ముషీరాబాద్: మాజీ సైనికులకు 7వ వేతన సవరణ సంఘం సిఫార్సులను అమలు చేయాలని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు అన్నారు. శనివారం ముషీరాబాద్‌లోని గంగపుత్ర సంఘం హాల్‌లో మాజీ సైనికుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ సైనికుల సమస్యల పరిష్కారంపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించే మాజీ సైనికుల సమస్యలను ప్రభుత్వాలు వెంటనే పరిష్కరిచాలని కోరారు.
సైనికులకు వన్‌ర్యాంకు, వన్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళల్లో రెండు శాతం సైనికులకు కేటాయించాలని కోరారు. టీపీసీసీ పరీక్షల్లో సైనికుల కోటా పెంచాలన్నారు. ప్రతి నెలా సైనికుల పెన్షన్ సమస్యలపై సైనిక్ ట్రిబ్యునల్ ద్వారా చర్చించి పరిష్కరించాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు భీమర్తి అశోక్, నాయకులు కెప్టెన్ సురేష్‌రెడ్డి, రామయ్య, నాయీమ్ ఖాన్, అంజయ్య, శంకర్‌గౌడ్, వసంతరావు, శిరాజ్‌దుద్దీన్, గౌస్‌ఉద్దీన్ పాల్గొన్నారు.
మాజీ సైనికులకు వేజ్‌బోర్డు అమలు చేయాలి
Published Sun, Jan 24 2016 1:44 AM | Last Updated on Wed, Oct 3 2018 7:31 PM
Advertisement