అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి | old woman suspiciouis death | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

Published Wed, Dec 7 2016 10:45 PM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

పెనుకొండ రూరల్ : పరిగి మండలం ఎర్రగుంటలో అనుమానాస్పదస్థితిలో ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కురుబ చిన్ననరసింహప్ప భార్య తిమ్మక్క(65) తమ ఇద్దరు కుమారులు కోడళ్లతో కలిసి తోట వద్ద జీవనం సాగిస్తున్నారు. బుధవారం కుమారులు సొంత పని నిమిత్తం వెళ్లగా భర్త చిన్ననరసింహప్ప పింఛన్‌ కోసం ఎర్రగుంట గ్రామానికి వెళ్లాడు.

పింఛన్‌ తీసుకుని తిరిగి తోట వద్దకు రాగా రక్తపు మడుగులో ఉన్న భార్య తిమ్మక్కను చూసి హుటాహుటిన బెంగళూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. మృతురాలు కాలుజారీ కింద పడినట్లు కోడళ్లు తెలిపారన్నారు. అయితే ఘటనా స్థలంలో రాళ్లకు, గొడ్డలికి, చలికిపారకు రక్తపు మరకలను బట్టి మృతురాలి తిమ్మక్కను ఆస్తి కోసం తమ కోడళ్లే కొట్టి చంపినట్లు అనుమానాలు కలిగిస్తున్నాయని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివరాలు దర్యాప్తులో తెలాల్సి ఉందని ఎస్‌ఐ అనిల్‌ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement