
ఆత్మారామ్ తోమర్(ఫైల్ ఫోటో)
లక్నో: బీజేపీ సీనియర్ నేత ఉత్తరప్రదేశ్ మాజీమంత్రి ఆత్మారామ్ తోమర్ (75) అనుమానాస్పద స్థితిలో మరణించారు. యూపీలోని బాగ్‌పత్ జిల్లా బారౌత్ బిజ్రాల్ రోడ్‌లోని ఆయన నివాసంలో గురువారం అర్థరాత్రి చనిపోయి ఉండటం కలకలం రేపింది. మెడకు టవల్ చుట్టి ఉండటం, ఆయన స్కార్పియో కారు అదృశ్యం కావడంతో హత్యకు గురయ్యారనే అనుమానాలు బలపడుతున్నాయి.
సంఘటనా స్థలంలో పోలీసులు, కార్యకర్తలు
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఆత్మారామ్‌ను టవల్‌తో గొంతుకు ఉరి బిగించి చంపినట్లు తెలుస్తోంది. పోలీస్ ఉన్నతాధికారులు డాగ్ స్క్వాడ్‌తో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన ఇంటి తలుపు బయటి నుండి లాక్ చేసి ఉన్నట్టు జిల్లా ఎస్‌పీ నీరజ్ కుమార్ జడౌన్ తెలిపారు. దగ్గరి బంధువులపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కాగా ఆత్మారామ్ 1997లో యూపీ మంత్రిగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment