suspiciouis death
-
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
చిన్నంబావి: అనుమానాస్పదంగా యువకుడు మృతిచెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ ఓబుల్ రెడ్డి తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలో రత్నగిరి కాలనీలో నివాసం ఉంటున్న కాటం మల్లేష్(30) పెద్దదగడకి చెందిన మణెమ్మతో కలిసి ఇక్కడే నివాసం ఉంటున్నాడు. సోమవారం రాత్రి అతిగా మద్యం తాగి గుండెపోటుకు గురై మృతిచెంది ఉంటాడని, తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. తండ్రి వెంకటస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామన్నారు. -
అనుమానాస్పద స్థితిలో ఎయిర్ హోస్టెస్ మృతి
ముంబై : ఎయిరిండియాలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తోన్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూపా ఓగ్రే అంధేరీలోని తన ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె గొంతుపై ఎవరో కత్తితో కోసిన గుర్తు ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూపా ఓగ్రే (25) ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్ ట్రైనీగా విధుల్లో చేరారు. ఇదే ఏడాది ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్ నుంచి ముంబై మకాం కూడా మార్చారు. అంధేరీ హౌసింగ్ సొసైటీలో ఒక ఫ్లాట్ తీసుకుని తన సోదరితో కలిసి నివసిస్తున్నారు. వీరితోపాటు రూపా బాయ్‌ఫ్రెండ్ కూడా ఇదే ఫ్లాట్‌లో ఉంటున్నాడు. అయితే కొద్దీ రోజుల క్రితమే అతను తన సొంతూరు వెళ్లాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలి గొంతుపై కత్తితో కోసిన గాటు ఉందని.. అంధేరీ పోలీసులు బృందాలుగా విడిపోయి హంతకుల గురించి గాలిస్తున్నట్లు తెలిపారు. విచారణ నిమిత్తం ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నామని హౌసింగ్ సొసైటీలోని సెక్యూరిటీ కెమెరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. రూప ఓగ్రే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందనే విషయం ఆమె హ్యండిల్స్ ను పరిశీలిస్తే అర్థమవుతుంది. An airhostess - Rupal Ogrey - was found dead at her luxury flat in Mumbai. She was a trainee air hostess. It is reported that her throat has been slit.She had joined the training last April and was residing with her beau and brother. The incident came to light when police paid… pic.twitter.com/CUKzwGksgI— NewsFirst Prime (@NewsFirstprime) September 4, 2023 ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం -
శ్రీకాంత్ చనిపోయిన విషయం ఉదయం తెలిస్తే సాయంత్రం వస్తారా...
వరంగల్: జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని నెల్లుట్లకు చెందిన తాండ్ర శ్రీకాంత్ (30) బుధవారం తెల్లవారు జామున నెల్లుట్ల శివారు ఆర్టీసీ కాలనీలో అద్దెకు ఉంటున్న ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. నెల్లుట్లకు చెందిన తాండ్ర శ్రీకాంత్‌కు పాలకుర్తి మండలం బమ్మెరకు చెందిన నందిని అలియాస్ అక్షరతో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. శ్రీకాంత్‌కు నలుగురు అన్నదమ్ములు కావడంతో ఇల్లు సరిపోక కొద్ది రోజులు అద్దె ఇళ్లలో ఉన్నాడు. భార్యభర్తలు ఇద్దరు తరచుగా గొడవ పడడంతో అక్షర మూడు నెలల క్రితం తల్లిదండ్రులు ఉంటున్న హైదరాబాద్ అంబర్‌పేటకు వెళ్లింది. అక్కడే పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో భార్యభర్తలు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. 15 రోజుల క్రితమే అత్తగారింటికి వచ్చిన అక్షర నెల్లుట్ల సమీపంలోని ఆర్టీసీ కాలనీలో భర్తతో అద్దె ఇంట్లో ఉంటున్నారు. బుధవారం భర్త శ్రీకాంత్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అక్షర అతని కుటుంబ సభ్యులకు తెలియజేయగా బంధువులు, అన్నదమ్ములు అక్కడికి వెళ్లగా మంచం సమీపంలో నేలపై పడుకొని చనిపోయి ఉన్నాడు. ఉరి వేసుకున్నాడని చెబుతున్నప్పటికీ, మృతదేహం నేలమీద ఎందుకు ఉందని బంధువులు ప్రశ్నించగా నేనే ఉరితాడు కోసేశానని చెప్పుతూ ఇంట్లో టీవీ చూస్తూ పాటలు వింటుండడంతో మరింత అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ప్రవీణ్ సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతుడి భార్య అక్షరను పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్షర తల్లి, బంధువులు కారులో సాయంత్రం నాలుగున్నర గంటలకు నేరుగా పోలీసుస్టేషన్‌కు చేరుకోగానే అక్కడే ఉన్న బంధువులు.. శ్రీకాంత్ చనిపోయిన విషయం ఉదయం ఏడుగంటలకు తెలిస్తే సాయంత్రం నాలుగు గంటలకు వస్తారా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో బంధువులతో వాగ్వాదం నెలకొంది. అప్పుడే పోలీసేస్టేషన్‌కు చేరుకున్న ఎస్సై ప్రవీణ్ అందరిని స్టేషన్ బయటకు పంపించి మృతుడు శ్రీకాంత్ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనుమానాస్పద మృతి
లక్నో: బీజేపీ సీనియర్ నేత ఉత్తరప్రదేశ్ మాజీమంత్రి ఆత్మారామ్ తోమర్ (75) అనుమానాస్పద స్థితిలో మరణించారు. యూపీలోని బాగ్పత్ జిల్లా బారౌత్ బిజ్రాల్ రోడ్‌లోని ఆయన నివాసంలో గురువారం అర్థరాత్రి చనిపోయి ఉండటం కలకలం రేపింది. మెడకు టవల్ చుట్టి ఉండటం, ఆయన స్కార్పియో కారు అదృశ్యం కావడంతో హత్యకు గురయ్యారనే అనుమానాలు బలపడుతున్నాయి. సంఘటనా స్థలంలో పోలీసులు, కార్యకర్తలు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఆత్మారామ్‌ను టవల్‌తో గొంతుకు ఉరి బిగించి చంపినట్లు తెలుస్తోంది. పోలీస్ ఉన్నతాధికారులు డాగ్ స్క్వాడ్‌తో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన ఇంటి తలుపు బయటి నుండి లాక్ చేసి ఉన్నట్టు జిల్లా ఎస్పీ నీరజ్ కుమార్ జడౌన్ తెలిపారు. దగ్గరి బంధువులపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కాగా ఆత్మారామ్ 1997లో యూపీ మంత్రిగా పనిచేశారు. -
ఐసీయూలో ఐస్‌క్రీం తిని అత్త.. హోటల్ రూంలో మేనల్లుడు మృతి
గురుగ్రామ్: తీవ్ర అస్వస్థకు గురై ఆస్పత్రిలో చేరిన ఓ ఎయిర్‌హోస్టెస్ ఐసీయూలో ఐస్ క్రీం తిని మృతి చెందగా.. మరుసటి రోజే ఆమె మేనల్లుడు హోటల్ రూంలో విగతజీవిగా కనిపించాడు. వీరిద్దరి మృతి పట్ల సోషల్ మీడియాలో పలు అనుమానాలు తలెత్తుతుండటంతో మేఘాలయా తురా పార్లమెంట్ సభ్యుడు అగాథ సంగ్మా ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వం శాఖకు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ కేసును ఢిల్లీ, గురుగ్రామ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వివరాలు.. నాగాలాండ్‌కు చెందిన రోసి సంగ్మా (29) ఎయిర్ హోస్టెస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె తన మేనల్లుడి సామువేల్ సంగ్మాతో కలిసి హరియాణ గురుగ్రామ్‌లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఈ క్రమంలో గత నెల 23న రోసి ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. కాళ్లు,చేతుల్లో విపరీతమైన నొప్పి, తీవ్ర రక్తస్రావంతో బాధపడింది. దాంతో సామువేల్, రోసిని ఢిల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చించాడు. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో మరుసటి రోజు ఉదయం అనగా జూన్ 24 ఉదయం, రోసిని గురుగ్రామ్ సెక్టార్ 10లోని ఆల్ఫా హాస్పిటల్‌కు తరలించారు. ఆల్ఫా ఆస్పత్రి ఐసీయూలో చేర్చిన తర్వాత రోసి కోలుకుందని తెలిపాడు సామువేల్. తీవ్ర అనారోగ్యానికి గురై.. ఇబ్బంది పడిన రోసి ఆ తర్వాత ఆల్ఫా హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నప్పుడు ఐస్‌క్రీం తిన్నదని తెలిపాడు. ఆ సమయంలో రోసి ఎదురుగా డాక్టర్లు ఉన్నారని.. కానీ ఆమెను వారించలేదని ఆరోపించాడు. దాంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా పాడయి.. మరణించిందని తెలిపాడు సామువేల్. దీని గురించి ప్రశ్నించిన తనను ఆల్ఫా ఆస్పత్రి సిబ్బంది కిందపడేసి చితకబాదారన్నాడు. రోసి చనిపోయిన విధానం తెలియజేస్తూ సామువేల్ వీడియో రూపొందించి, న్యాయం చేయాల్సిందిగా కోరుతూ.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ మరుసటి రోజే ఓ హోటల్ రూంలో సామువేల్ మృతదేహం వెలుగు చూడటం కలకలం రేపింది. సామువేల్, రోసిల మృతిపై సోషల్ మీడియాలో పలు అనుమానాలు వ్యక్తం చేశారు నెటిజనులు. సామువేల్ మృతి గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకుని సామువేల్ చనిపోయినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆల్ఫా హాస్పిటల్ యాజమాన్యం ఈ సంఘటనపై స్పందించింది. తమ ఆస్పత్రికి వచ్చాక రోసి ఆరోగ్యం మెరుగైందని.. ఈ క్రమంలో ఐసీయూలో ఉన్న ఓ పేషెంట్ ఐస్‌క్రీం తినడం చూసిన రోసి.. తనకు కూడా కావాలని అడిగిందని తెలిపారు. రోసి తన ఇష్టప్రకారమే ఐస్ క్రీం తిన్నదని ఆస్పత్రి సిబ్బంది స్పష్టం చేశారు. ఇక సామువేల్‌పై తాము దాడి చేయలేదని తెలిపారు. ఈ ఘటనపై సామువేల్ తండ్రి స్పందిస్తూ.. ‘‘నా కుమారుడు చనిపోయేంత పిరికివాడు కాదు. రోసికి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాడు. చనిపోయే రోజు తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో నాకు కాల్ చేసి మాట్లాడాడు. మరికాసేటికే చనిపోయాడని తెలిసింది. తప్పకుండా ఏదో జరిగే ఉంటుంది’’ అన్నాడు. -
ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్య.. అనుమానాలు
సాక్షి, హైదరాబాద్: కీసర ఎమ్మార్వో నాగరాజు మృతి కేసులో అనుమానాలు ఉన్నాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నాగరాజుది ఆత్మహత్య కాదు, ముమ్మాటికీ హత్యేనని వారు ఆరోపిస్తున్నారు. జైల్లో ఆత్మహత్య ఎలా సాధ్యమని వారు ప్రశ్నిస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటుంటే జైలు సిబ్బంది ఏం చేశారు? జైలు సిబ్బందిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు అని సందేశాలు వ్యక్తం చేశారు. ఏసీబీ కేసుల్లో వాస్తవం లేదని తమ వద్ద ఆధారాలున్నాయని తెలిపారు. ఇప్పటికే సీసీ ఫుటేజీ ఏసీబీ కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. ఈ విషయంలో సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేస్తామని నాగరాజు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికే నాగరాజు కుటుంబ సభ్యులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. చదవండి: నాగరాజుది హత్యే.. -
సంక్రాంతికి మీ ఇంటికా.. మా ఇంటికా?
సాక్షి, ఒంగోలు: స్థానిక మహేంద్రనగర్‌లో నివాసం ఉంటున్న ఓ కానిస్టేబుల్ భార్య తాను నివాసం ఉండే ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా సుబేదార్‌పేటకు చెందిన అనూష(25)కు 2015లో ఉలవపాడుకు చెందిన బి.నాగరాజుతో వివాహమైంది. నాగరాజు ఏఆర్ ఒంగోలు విభాగంలో బాంబు డిటెక్షన్ స్క్వాడ్‌లో పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. స్థానిక మహేంద్రనగర్‌లో అనూష ఉరేసుకుందని, ఆమె మృతదేహం స్థానిక ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్నట్లు టూటౌన్ పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వచ్చి ఆమె గొంతు చుట్టూ నల్లగా కమిలిన మచ్చను పరిశీలించారు. అనంతరం సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా చీరె కోసి ఉంది. ఆమె భర్త కానిస్టేబుల్ నాగరాజును విచారించారు. చదవండి: కొంపముంచిన విదేశీ యువతితో ఫేస్బుక్ పరిచయం తాను ఉదయం రోల్ కాల్‌కు వెళ్లి వచ్చానని, టిఫిన్ తీసుకొచ్చేందుకు తాను బయటకు వెళ్లి వచ్చే సరికి తన భార్య చీరెతో ఉరేసుకున్నట్లు కనిపించిందని, చీర కోసి ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు కానిస్టేబుల్ నాగరాజు పోలీసు అధికారులకు తెలిపాడు. దీనిపై ఆ దంపతుల నాలుగేళ్ల పాపను విచారించగా ఊరికి అమ్మగారింటికా, అత్తగారింటికా అన్న విషయంలో గొడవ పడ్డారని పేర్కొంటోంది. పోలీసులు మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. తహసీల్దార్ శవ పంచనామా చేశారు. అనంతరం మృతురాలి తల్లి ప్రభావతి ఒంగోలు చేరుకుని కన్నీరుమున్నీరైంది. అనంతరం ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వరకట్నం వేధింపుల కేసు నమోదు చేశారు. ఫిర్యాది కథనం ప్రకారం.. వివాహం సమయంలో రూ.2.50 లక్షల కట్నం, 15 సవర్ల బంగారు ఆభరణాలు ఇచ్చారు. అయినా ఇంకా కట్నం కావాలంటూ వివాహమైన కొద్దికాలం నుంచే భార్యను నాగరాజు వేధించేవాడు. ఈ నేపథ్యంలోనే తన కుమార్తె మృతిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని పేర్కొంటూ తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు ప్రాథమికంగా వరకట్నం వేధింపుల కారణంగా మరణించినట్లు పేర్కొంటూ మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఆత్మహత్య లేక హత్య అన్న దానిపై స్పష్టత వస్తుందని ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. -
అమెరికాలో నగరవాసి అనుమానాస్పద మృతి
నాగోలు: నగరానికి చెందిన ఓ మహిళ అమెరికాలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. భర్త వేధింపులే ఆమె ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నాగోలు సాయినగర్కాలనీకి చెందిన గజం కృష్ణయ్య–పారిజాత దంపతుల రెండో కూతురు వనిత (30)కు కొత్తపేటకు చెందిన రాచకొండ శివకుమార్‌తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. శివకుమార్ అమెరికాలో నార్త్ కరోలినాలో నివాసముంటున్నాడు. వృత్తిరీత్యా సాప్ట్వేర్ ఇంజనీర్. నాలుగేళ్ల క్రితం ఇండియాలో ఉందామంటూ పిల్లలు, భార్యతో కలసి శివకుమార్ నగరానికి వచ్చాడు. 15 రోజుల తర్వాత ఇద్దరు పిల్లలను తన తల్లిదండ్రుల వద్ద ఉంచి, భార్యను పుట్టింటిలో వదిలి అన్నీ సెటిల్ చేసుకొని వస్తానంటూ అమెరికా వెళ్లిపోయాడు. భార్యకు తెలియకుండానే ఇటీవల పిల్లలను అమెరికా తీసుకెళ్లాడు. అప్పటి నుంచి భార్యకు ఫోన్ చేయడంగానీ, అమెరికాకు తీసుకెళ్లేందుకుగానీ ప్రయత్నించలేదు. పెద్దల ఒత్తిడితో 4 నెలల క్రితం శివకుమార్ వీసా పంపడంతో ఆమె అమెరికా వెళ్లింది. కానీ శివకుమార్ తిరిగి భార్యను వేధించసాగాడు. భర్త వేధింపులు ఎక్కవ కావడంతో అమెరికా కాలమానం ప్రకారం ఈ నెల 4న సాయంత్రం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ప్లాస్టిక్ కవర్‌ను తొడు క్కొని ఊపిరి ఆడకుండా చేసుకుని మృతి చెందినట్లు కృష్ణయ్య తెలిపారు. శివకుమార్ వేధింపుల కారణంగానే తన కూతురు వనిత మృతి చెందిందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ సీఐని కృష్ణయ్య కోరారు. కూతురి మృతదేహాన్ని నగరానికి త్వరగా తీసుకొచ్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
దంపతుల అనుమానాస్పద మృతి
-
తాగిన మత్తులో స్నేహితున్ని చంపేశారు
సాక్షి, ఓర్వకల్లు(కర్నూలు) : మద్యంమత్తులో స్నేహితుల దాడిలో గాయపడిన ఓ యువకుడు కోలుకోలేక సోమవారం మృతిచెందాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నివేదిక, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మంగళవారం హత్య కేసుగా మార్పు చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని భైరాపురం గ్రామానికి చెందిన బొగ్గుల రంగస్వామి కుమారుడు బొగ్గుల రాజశేఖర్(29) కర్నూలు నగరంలో ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. రోజూ ఉదయంవెళ్లి సాయంత్రం గ్రామానికి తిరిగి వచ్చేవాడు. ఈ క్రమంలో గత నెల 27న కర్నూలు నుంచి లొద్దిపల్లె మీదుగా భైరాపురానికి వస్తూ మార్గమధ్యంలో రోడ్డు కల్వర్టుపై కూర్చొని మద్యం తాగుతుండగా స్నేహితులు అదే గ్రామానికి చెందిన సిలువ రాజు, డోన్ రవి అక్కడకు చేరుకొని రాజశేఖర్‌తో కలిసి మద్యం తాగారు. తర్వాత రాత్రి 11.00 గంటలకు సిలువ రాజు, డోన్ రవి గ్రామానికి చేరుకొని రాజశేఖర్ అతిగా మద్యం తాగి బ్రిడ్జి నుంచి కిందపడ్డాడని అతని కుటుంబ సభ్యులకు చెప్పారు. వారు హుటాహుటిన అక్కడకు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో పడివుండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య సేవలు అందిన తర్వాత కాస్త స్పృహలోకి వచ్చి తనపై ముగ్గురు వ్యక్తులు కర్రలతో దాడి చేసినట్లు చెప్పి, సోమవారం మృతిచెందాడు. ఎస్ఐ సుధాకర్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లి మృతదేహానికి పంచనామా నిర్వహించారు. తలపై బలమైన రక్తగాయం కావడంతో పాటు శరీరంలో మూగ దెబ్బలు తగిలినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడి కావడంతో హత్యకు గురైనట్లు నిర్ధారణ కావడంతో ఎస్ఐ పోస్ట్‌మార్టం నివేదికలను కర్నూలు రూరల్ సీఐ పవన్ కిశోర్‌కు అందజేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హతుని భార్య రేణుక ఫిర్యాదు మేరకు ఆంజనేయులు, డోన్ రవి, సిలువ రాజుపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
హత్యా..ఆత్మహత్యా?
కాశీబుగ్గ: వృద్ధురాలు అనుమానాస్పదంగా సీలింగ్ ఫ్యానుకు వేళాడుతూ మృతి చెందిన సంఘటన పలాస పరిసర ప్రాంతాల్లో సంచలనంగా మారింది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిని 23వ వార్డు రాజమ్మకాలనీకి (గాంధీనగర్) చెందిన తంగుడు లక్ష్మి(63) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. అందరికీ వివాహాలు చేశారు. లక్ష్మి భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. ఆమె ఇద్దరు కుమారులు రామచంద్రరావు (రాజు), కిశోర్‌లు వేర్వేరు ఇళ్లల్లో కాపరం ఉంటున్నారు. రామచంద్రరావు (రాజు) ఇంట్లో లక్ష్మి ఉంటోంది. జీడిపప్పు వ్యాపారం చేస్తున్న రాజుకు 2007 మార్చిలో శ్రీకాకుళం పట్టణంలోని మంగువారితోట ప్రాంతానికి చెందిన జామి సూర్యారావు కుమార్తె సౌజన్యతో వివాహం జరిగింది. కోడలు సౌజన్య తన పిల్లలతో ఆదివారం శ్రీకాకుళంలోని కన్నవారింటికి చేరుకుంది. తండ్రి సూర్యారావుకు పిల్లలను అప్పగించి నగరంలోని కొత్త వంతెన (నాగావళి)పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె తండ్రి జామి సూర్యారావు శ్రీకాకుళం టూ టౌన్ పోలీసు స్టేషన్లో అత్త లక్ష్మి(మృతురాలు), ఆడపడుచులు పావని, ప్రియ వేధింపులకు గురిచేశారని ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం టిఫిన్ సిద్ధం చేసిన అనంతరం 9:30 నిమిషాలకు ఫ్యానుకు మృతదేహం వేళాడుతున్నట్లు సమాచారం బయటకు రావడంతో విషయం అందరికీ తెలిసింది. కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఐ రాజేంద్రప్రసాద్ మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం పలాస ఆస్పత్రికి తరలించారు. ఆమె కడుపునొప్పిని తాళలేక ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందిందని కాశీబుగ్గ సీఐ చంద్రశేఖరం కేసు నమోదు చేశారు. మృతురాలు వృద్ధురాలు కావడంతో ఎత్తైన ఫ్యానును ఎలా ఉరి వేసుకుంటుందని, పూర్తిగా కాలు భూమికి తాకడం చూసిన బంధువులు, పరిసర ప్రాంతీయులు మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. -
గిరిజన యువతి మృతిపై అనుమానాలెన్నో...?
సాలూరురూరల్ (పాచిపెంట) : పాచిపెంట మండలంలోని విశ్వనాథపురం పంచాయతీ మంచాడవలస గ్రామానికి చెందిన గిరిజన యువతి చీమల దివ్య (17) విశాఖపట్నంలోని ఓ అపార్ట్మెంట్లో ఉరివేసుకుని శనివారం మృతి చెందింది. అయితే ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్తులు తెలియజేసిన వివరాలు మేరకు... దివ్య పాచిపెంట మండలంలో గతేడాది పదో తరగతి చదివింది. కుటుంబ పోషణ కష్టంగా మారడంతో తల్లిదండ్రులు చీమల కృష్ణ, పోలమ్మ, చెల్లెలు వెంకటలక్ష్మితో కలిసి విశాఖపట్నానికి వలసపోయారు. కృష్ణ, పోలమ్మలు కూలి పనులు చేసుకుంటుండగా దివ్య సిరిపురంలోని బాలాజీ అపార్ట్మెంట్లో ఉన్న వృద్ధ దంపతులైన నాటల గోపాలకృష్ణ, అనసూయలకు సహాయకురాలిగా పనిచేస్తోంది. ఇదిలా ఉంటే దివ్య శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అపార్ట్మెంట్లో ఆమె ఉంటున్న గదిలో ఉరివేసుకుని చనిపోయింది. దివ్య మృతిచెందడానికి కొంతసేపటి ముందు ఎవరితోనో ఫోన్లో సూమారు 10 నిమిషాలు మాట్లాడిందని, తర్వాత ముభావంగా ఉంటూ స్నానానికి తన రూమ్‌లోకి వెళ్లినట్లు తెలియవస్తోంది. అయితే దివ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని కుటుంబ సభ్యులు, బంధువులు చెబుతున్నారు. మృతి వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రెండో కూతురు వెంకటలక్ష్మి రజస్వల కావడంతో ఆమెను తీసుకుని అమ్మమ్మగారు ఊరైన పనుకువలస గ్రామానికి ఈనెల 15న తల్లి పోలమ్మ వచ్చింది. తిరిగి శనివారం బయలుదేరుతుండగా కుమార్తె మృతి చెందిందని వార్త తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివారం సాయంత్రం మంచాడవలసలో దివ్య అంత్యక్రియలు నిర్వహించారు. దివ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
న్యాయం కోసం మృతదేహంతో ఆందోళన
మక్కువ: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ముందు రహదారిపై న్యాయం కోసం మృతదేహంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చేసిన సంఘటన మంగళవారం చోటు చేసుకొంది. తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించడంతో డీఎస్పీ సౌమ్యలత వచ్చి వారిని శాంతింపజేశారు. చివరకు మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శాంతించారు. వివరాల్లోకి వెళ్తే...మండలంలోని సరాయివలస గ్రామానికి చెందిన గులిపల్లి సన్యాసినాయుడు ఈ నెల 5న గ్రామ సమీపంలోని వెంగళరాయసాగర్ కాలువ నుంచి తమ పంట పొలానికి నీరు కట్టేందుకు వెళ్లాడు. తరువాత కనిపించని సన్యాసినాయుడు ఈ నెల 9న విగతజీవుడై కనిపించిన విషయం పాఠకులకు విదితమే. దీనిపై ఎస్ఐ వెలమల ప్రసాదు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మంగళవారం సాలూరు సీహెచ్‌సీకి పోస్టుమార్టం కోసం తరలించారు. తరువాత సాలూరు నుంచి సరాయివలస తీసుకువచ్చారు. అనుమానంతోనే... అంతా జరిగిన తరువాత సన్యాసినాయుడు మృతిపై కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. కాలువలో మృతదేహం బొర్లా పడి ఉండడంతో కుటుంబ సభ్యులు హత్యకు గురై ఉంటాడని అనుమానిస్తున్నారు. దీంతో మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చిన సమయంలో పోస్టుమార్టం నివేదికలో గాయాల్లేవని, కేసు మూసి వేస్తారన్న అనుమానంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహించి పోలీస్‌స్టేషన్ వద్దకు మృతదేహంతో తరలివచ్చారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్ వద్దే ఆటోలో ఉంచి మిగతా వారంతా పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. నిందితులను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. ఈ క్రమంలో పోలీసులకు, మృతుని కుటుంబ సభ్యులకు మధ్య వాదులాట చోటు చేసుకొంది. ఎస్ఐ న్యాయం చేస్తామని చెప్పినా వినకపోవడంతో బొబ్బిలి డీఎస్పీ సౌమ్యలత, సీఐ సయ్యద్ మహ్మద్ మక్కువ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించి వెనుదిరిగారు. పోలీస్‌స్టేషన్ వద్ద బైఠాయించిన ఆందోళనకారులతో మాట్లాడుతున్న సీఐ మహమ్మద్ -
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి
పెనుకొండ రూరల్ : పరిగి మండలం ఎర్రగుంటలో అనుమానాస్పదస్థితిలో ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కురుబ చిన్ననరసింహప్ప భార్య తిమ్మక్క(65) తమ ఇద్దరు కుమారులు కోడళ్లతో కలిసి తోట వద్ద జీవనం సాగిస్తున్నారు. బుధవారం కుమారులు సొంత పని నిమిత్తం వెళ్లగా భర్త చిన్ననరసింహప్ప పింఛన్ కోసం ఎర్రగుంట గ్రామానికి వెళ్లాడు. పింఛన్ తీసుకుని తిరిగి తోట వద్దకు రాగా రక్తపు మడుగులో ఉన్న భార్య తిమ్మక్కను చూసి హుటాహుటిన బెంగళూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. మృతురాలు కాలుజారీ కింద పడినట్లు కోడళ్లు తెలిపారన్నారు. అయితే ఘటనా స్థలంలో రాళ్లకు, గొడ్డలికి, చలికిపారకు రక్తపు మరకలను బట్టి మృతురాలి తిమ్మక్కను ఆస్తి కోసం తమ కోడళ్లే కొట్టి చంపినట్లు అనుమానాలు కలిగిస్తున్నాయని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివరాలు దర్యాప్తులో తెలాల్సి ఉందని ఎస్ఐ అనిల్ తెలిపాడు.