వరంగల్ బరిలో మాజీ మంత్రి చంద్రశేఖర్? | Former minister ChandraShekhar in warangal by elections | Sakshi
Sakshi News home page

వరంగల్ బరిలో మాజీ మంత్రి చంద్రశేఖర్?

Published Thu, Sep 24 2015 3:26 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Former minister ChandraShekhar in warangal by elections

సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికలో మాజీ మంత్రి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎ.చంద్రశేఖర్ పేరును బీజేపీ పరిశీలిస్తోంది. ఇప్పటిదాకా బీజేపీ అభ్యర్థిత్వం కోసం 14 మంది దరఖాస్తు చేసుకోగా జాబితాను ఐదుగురికి కుదించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత కె.లక్ష్మణ్, అభ్యర్థి ఎంపిక కమిటీ సభ్యులు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం సమావేశమై ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపికపై చర్చించారు. వికారాబాద్‌కు చెందిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ (ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు), బీజేపీ నేతలు చింతా సాంబమూర్తి, జైపాల్, తటస్తులు డాక్టర్ రాజమౌళి, డాక్టర్ దయాకర్ అభ్యర్థిత్వాలపై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement