ప్రజావ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడుదాం | Former Minister P Sudarshan Reddy to join Congress | Sakshi
Sakshi News home page

ప్రజావ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడుదాం

Published Sun, Nov 5 2017 1:36 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Former Minister P Sudarshan Reddy to join Congress - Sakshi

నిజామాబాద్‌ సిటీ(నిజామాబాద్‌ అర్బన్‌): ప్రజావ్యతిరేక విధానాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ వాదులంత ఐక్యంగా ఉంటూ ప్రభుత్వంపై పోరాడుదామని మాజీమంత్రి పి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఇటీవల టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి న నాయకులు, కార్యకర్తలకు స్వాగత సమావేశాన్ని ఏ ర్పాటు చేశారు. దీనిలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న పాలన దేశంలో ఎక్కడా లేదన్నారు. ఎవరు మాట్లాడితే వారిపై కేసులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఆ పార్టీలో గౌరవం లేనివారు కాంగ్రెస్‌లోకి రావాలన్నారు. సింగూరు ప్రాజెక్టు నుంచి జిల్లాకు 30 టీఎంసీలు నీళ్లు రాకుండా సీఎం అడ్డుపడుతున్నారని ఆరోపించారు. జి ల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ను బైపాస్‌ రోడ్డులో నిర్మించ డం ద్వారా జనం ఇబ్బంది పడతారని పీఎస్‌ఆర్‌ పేర్కొన్నారు.  

కాంగ్రెస్‌లోకి వస్తాననుకోలేదు: అరికెల  
గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి నాయకుడిగా చేసిన టీడీపీని వదిలి కాంగ్రెస్‌లో చేరుతానని ఎప్పుడూ ఊ హించలేదని మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి అన్నా రు. రాష్ట్రం ఏర్పడ్డాక టీడీపీకి ఆదరణ లేకుండా పో యిందన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులతో కాంగ్రెస్‌లో చేరానన్నారు. 35 ఏళ్లపాటు టీడీపీలో పనిచేశానన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పోరాడాలంటే కాంగ్రెస్‌యే సరైన వేదికని అన్నారు. జీవనది ఎప్పటికి ఎండిపోదని, అలాంటిదే కాంగ్రెస్‌ పార్టీ అని అన్నారు. పీసీసీ అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి మహేష్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్సీ ఆకుల లలిత, డీసీసీ చీఫ్‌ తాహెర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగర కాం గ్రెస్‌ అధ్యక్షుడు కేశవేణు, నాయకులు బాల్‌రాజు, ము ప్పా గంగారెడ్డి, శేఖర్‌గౌడ్, రత్నాకర్, జావిద్, సుజన్, విపుల్, చరణ్, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, నగర అధ్యక్షురాలు చంద్రకళ ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement