ఐదు నెలల్లో మరో 60 వేల ఉద్యోగాలు
నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్
సిద్దిపేట: నాలుగైదు నెలల్లో మరో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. మొదటి విడతలో ఇదివరకే 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని, మొత్తంగా ఐదు నెలల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. నియోజకవర్గ స్థాయిలో పోలీసు కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం ఆయన మెదక్ జిల్లా సిద్దిపేటలో ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. బం గారు తెలంగాణ నిర్మాణ ప్రక్రియలో భాగంగా యువతకు భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు.
రేపోమాపో 9 వేల కానిస్టేబుళ్ల నియామకం కోసం నోటిఫికే షన్ జారీ కానుందన్నారు. పోలీస్ శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని, 9 వేల ఉద్యోగాల్లో 3,300 ఉద్యోగాలను మహిళలకు రిజర్వు చేయడం శుభసూచకమన్నారు. అనంతరం యువతీ యువకులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. పోలీస్ శాఖకు చెందిన వారు విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు బీమాను అందించడం దేశచరిత్రలోనే మొదటిదన్నారు.
ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం
కొండపాకలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న హరీశ్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ వరకు వర్తించేలా ఆలోచిస్తున్నామ న్నారు. ఇంటర్ విద్యను సైతం సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు ఉచిత విద్య అందిస్తామన్నారు.
బీజేపీ ఓడితే మోదీ పదవి పోదు
హసన్‌పర్తి: వరంగల్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఓడిపోరుునా ప్రధాని నరేంద్రమోదీ పదవి పోదని, కాం గ్రెస్ గెలిస్తే సోనియూ ప్రధాని కాదని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఆయన హసన్‌పర్తి, బీమారంలో జరిగిన ప్రచార సభలో మాట్లాడారు. ఎంపీ సీటు గెలవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి బడా నేతలను ప్రచారానికి దిగుమతి చేసిందని, వా రు ప్రచారం చేస్తే ఇక్కడి వారు ఓటేస్తారనుకోవడం భ్రమేనని ఎద్దేవా చేశారు. అమెరికాలో ఉంటున్న డాలర్ బాబుకు ఇక్కడి డీలర్ దయాకర్‌రావు టికెట్ ఇప్పించారన్నారు. కాంగ్రెస్ కూడా హైదరాబాద్ నుంచి అభ్యర్థిని దిగుమతి చేసుకుందన్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కార్యక్రమంలో మంత్రి జోగురామన్న, ఎమ్మెల్యే అరూరి రమేష్, ఎమ్మెల్యే బాబుమోహన్ పాల్గొన్నారు.