Former Gujarat Minister Vallabhbhai Vaghasiya Dies In Car Accident - Sakshi
Sakshi News home page

Vallabhbhai Vaghasiya: కారులో వెళ్తూ బుల్‌డోజర్‌ను ఢీకొట్టిన మాజీ మంత్రి.. అక్కడికక్కడే దుర్మరణం

May 19 2023 2:19 PM | Updated on May 19 2023 2:35 PM

Former Gujarat Minister Vallabhbhai Vaghasiya Dies In Car Accident - Sakshi

గాంధీనగర్‌: గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత వల్లభ్‌బాయ్ వఘాసియా(69) రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న కారు బుల్‌డోజర్‌ను ఢీకొట్టడంతో దుర్మరణం చెందారు. కారును ఆయనే స్వయంగా డ్రైవ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వఘాసియాతో పాటు కారులో ఉన్న మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి 8:30 గంటల సమయంలో అమ్రేలి జిల్లా సావర్‌కుంద్ల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

విజయ్‌రూపానీ మొదటి సారి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు వఘాసియా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. సావర్‌కుంద్ల నియోజకవర్గం నుంచి 2012లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2016లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

వఘాసియా మృతి పట్ల సావర్‌కుంద్ల ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే మహేష్ కశ్వాలా విచారం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఒక మాస్ లీడర్‌ను కోల్పోయామన్నారు.

చదవండి: సంపు క్లీన్‌ చేస్తుండగా విద్యుత్ షాక్.. ముగ్గురు మృతి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement