు బృందాలే పనిచేసే దిశగా ఎదిగింది. చదవండి: ‘ఫోర్బ్స్’ లిస్ట్‌లో ఆశా వర్కర్..ఎందుకంటే..? -
సాయం చేసి ఫోటోలు తీసుకోవడమా ?
సాక్షి, హుబ్లీ(కర్ణాటక): దిగజారిన నేటి రాజకీయాల విష వలయంలో తాను ఇరుక్కున్నానని మాజీమంత్రి సంతోష్‌లాడ్ రేషన్ కిట్లు పంపిణీ వేళ ఉద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. కలఘటికి తాలూకా కూడళిగి గ్రామంలో పేదలకు రేషన్ కిట్లు పంపిణీ చేస్తూ ఉద్వేగంతో మాట్లాడారు. కిట్లు ఇచ్చేటప్పుడు చాలా బాధేస్తుందన్నారు. రేషన్కిట్లు ఇచ్చి ఫొటోలు తీసుకోవడం నాకు సిగ్గు కలిగిస్తుందన్నారు. కలఘటికిలో క్యాంటీన్ ఓపెన్ చేశా మని రోజు 1000 మందికి ఆహారం అందిస్తున్నామని ఇది తనకెంతో ఆత్మ సంతృప్తి కలిగిందన్నారు. ప్రస్తుతం సహాయం చేసిన విషయాలన్ని చెప్పు కోవడం వంటి విచిత్రమైన పరిస్థిలో ఉన్నామన్నారు. చదవండి: మొదటి భార్యను వదిలేసి రెండో పెళ్లి.. మూడు రోజులకే.. -
దేవుడి పుస్తకం
అతను చాలా పేదవాడు. అయితేనేం, మానవత్వం మెండుగా ఉన్నవాడు. తను కష్టపడి సంపాదించినదానిలోనే తనకన్నా పేదలకు సాయం చేస్తుంటాడు. అనాథలకు, వృద్ధులకు సేవ చేస్తుంటాడు. ఓ రోజు రాత్రి అతను బాగా అలసిపోయి ఇంటికి వచ్చాడు. వచ్చేటప్పుడు తెచ్చుకున్న ఆహారంలో అధికభాగం ఆకలితోఅలమటించిపోతున్న ఓ అభాగ్యుడికి ఇచ్చేశాడు. మిగిలింది తిని, మేనువాల్చగానే కళ్లు మూతలు పడ్డాయి. కాసేపటిలోనే గాఢనిద్రలోకి జారిపోయాడు. అర్ధరాత్రివేళ అద్భుతమైన సుగంధ పరిమళాన్ని మోసుకు వస్తున్న గాలి వీచింది. చంద్రుడి కాంతి లాంటి చల్లటి వెలుగేదో తన ఇంటిలో మెరుపులు సృష్టిస్తోంది. కళ్లు తెరిచి చూశాడు. అక్కడ ఒక దేవదూత కూర్చుని ఉంది. ఆమె తల వంచుకుని తన వద్ద ఉన్న పుస్తకంలో ఏదో రాసుకుంటోంది. ఆమె దగ్గరకి Ðð ళ్లి, ‘అమ్మా! ఎవరు మీరు? ఏమి రాస్తున్నారు?‘ అని అడిగాడు. ‘దేవుడంటే ఎంతమందికి ప్రేమ, భక్తి ఉన్నాయో తెలుసుకుని వారి పేర్లను ఈ పుస్తకంలో రాస్తున్నాను’ అని చెప్పిందామె. ‘ఆ పుస్తకంలో నా పేరు ఉందేమో చూసి చెప్పమ్మా!‘ అడిగాడు ఆత్రుతగా. వెంటనే పుస్తకమంతా వెదికి పెదవి విరిచిందామె. ‘అవునులే, ఎలా ఉంటుంది మరి, తోటి వారికి సాయం చేయడం, కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవడం.. అంతకు మించి నేను పూజలేమీ చేయను. కనీసం గుడికి కూడా వెళ్లనెప్పుడూ’’ అంటూ నిట్టూర్చాడతను. దేవదూత నవ్వుతూ వెళ్లిపోయింది. కొద్దిరోజుల తర్వాత మళ్లీ ఒక అర్ధరాత్రి అంతకుమునుపు కలిగిన అనుభవమే ఎదురైందతనికి. కళ్లు తెరిచి చూశాడు. అప్పుడు కనిపించిన ఆమే మళ్లీ ఏదో రాసుకుంటూ కనిపించింది. ఆమె చేతిలోని పుస్తకాన్ని అలాగే చూస్తున్నాడతను. ఈసారి అతనేమీ అడగకుండానే దేవదూత అతనివైపు చూసి నవ్వింది చల్లగా. ‘ఏంటి అలా చూస్తున్నావు, ఇది దేవుడు ప్రేమించే వారి పేర్లు ఉన్న పుస్తకం. చూస్తావా?’ అనడిగింది. ‘తప్పక చూస్తాను తల్లీ!‘ అంటూ అతను ఆ పుస్తకాన్ని అందుకున్నాడు. తన పేరు ఎలాగూ ఉండదని వెనకనుంచి అందులోని ఒక్కోపేజీ తిరగేస్తున్నాడు. తన పేరు ఎక్కడా కనిపించడం లేదు. కొంచెం బాధతోటీ, అపనమ్మకంతోటీ అలా తిరగేస్తూ మొదటిపేజీకి వచ్చాడు. ఆశ్చర్యం! అందులోని మొదటి పేరు తనదే! దేవుడిని అందరూ ప్రేమిస్తారు. కానీ దేవుడి ప్రేమను అందుకోవాలంటే ముందు మన తోటివారిని ప్రేమించగలగాలి. – డి.వి.ఆర్. -
ఉద్యోగం ఇప్పిస్తానని టీడీపీ నేత టోకరా
అమలాపురం టౌన్: కోర్టులో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ యువతి వద్ద రూ.లక్షల్లో సొమ్ములు కాజేసిన అయినవిల్లి మండలం టీడీపీ నాయకుడు, ఆ మండల జెడ్పీటీసీ సభ్యురాలి భర్త గంగుమళ్ల శ్రీనివాసరావుతోపాటు మరో అయిదుగురిపై కేసు నమోదైంది. అమలాపురం రూరల్ మండలం తాండవపల్లికి చెందిన ఆ యువతికి టీడీపీ నాయకుడు శ్రీనివాసరావుతోపాటు అదే గ్రామానికి చెందిన మూసాబత్తుల వెంకటేశ్వరరావు, లైన్మెన్ అంజిబాబు, మంగం సత్యనారాయణ, సుప్రీమ్, నరేష్‌లు కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తామని ఆమె వద్ద నుంచి మొత్తం రూ.3.70 లక్షలు కాజేసినట్లు ఆ యువతి అమలాపురం పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్‌కు బాధితురాలి తండ్రి, ఐద్వా నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకుడు శ్రీనివాసరావుకు చెందిన బ్యాంక్ అకౌంట్లో ఆ యువతి రూ.2.60 లక్షలు నగదు ఆమె డిపాజిట్ చేశారు, తరువాత శ్రీనివాసరావు అనుచరులైన అయిదుగురు దఫాదఫాలుగా ఆమె నుంచి రూ.1.10 లక్షలు తీసుకుని మొత్తం రూ.3.70 లక్షలు తీసుకున్నట్లు యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరకు తాండవపల్లికి చెందిన అయిదుగురు వ్యక్తులు అమలాపురం బైపాస్ రోడ్డుకు రమ్మని నమ్మించి కారులో బలవంతంగా కిడ్నాపు చేయడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించారని, డబ్బులిచ్చినట్లు ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదులో ప్రస్తావించింది. ఏపీ 37 బీవీ 3787 నెంబరు గల తెలుపు కారులో సాయంత్రం ఆరు గంటల వరకూ తిప్పి చల్లపల్లి దారిలో వదిలేసి వెళ్లిపోయారని పేర్కొంది. తన ఫోన్లో సిమ్ కూడా లాక్కుని వదిలేశారని చెప్పింది. బ్యాంకులో రూ.2.60 లక్షలు వేసినట్లుగా ఉన్న బ్యాంక్ ఓచర్లు, కౌంటర్ ఫైల్‌ను యువతి తన ఫిర్యాదు పత్రంలో జత చేశారు. కేసు నమోదు... : ఆ వ్యక్తులపై కిడ్నాపు, బెదిరింపు, చీటింగ్, అసభ్యకర ప్రవర్తన కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. జిల్లా ఐద్వా కార్యదర్శి సీహెచ్.రమణి బాధిత యువతికి అండగా నిలిచి దగ్గురుండి పోలీసులకు ఫిర్యాదు చేయించారు. -
ఉద్యోగం ఇప్పిస్తానని టీడీపీ నేత టోకరా
-
ఆ మెసేజ్ నమ్మొద్దు..!
డయల్ 1098... మెసేజ్... ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరస్ లా వ్యాపించి అందర్నీ మోసగిస్తోంది. భారత దేశంలో పేదపిల్లలకు అదనపు ఆహారాన్ని ఛైల్డ్ లైన్ ఇండియా ద్వారా అందించేందుకు... మోదీ ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశ పెట్టిందంటూ వాట్సాప్ లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. ఇదో మంచి ప్రయత్నమే కావడంతో వాట్సాప్ గ్రూపులు, వ్యక్తులు ఈ సందేశానికి విపరీతంగా ప్రాచుర్యం కల్పిస్తున్నారు. అయితే ఇది పూర్తిగా బూటకం అని, ఈ మెసేజ్ ను ఎవ్వరూ నమ్మొద్దని ఛైల్డ్ లైన్ ఇండియా హెచ్చరిస్తోంది. నిరుపేదలు, అన్నార్తులకు సహాయం అందించడం నిజంగా మెచ్చుకోదగ్గ కార్యక్రమం. అటువంటి కార్యక్రమాలు ఎవరు ప్రవేశ పెట్టినా దానికి ప్రచారం కల్పించడం కూడా అవసరం. అటువంటి పనులు చేసే ముందు కాస్త ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందని ఇప్పడు 'డయల్ 1098' ద్వారా తెలుస్తోంది. మనకు వచ్చిన ఏ మెసేజ్ నైనా ముందు.. వెనుకా ఆలోచించకుండా ఫార్వర్డ్ చేసేయడం అంత మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భం హెచ్చరిస్తోంది. నిజంగా ఇతరులకు సహాయం చేయాలనుకున్నవారు ఇటువంటి మెసేజ్ లు చూసినప్పుడు కాస్త లోతుగా దృష్టి పెట్టాలని సూచిస్తోంది. గుడ్ న్యూస్ అంటూ... కొన్నాళ్ళ క్రితం నుంచీ వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్న డయల్ 1098 మెసేజ్ గురించి ఎంతోమంది ఛైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్ కు ఫోన్లు కూడా చేశారట. నిజంగా ఇటువంటి పథకం ఏమీ లేదని చెప్పడంతో ఎంతో నిరాశకు గురయ్యారట. పిల్లల హక్కులను కాపాడే ప్రముఖ ఎన్జీవో సంస్థ 1996లో ప్రారంభమైనప్పటినుంచీ వీధిబాలల (స్ట్రీట్ చిల్డ్రన్) కోసం ఓ ప్రత్యేక హెల్స్ లైన్ నెంబర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇటువంటి మెసేస్ లు వచ్చినపుడు, కార్యక్రమాల గురించి విన్నపుడు తమకు కాల్ చేయమని సలహా ఇస్తోంది. ఇటువంటి సందేహాలపై సలహాలను తమ వెబ్ సైట్ లో అందిస్తామని కూడా చెప్తోంది. పార్టీ పూర్తయిన తర్వాత మిగిలిన ఆహార పదార్థాలు తీసుకుంటారా అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేయడం సంస్థ సభ్యులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటువంటి చైన్ లింక్ మెసేజ్ లు, మెయిల్స్ నమ్మొద్దని, 1098 కేవలం చిన్నారుల భద్రత, రక్షణ కోసం ఏర్పాటు చేసిన నెంబర్ అని సంస్థ నిర్వాహకులు వివరిస్తున్నారు. తాము ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం, పంచడం వంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని, ఇది పూర్తిగా మోసపూరిత మెసేజ్ అని చెప్తున్నారు. దయచేసి ఇటువంటి సందేశాలను సర్క్యులేట్ చేయొద్దని, ఈ విషయంలో తమకు సహకరించాలని కోరుతున్నారు.