Former soldiers
-
నిర్లక్ష్యం ఖరీదు.. రెండు ప్రాణాలు
సాక్షి, పులివెందుల : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆర్మీలో పనిచేసి దేశానికి సేవ చేసిన ఇద్దరు స్నేహితులు తుదకు మృత్యుఒడికి కూడా కలిసే చేరుకున్నారు. వివరాలలోకి వెళితే లింగాల మండలం గుణకణపల్లెకి చెందిన ప్రతాప్‌రెడ్డి(36), వేముల మండలం నల్లచెరువుపల్లెకు చెందిన రామిరెడ్డి గోవర్దన్‌రెడ్డి(35)లు కొంతకాలం ఆర్మీలో పనిచేశారు. తర్వాత రిజైన్ చేసి సొంత గ్రామాలకు వచ్చారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. సోమవారం వీరిద్దరు వేర్వేరుగా పులివెందులకు వచ్చారు. పులివెందులలో వారిరువురు కలుసుకున్నారు. ఇంటి స్థలాల కొనుగోలు విషయమై కదిరి రోడ్డులో గల రియల్ ఎస్టేట్ భూములను పరిశీలించేందుకు గోవర్థన్‌రెడ్డికి చెందిన హోండా షైన్ బైకుపై కలిసి వెళ్లారు. కదిరి రోడ్డులోని గంగమ్మ గుడి దాటిన తర్వాత కుడి వైపున వెంకటాపురం హరిజనవాడ సమీపంలో ఉన్న స్థలాల దగ్గరకు వెళుతుండగా.. ఒక్కసారిగా రోడ్డు ప్రక్కనే గల విద్యుత్ స్థంభాలకు ఉన్న 11కె.వి హైటెక్షన్ విద్యుత్ వైరు తెగి బైకుపై పడింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టూ పక్కల వారు రక్షించే ప్రయత్నం చేయగా సాధ్యం కాలేదు. మంటలు పూర్తిగా వ్యాపించడంతో వారిద్దరు అక్కడే సజీవ దహనమయ్యారు. మృతుడు గోవర్థన్‌రెడ్డికి భార్య పార్వతితోపాటు ఇద్దరు కుమార్తెలు జ్యోతి, సాయి, కుమారుడు బద్రినాథరెడ్డిలు ఉన్నారు. మరొక మృతుడు ప్రతాప్‌రెడ్డికి భార్య అనురాధతోపాటు కుమార్తె రక్షిత ఉన్నారు. స్థానికులు పోలీసులకు, ఫైరింజన్‌కు సమాచారం అందించారు. వారు చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమా.. గోవర్థన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డిల మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే పులివెందులకు చేరుకున్నారు. మృతదేహాలను చూసి వారు బోరున విలపించారు. తమకు దిక్కెవరంటూ వారు విలపిస్తున్న దృశ్యాలను చూసి స్థానికులు చలించిపోయారు. గుణకణపల్లె, నల్లచెరువుపల్లెలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యుదాఘాతంతో గోవర్థన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డిలు మృతి చెందడానికి కేవలం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. విద్యుత్ లైన్ తెగిపోవడానికి లైన్ ఫాల్ట్ కానీ, జంపర్ వద్ద లూజు ఉండటంవల్ల కానీ ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఆ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై విద్యుత్ లైన్‌ను సరిచేయాల్సి ఉంటుంది. కొన్ని రోజులుగా 11కె.వి విద్యుత్ లైన్ లూజుగా ఉందని స్థానికులు ఆరోపించారు. ఏటా ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ అధికారులు లూజుగా ఉన్న వైర్లను, ఇతర వాటిని సరి చేయాల్సి ఉంది. జూన్, జులై నెలల్లో బలమైన గాలులు, వర్షాలు వస్తాయని ముందుగానే ట్రాన్స్‌కో అధికారులు ఇలాంటి పనులు చేపడుతుంటారు. వారు పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందినట్లు మృతుల కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విద్యుత్ శాఖ అధికారులపై 304ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పులివెందుల అర్బన్ సీఐ రామాంజినాయక్ పేర్కొన్నారు. -
రణానికి మేమూ సై..
సాక్షి, హైదరాబాద్ : పాకిస్తాన్ ఉగ్ర దాడులు, ఆపైకవ్వింపు చర్యలను అడ్డుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత మాజీ సైనికులు ప్రకటించారు. రాష్ట్రం నుంచి అనేక మంది యుద్ధవీరులు భారత్–పాకిస్తాన్, చైనా యుద్ధాల్లో పనిచేసిన అనుభవంతో పాటు కశ్మీర్ లోయపైభౌగోళిక అవగాహన కలిగి ఉన్నారు. దీంతో సైనిక సంక్షేమ శాఖకు పలువురు మాజీ సైనికులు తాము దేశం తరఫున మళ్లీ సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని బుధవారం సంకేతాలిచ్చారు. వారిలో పలువురు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మళ్లీ మిగ్ 21 ఎక్కేస్తా.. ‘మన వైమానిక శక్తి ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైంది, బలమైంది కూడా. యుద్ధ విమానాలను మనకు సరఫరా చేసిన దేశాలు సైతం వాటిని మనం వినియోగిస్తున్న తీరును చూసి ఆశ్చర్యపడ్డ ఘటనలు అనేకం’ అని భారత వాయుసేనలో వింగ్ కమాండర్‌గా పనిచేసిన జగన్మోహన్ మంతెన అన్నారు. మిగ్–21తో పాటు అనేయ యుద్ధవిమానాలు నడపడంలో నిపుణుడైన జగన్ మోహన్.. సైనిక శక్తిపరంగా పాకిస్తాన్‌కు మనకు ఏ పోలికా లేదన్నారు. పుల్వామా ఘటనతో జాతి యావత్తు కలత చెందిందని, ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసే ప్రక్రియ విజయవంతం కావడం సంతోషకరమన్నారు. యుద్ధం అనివార్యమైతే తామంతా మళ్లీ మిగ్ విమానాలతో దేశం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇంకెంత మంది చావాలి ‘కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నన్ని రోజులు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం భారతీయులను బలి తీసుకుంటూనే ఉంటుంది. అందుకే ప్రత్యేక హక్కులను రద్దు చేసేందుకు ఇదే సమయం’ అని 1971లోభారత్–పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న కెప్టెన్లింగాల పాండురంగారెడ్డి అన్నారు. పుల్వామా–బాలాకోట్ ఘటనల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి చేయడం శుభపరిణామమని, ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం పీచమణచాలన్నారు. అవసరమైతే మళ్లీ మేమంతా సాయుధులైయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని పాండురంగారెడ్డి చెప్పారు. పాకిస్తాన్ వల్లించే శాంతి వచనాలు నమ్మి మోసపోవద్దని, దృఢమైన రాజకీయ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్లాలన్నారు. జాతి యావత్తు ఒక్కటై ముందుకు కదలాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. -
మాజీ సైనికులకూ ఆధార్!
శ్రీకాకుళం న్యూకాలనీ: దేశవ్యాప్తంగా మాజీ సైనికులు పొందుతున్న వివిధ పథకాలు, గ్రాంట్లకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వివాహాల గ్రాంటు నుంచి దహన సంస్కారాల వరకు ప్రభుత్వం అందించే ప్రతీ ఒక్క పథకం, గ్రాంటుకు ఇకపై ఆధార్ తప్పనిసరి కానుంది. ప్రస్తుతం పొందుతున్న పథకాలు, గ్రాంట్లతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు సైతం ఆధార్ ను తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సిందేనని కేంద్రం స్పష్టంచేసింది. దరఖాస్తు సమయంలోనే ఆప్షన్.. ఇకపై మాజీ సైనికులు తమ పథకాలకు, గ్రాంట్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న సమయంలో ఆధార్ ఆప్షన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అది పూర్తి చేసిన తర్వాతే మిగిలిన వివరాలను నమోదు చేయాల్సి ఉం టుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో త్రివిధ దళాల్లో పనిచేసి పదవీవిరమణ పొందిన మాజీ సైనికులతోపాటు వితంతువులు కలిపి 6 వేల మంది వరకు ఉన్నారు. వీరిందరికీ ఆధార్ వర్తించనుం ది. అయితే హోం మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్న పారా మిలిటరీ సైనికులు, పోలీసులుగా పదివీ విరమణ చేసినవారికి ఆధార్ అనుసంధానంపై వివరాలు తెలియాల్సి ఉంది. మాజీ సైనికులంతా మేల్కోవాలి మాజీ సైనికులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, గ్రాంట్లకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పథకాలు, గ్రాంట్లు పొందుతున్న వారితో పాటు దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ నంబర్‌ను అనుసంధాల్సిందే. మాజీ సైనికులు, వితంతువులు, కుటుంబీకులంతా మేల్కొవాలి. – జి.సత్యానందం, జిల్లా సైనిక సంక్షేమాధికారి -
మాజీ సైనికోద్యోగులపై కేసీఆర్ వరాల జల్లు
-
మాజీ సైనికులకు కేసీఆర్ వరాలు!
• రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తే డబుల్ పెన్షన్‌కు ఓకే • మరణించిన తర్వాత భార్యకు సైతం పెన్షన్ • దేశంలోనే అత్యధికంగా ‘గ్యాలెంటరీ’ పరిహారం • సైనికుల వాహనాలకు లైఫ్ ట్యాక్స్ మినహాయింపు • ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష • సైనికాధికారులు, మాజీ సైనికులతో కలసి భోజనం చేసిన సీఎం సాక్షి, హైదరాబాద్: మాజీ సైనికులు, వారి కుటుంబాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వరాల జల్లు కురిపించారు. మాజీ సైనికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. దేశంలో ఇతర రాష్ట్రాల కన్నా మెరుగ్గా తాము మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఈ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నామని, త్వరలో మరి కొన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి సంబంధించి శనివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మూడు గంటల పాటు జరిగిన ఈ భేటీలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, బి.వినోద్ కుమార్, ముఖ్య కార్యదర్శులు రాజీవ్ త్రివేదీ, ఎస్.నర్సింగ్‌రావు, హోంశాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, దక్షిణ భారత సైనిక కమాండెంట్ జనరల్ మేజర్ జనరల్ ఎస్.పచౌరి, సికింద్రాబాద్ స్టేషన్ లెఫ్టినెంట్ కల్నల్ జస్విందర్‌సింగ్, కెప్టెన్ నవనీత్‌సింగ్, సైనిక సంక్షేమ కమిటీ సభ్యులు సురేశ్‌రెడ్డి, జగన్‌రెడ్డి, పోచయ్య, ప్రభాకర్‌రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు ఇందులో పాలొ ్గన్నారు. ఈ భేటీకి ముందు ప్రగతి భవన్‌లోనే మాజీ సైనికోద్యోగులు, సైనికాధికారులతో కలసి సీఎం కేసీఆర్ భోజనం చేశారు. అనంతరం వారి సమస్యలు, విజ్ఞప్తులు విన్నారు. కాగా తమ సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్‌కు మాజీ సైనికోద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ప్రకటించిన వరాలివీ.. ♦ మాజీ సైనికులు రాష్ట్రప్రభుత్వంలో ఉద్యోగం చేస్తే వారికి డబుల్ పెన్షన్ ఇచ్చే అంశంపై పరిశీలన. పెన్షన్ పొందుతున్న మాజీ సైనికోద్యోగి మరణిస్తే భార్యకు పెన్షన్ అందజేత. ప్రతి నెలా ఇతర ఉద్యోగులతో పాటు ఈ పెన్షన్ చెల్లింపు. ♦ యుద్ధంలో మరణించిన సైనికుల కుటుం బాలకు అందుతున్న పరిహారం, సదు పాయాలను.. సర్వీసులో అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల వంటి కారణాలతో మర ణించిన సైనికుల కుటుంబాలకు కూడా వర్తింపజేయాలి. ఈ పెన్షన్ కూడా ప్రతి నెలా ఇతర ఉద్యోగులతో పాటు చెల్లింపు. ♦ స్పెషల్ పోలీసాఫీసర్లుగా పనిచేస్తున్న వారికి మాజీ సైనికోద్యోగుల వేతనం. ♦ సైనిక సంక్షేమ బోర్డుల బలోపేతానికి చర్యలు. పది జిల్లాల్లో ఉన్న బోర్డుల తరహాలో కొత్తగా ఏర్పాటైన 21 జిల్లా ల్లోనూ ఏర్పాటుకు నిర్ణయం. మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో సైనిక సంక్షేమ కార్యాలయ నిర్మాణానికి చర్యలు. ♦ యుద్ధంలో మరణించిన సైనికులకిచ్చే గ్యాలంటరీ అవార్డుల ద్వారా అందించే పరిహారాన్ని మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉండేలా కొత్త విధానం. ♦ సైనికులు, మాజీ సైనికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో రిజర్వే షన్. మిలటరీ స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు. విద్యా సంస్థల్లో స్కౌట్స్, గైడ్స్, ఎన్సీసీ శిక్షణ తీసుకునేవారికి, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు. ♦ వరంగల్‌లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించినందున దీనికి సంబంధించి వెంటనే ఒప్పందం (ఎంఓయూ) చేసుకోవాలని నిర్ణయం. ♦ ఉద్యోగ రీత్యా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సైనికులు తిరుగుతుంటారు. రాష్ట్రం మారిన ప్రతి సారి వారి సొంత వాహనాలకు తిరిగి లైఫ్ ట్యాక్సులు చెల్లించాల్సి వస్తోంది. దీంతో వారు దేశంలో ఇప్పటికే ఎక్కడ పన్ను చెల్లించినప్పటికీ తిరిగి తెలంగాణలో చెల్లించాల్సిన అవసరం లేకుండా చర్యలు. ♦ సైనికులు నిర్మించుకునే ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు, డబుల్ బెడ్ రూం పథకంలో మాజీ సైనికులకు రెండు శాతం కేటాయింపు. -
మాజీ సైనికులకు ఉద్యోగమేళా
హన్మకొండ : మాజీ సైనికులకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారి వనజ తెలిపారు. రీ సెటిల్మెంట్ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన వారి కోసం పూణేలోని లోహగావు ఎయిర్‌ఫోర్సు స్టేషన్లో ఈ నెల 25వ తేదీన ఉద్యోగ మేళా ఉంటుందని వివరించారు. 50 నుంచి 75 వరకు సంస్థలు రానున్నాయని తెలిపారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఠీఠీఠీ.ఛీజటజీnఛీజ్చీ.ఛిౌఝ లేదా ఠీఠీఠీ.్టటజీఠిజ్డీ.ఛిౌఝ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని కోరారు. -
ఎడ్యుకేషన్ గ్రాంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి
హన్మకొండ : మాజీ సైనికులు, వితంతువుల వారి పిల్లల చదువుకు ఆర్థిక సహాయం (ఎడ్యుకేషన్ గ్రాంట్)కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సైనిక సంక్షేమ అధికారిణి టి.వనజ కోరారు. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ 2015– 16 విద్యా సంవత్సరానికి ఈ ఆర్థిక సహాయం అందిస్తుందని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆర్థిక సహాయం కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పంపుకోవాలని సూచిం చారు. 10వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఈనెల 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, డిగ్రీ చదివిన వారు ఆగష్టు 20వ తేదీ లోపు ఠీఠీఠీ.జుటb.జౌఠి.జీn వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యా రాయితీలకు ఆన్లైన్లో కావాల్సిన ధ్రువపత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం దరఖాస్తు చేసిన పత్రం, ఒరిజనల్ ధ్రువపత్రాలు జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. వివరాలకు 99080 56298, 0870–2456018 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరారు. -
చిప్పాడలో నిరసనకారుల అరెస్టులు
భీమిలి మండలం చిప్పాడలో దివీస్ ల్యాబ్ విస్తరణకు వ్యతిరేకంగా తలపెట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. దివీస్ ల్యాబ్ విస్తరణ వ్యతిరేక కమిటీ నేడు నిర్వహించనున్న కలెక్టరేట్ ముట్టడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆందోళన కారులకు మద్దతు తెలిపిన మాజీ సైనికులను సోమవారం తెల్లవారుజాము నుంచే అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందుకు నిరసనగా చిట్టినగర్ వద్ద ఉద్యమకారులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. -
మాజీ సైనికులకు వేజ్‌బోర్డు అమలు చేయాలి
ముషీరాబాద్: మాజీ సైనికులకు 7వ వేతన సవరణ సంఘం సిఫార్సులను అమలు చేయాలని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు అన్నారు. శనివారం ముషీరాబాద్‌లోని గంగపుత్ర సంఘం హాల్లో మాజీ సైనికుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ సైనికుల సమస్యల పరిష్కారంపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించే మాజీ సైనికుల సమస్యలను ప్రభుత్వాలు వెంటనే పరిష్కరిచాలని కోరారు. సైనికులకు వన్‌ర్యాంకు, వన్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళల్లో రెండు శాతం సైనికులకు కేటాయించాలని కోరారు. టీపీసీసీ పరీక్షల్లో సైనికుల కోటా పెంచాలన్నారు. ప్రతి నెలా సైనికుల పెన్షన్ సమస్యలపై సైనిక్ ట్రిబ్యునల్ ద్వారా చర్చించి పరిష్కరించాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు భీమర్తి అశోక్, నాయకులు కెప్టెన్ సురేష్‌రెడ్డి, రామయ్య, నాయీమ్ ఖాన్, అంజయ్య, శంకర్‌గౌడ్, వసంతరావు, శిరాజ్దుద్దీన్, గౌస్ఉద్దీన్ పాల్గొన్నారు. -
మాజీ సైనికులకు ఉద్వాసన !
భద్రత విధుల నుంచి తప్పించిన హెచ్ఎండీఏ లుంబినీ, ఎన్టీఆర్ గార్డెన్లలో {పైవేటు సైన్యం సిటీబ్యూరో: పర్యాటకులు, సందర్శకులతో నిత్యం కిటకిటలాడే లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కుల్లో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న మాజీ సైనికులకు ఉద్వాసన పలుకుతూ హెచ్ఎండీఏ తాజాగా నిర్ణయం తీసుకొంది. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధలో పనిచేస్తున్న 23మంది మాజీ సైనికులను వెనక్కి పంపుతూ బీపీపీ అర్బన్ ఫారెస్ట్రీ డెరైక్టర్ సోమవారం సైనిక్ వెల్ఫేర్ బోర్డుకు లేఖ రాశారు. ఈమేరకు మంగళవారం నుంచి మాజీ సైనికుల సేవలు అవసరం లేదని అందులో పేర్కొన్నారు. అవసరానికి మించి మాజీ సైనికులు బీపీపీలో భద్రత విధులు నిర్వహిస్తుండటంతో పాటు వీరికి అధికంగా వేతనాలు చెల్లించాల్సి వస్తోందన్న ఉద్దేశంతో వీరిని తప్పించేందుకు 2013 నవంబర్‌లో హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. ఉన్నఫళంగా తొలగించకుండా నెల రోజులు గడువు ఇస్తూ ముందుగా నోటీసులు జారీ చేసింది. దీంతో హెచ్ఎండీఏ తీసుకొన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకొని రెండేళ్లుగా కొనసాగుతున్నారు. ఈ కేసు గత సెప్టెంబర్‌లో విచారణకు రాగా హెచ్ఎండీఏ తీసుకొన్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ మాజీ సైనికుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇటీవలే హెచ్ఎండీఏకు అందడంతో వాటిని అమలు చేస్తూ సోమవారం అధికారులు చర్యలు తీసుకొన్నారు. అయితే... మాజీ సైనికులను భద్రత విధుల నుంచి తప్పిస్తూ హెచ్ఎండీఏ అధికారులు తీసుకొన్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు సెక్యూరిటీతో పాటు సుశిక్షితులైన ఎక్స్‌సర్వీస్ మెన్లను కొనసాగిస్తేనే లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్ల వద్ద ప్రయోజనం ఉంటుందనీ... లేదంటే నిఘా కట్టుతప్పి అసలుకే మోసం జరిగే ప్రమాదం ఉందని పోలీసు మాజీ అధికారులు హెచ్చరిస్తున్నారు. సిబ్బందిని తగ్గించుకోవాలన్న హెచ్ఎండీఏ ప్రయత్నాన్ని మాజీ సైనికులు సవాల్ చేస్తూ గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, ఆ కేసులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని బీపీపీ అర్బన్ ఫారెస్ట్రీ డెరైక్టర్ స్వర్గం శ్రీనివాస్ తెలిపారు. ఇప్పుడు కోర్టు ఉత్తర్వులను అమలు చేశామే తప్ప కొత్తగా వారిపై చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. కాగా విద్యా సంవత్సరం మధ్యలో తమను ఉద్యోగం నుంచి తప్పించడంపై మాజీ సైనికోద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వృద్ధులైన తల్లిదండ్రుల ఆరోగ్యం వంటివి తమ ఉద్యోగాలతో ముడిపడి ఉన్నాయని కన్నీళ్లపర్యంతమవుతున్నారు. -
దీపావళికి ముందే ఓఆర్ఓపీ నోటిఫికేషన్
న్యూఢిల్లీ: భద్రత బలగాలకు సంబంధించిన ఒకే ర్యాంకు, ఒకే పింఛను(ఓఆర్ఓపీ) పథకంపై దీపావళి పండగకు ముందే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. బిహార్ ఎన్నికల కోడ్ కారణంగా ఓఆర్ఓపీ ప్రకటనను వాయిదా వేసినట్లు వెల్లడించారు. మెడళ్లు వెనక్కి.. ఓఆర్ఓపీ డిమాండుతో ఉద్యమిస్తున్న మాజీ సైనికోద్యోగులు తమ మెడళ్లను వెనక్కు ఇచ్చేయాలని తీర్మానించుకున్నారు. మాజీ సైనికులు ఈ నెల 9,10 తేదీల్లో తమ మెడళ్లను ఆయా జిల్లా కలెక్టర్లకు అందజేయనున్నట్లు భారత మాజీసైనికుల నేత వీకే గాంధీ వెల్లడించారు. -
మాజీ సైనికులకు చుక్కెదురు !
హెచ్ఎండీఏ నిర్ణయాన్ని సమర్ధించిన హైకోర్టు సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధిలోని బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ)లో సెక్యూరిటీ (భద్రత) విధులు నిర్వహిస్తున్న మాజీ సైనికులకు హైకోర్టులో చుక్కెదురైంది. తమ సర్వీసులను ఉపసంహరిస్తూ హెచ్ఎండీఏ తీసుకొన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలువురు మాజీ సైనికులు (ఎక్స్ సర్వీస్మెన్లు) దాఖలు చేసిన పిటీషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టివేస్తూ హెచ్ఎండీఏ తీసుకొన్న నిర్ణయాన్ని సమర్ధించింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి కాంతారావు ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. లుంబినీ పార్కు, ఎన్టీఆర్గార్డెన్, సంజీవయ్య పార్కుల్లో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తోన్న ఎక్స్ సర్వీస్మెన్లకు ఉద్వాసన పలకాలని 2013 నవంబర్‌లో హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఆమేరకు బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న 27మంది మాజీ సైనికులను డిసెంబర్ 15లోగా వెనక్కి తీసుకోవాలని కోరుతూ సైనిక్ వెల్ఫేర్ బోర్డుకు లేఖరాసింది. దీంతో మాజీ సైనికులు ఉన్నతాధికారులను కలిసి 5 ఏళ్లుగా పనిచేస్తున్న తమను ఉన్నపళంగా తొలగించడం సబబు కాదని, వదీనిపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. అయినా వారు తమ నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో సీఎస్ఓ విష్ణువర్థన్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు మాజీ సైనికులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు వారిని తొలగించవద్దని హెచ్ఎండీఏను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో హెచ్ఎండీఏ వెనక్కి తగ్గింది. ఆ తర్వాత వాయిదాలు పడుతూ వస్తోన్న కే సు మంగళవారం మరోసారి విచారణకు రాగా హెచ్ఎండీఏ నిర్ణయాన్ని సమర్ధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆందోళనలో మాజీ సైనికులు: బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో ఆరేళ్లుగా విధులు నిర్వహిస్తోన్న తమను ఆకస్మికంగా తొలగిస్తారన్న విషయాన్ని మాజీ సైనికులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఉన్నపళంగా ఉద్యోగం నుంచి తొలగిస్తే తమ జీవితాలు రోడ్డుపై పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు పరిస్థితిని అర్థం చేసుకొని తమ సేవలు మరికొంతకాలం వినియోగించుకోవాలని కోరుతున్నారు. -
‘వన్ పెన్షన్’ వచ్చేసింది
►ఒక ర్యాంకు- ఒక పెన్షన్ అమలుకు కేంద్రం ఓకే ► ఐదేళ్లకోసారి పెన్షన్ మొత్తం సవరణ.. వీఆర్ఎస్ తీసుకున్నవారికి వర్తింపు లేనట్లే ► 2013 ఆధారంగా గరిష్ట, కనిష్ట పెన్షన్ మొత్తాల సగటు కనీస పెన్షన్‌గా నిర్ధారణ ► ఏటా రూ.10వేల కోట్ల వరకూ భారం.. 2014 జూలై నుంచే వర్తింపు.. రూ.12వేల కోట్ల వరకు బకాయిలు.. ఆర్నెల్లకోసారి నాలుగు వాయిదాల్లో బకాయిల చెల్లింపు ► పథకం అమలుపై ఏక సభ్య న్యాయ కమిటీ.. ఆర్నెల్లలోగా నివేదిక ► ప్రతిపాదనపై పెదవి విరిచిన మాజీ సైనికులు.. రెండేళ్లకోసారి పెన్షన్ సవరించాల్సిందే ►చాలా అంశాల్లో స్పష్టత అవసరం.. ఆందోళన కొనసాగిస్తాం న్యూఢిల్లీ: మాజీ సైనికులకు ‘ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్’(ఓఆర్ఓపీ) అంశంపై ఎట్టకేలకు ముందడుగు పడింది. దీనిని త్వరలోనే అమల్లోకి తీసుకువస్తామని.. 2014 జూలై నుంచే వర్తింపజేస్తామని కేంద్రం శనివారం ప్రకటించింది. కానీ మాజీ సైనికులు డిమాండ్ చేస్తున్నట్లుగా పెన్షన్‌ను రెండేళ్లకోసారి కాకుండా ఐదేళ్లకోసారి సవరిస్తామని పేర్కొంది. మరోవైపు కేంద్రం ప్రకటనపై మాజీ సైనికులు పెదవి విరిచారు. అందులోని పలు అంశాలు తమ డిమాండ్లకు విరుద్ధంగా ఉన్నాయని... ఈ అంశంపై తమ ఆందోళన కొనసాగుతుందని ప్రకటించారు. ఈ ఓఆర్ఓపీ అమల్లోకి వస్తే దాదాపు 26 లక్షల మంది రిటైర్డ్ సైనికులు, సిబ్బంది, వారి కుటుంబాలకు ప్రయోజనం కలుగనుంది. మాజీ సైనికులకు ఓఆర్ఓపీని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ శనివారం ప్రకటించారు. ‘భారీ ఆర్థిక భారం పడుతున్నా.. మాజీ సైనికుల ప్రయోజనం కోసం దీనిని అమల్లోకి తీసుకొస్తున్నాం. దీనికోసం మాజీ సైనికులు 40 ఏళ్లుగా పోరాడుతున్నా.. ఇప్పుడు మా ప్రభుత్వమే అమల్లోకి తెచ్చింది. జూలై 2014 నుంచే దీనిని అమలు చేస్తాం. పెన్షన్‌ను ఐదేళ్ల కోసారి సవరిస్తాం. ఇందుకు 2013 ఏడాదిని బేస్ ఇయర్‌గా తీసుకుంటాం. ఒకే సర్వీసు, ఒకే హోదా ఉన్నవారి గరిష్ట, కనిష్ట పెన్షన్ల సగటును కనీస పెన్షన్ మొత్తంగా నిర్ణయిస్తాం. అయితే దీనితో పోలిస్తే ఎక్కువ పెన్షన్ ఉన్నవారికి అది యథాతథంగానే కొనసాగుతుంది’ అని వివరించారు. ఇక స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మాజీ సైనికులకు ఇది వర్తించబోదన్నారు. ఈ ఓఆర్ఓపీ అమలుపై ఏక సభ్య న్యాయ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని... ఆ కమిటీ 6నెలల్లో తమ నివేదికను సమర్పిస్తుందని చెప్పారు. ఈ పథకాన్ని అమలు కేవలం పరిపాలనా పరమైన నిర్ణయం కాదని... దీని వల్ల రూ.8,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.10వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు ఉంటాయన్నారు. ఈ బకాయిలను ఆరు నెలలకోసారి చొప్పున నాలుగు వాయిదాల్లో చెల్లిస్తామని.. అదే వితంతువులకు మాత్రం ఒకేసారి మొత్తం బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. కాగా రక్షణ దళాల అనుమతితో, చట్టబద్ధంగా వీఆర్ఎస్ తీసుకున్నవారికి ఓఆర్ఓపీ ప్రయోజనాలు అందుతాయని సమాచార, ప్రసారశాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ చెప్పారు. ఇక ఈ పెన్షన్ విధానం అమలు చాలా క్లిష్టమైన విషయమని, ఇందుకోసం వివిధ సమయాల్లో, వివిధ ర్యాంకుల్లో రిటైరైన సైనికులకు కలిగే ప్రయోజనాలను పరిశీలించాల్సి ఉంటుందని రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నాయి. పూర్తి వివరాలతో కూడిన ఉత్తర్వులు వచ్చే నెలలో జారీ అయ్యే అవకాశముందని వెల్లడించాయి. వీఆర్ఎస్ తీసుకున్న వారికి పెన్షన్ వర్తింపుపై ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశముంది. ఎన్డీఏ నమ్మక ద్రోహం: కాంగ్రెస్ ఎన్డీఏ ప్రభుత్వం మాజీ సైనికులకు నమ్మకద్రోహం చేసిందని.. శనివారం ప్రకటించిన ఓఆర్ఓపీలోని చాలా అంశాలు వారి ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని కాంగ్రెస్ మండిపడింది. ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత, రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ విమర్శించారు. వీఆర్ఎస్ తీసుకున్న వారికి వర్తింపజేయబోమనడం దారుణమని.. అసలు సైనికుల్లో 90 శాతం మంది 35 నుంచి 40 ఏళ్ల మధ్యే రిటైర్ అవుతారని పేర్కొన్నారు. యూపీఏ హయాంలోనే ‘వన్ పెన్షన్’ను తాము అమల్లోకి తెచ్చామని, ఎన్డీఏ సర్కారే తొలిసారిగా తెచ్చినట్లుగా రక్షణ మంత్రి చెప్పుకొంటున్నారని విమర్శించారు. ఓఆర్ఓపీపై కేంద్రం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని బీజేపీ చీఫ్ అమిత్‌షా వ్యాఖ్యానించారు. ఆందోళన విరమించాలి: వెంకయ్యనాయుడు ఓఆర్ఓపీ అమలుకు కేంద్రం ముందుకొచ్చినందున మాజీ సైనికులు ఆందోళనను విరమించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. అసంతృప్తి ఉంటే చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఒప్పుకోం: మాజీ జవాన్లు ఓఆర్ఓపీ అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ఈ అంశంపై ఉద్యమిస్తున్న మాజీ సైనికుల నాయకుడు, రిటైర్డ్ మేజర్ జనరల్ సత్బీర్ సింగ్ పేర్కొన్నారు. కానీ దీని అమల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలు తమకు ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ‘ఐదేళ్లకోసారి పెన్షన్‌ను సమీక్షిస్తామన్న నిర్ణయం ఆమోదయోగ్యం కాదు. వీఆర్ఎస్ తీసుకున్న వారికి కూడా ఈ పథకం వర్తింపజేస్తామని ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇస్తేనే నిరవధిక నిరాహారదీక్ష విరమిస్తాం. ఏకసభ్యకమిటీ ఏర్పాటుకు కూడా అంగీకరించేది లేదు. మొత్తం ఐదుగురు సభ్యులతో కమిటీ వేయాలి. ఇందులో ముగ్గురు మాజీ సైనికోద్యోగులు, ఒక ప్రస్తుత సైనికోద్యోగి, ఒక ప్రభుత్వ ప్రతినిధి కేంద్ర రక్షణ మంత్రి పరిధిలో ఉండాలి. ఈ కమిటీకి కాలపరిమితిని ఆరు నెలలు కాకుండా ఒక నెల మాత్రమే ఇవ్వాలి. పెన్షన్‌ను లెక్కించటానికి సగటున అత్యధిక పెన్షన్ వస్తున్న పెన్షనర్‌ను ప్రామాణికంగా తీసుకోవాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. వివాదానికి ఆజ్యం పోసిన ఇందిర ఓఆర్ఓపి వివాదానికి మూలం ఇప్పటిదేం కాదు.. 1973లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ సృష్టించిన వివాదం ముదిరి మోదీని చుట్టుకుంది. మూడో పే కమిషన్ నివేదికతో ఓఆర్ఓపీని రద్దు చేస్తూ ఇందిర తీసుకున్న నిర్ణయంతో ఓఆర్ఓపీకి ఆజ్యం పోసినట్లయింది. ఇందిర తర్వాతి ప్రభుత్వాలన్నీ ఈ అంశాన్ని పెండింగ్‌లో పెడుతూనే పోయాయి. ఒకే ర్యాంకు, ఒకే సర్వీసు కాలం ఉండి.. గతంలో రిటైర్ అయిన, ప్రస్తుతం రిటైర్ అవుతున్న.. భవిష్యత్తులో రిటైర్ కాబోతున్న వారికి ఒకేరకమైన పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నది సైనికోద్యోగుల డిమాండ్. దాదాపు 26 లక్షల మంది మాజీ సైనికోద్యోగులు ఉండటంతో వివాదం పరిష్కారానికి నోచుకోకుండా ఏళ్లూపూళ్లూ గడిచిపోయాయి. ఒక ఆర్మీ ఆఫీసర్ లేదా జవాను 1973లో రిటైర్ అయినా.. 2010లో రిటైర్ అయినా ఇద్దరికీ ఒకే పెన్షన్ రావాలన్నది ప్రధాన డిమాండ్. ఒక ఆర్మీ అధికారి 20 ఏళ్లు సర్వీసు పూర్తి చేసి రిటైర్ అయితే, చివరగా తీసుకున్న వేతనంలో 50శాతం పింఛన్ లభిస్తోంది. అయితే.. అంతకు ముందు ఇంతే సర్వీసు పూర్తి చేసి ఇదే ర్యాంకులో రిటైర్ అయిన అధికారికి మాత్రం చాలా తక్కువ వస్తోంది. ఈ రెంటినీ ఒకటి చేయాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం ఇంతకాలానికి అంగీకరించింది. సైనికోద్యోగుల్లో 98 శాతం మంది 54ఏళ్ల లోపు రిటైర్ అవుతున్నారు. వీరిలో 85శాతం మంది 35-37 ఏళ్ల మధ్య స్వచ్ఛంద పదవీవిరమణ చేస్తున్నారు. 40-54 ఏళ్ల మధ్య రిటైరవుతున్న వారి శాతం 13 శాతానికి మించి ఉండటం లేదు. పెన్షన్ విషయంలో వీరు మాత్రమే ఎక్కువ లబ్ధి పొందుతున్నారు. వీఆర్ఎస్ తీసుకున్న వారికి ఓఆర్ఓపీ వర్తించదని ప్రభుత్వం తొలుత ప్రకటించటంతో సైనికోద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే చట్టసమ్మతంగా వీఆర్ఎస్ తీసుకున్నవారికి వర్తిస్తుందని కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ అన్నారు. -
మాజీ సైనికుల కు సీఎం వరాలు
మాజీ సైనికుల భృతి రూ.6000 పెంపు సాక్షి, హైదరాబాద్ : మాజీ సైనికులకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు వరాలు ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.3000 గౌరవ భృతిని రూ.6000 పెంచుతున్నట్లు తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం మాజీ సైనికోద్యోగులు, కొందరు మాజీ పోలీసు అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. వారితో కలిసి భోజనం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డీజీపీ అనురాగ్‌శర్మ, సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనేష్‌కుమార్, కల్నల్ రమేష్‌కుమార్, మాజీ సైనిక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం.సురేశ్‌రెడ్డి, రిటైర్డ్ ఐజీలు వి.భాస్కర్‌రెడ్డి, సి.రత్నారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతిభ కనబరిచిన రాష్ట్రానికి చెందిన సైనిక అధికారులను వచ్చే రాష్ట్రావతరణ దినోత్సవాల్లో ఘనంగా సన్మానిస్తామన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న మాజీ సైనిక ఉద్యోగులకు వారి జాగాల్లోగాని, ప్రభుత్వ భూముల్లోగాని బలహీనవర్గాల గృహనిర్మాణ పథకంలో భాగంగా ఇండ్లను రిజర్వు చేసి కేటాయిస్తామని చెప్పారు. వచ్చే బడ్జెట్లో నిధులిస్తామని, డీజీపీ, హోం సెక్రెటరీ, చీఫ్ సెక్రెటరీ, తాను కలిసి మాజీ సైనికుల సంక్షేమానికి ఒక వ్యూహం రూపొందిస్తామని సీఎం చెప్పారు. దేశ రక్షణకు పనిచేసినవారు తన దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలు చాలా చిన్నవని, వాటన్నింటిని త్వరలోనే ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకోవాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు సీఎంకు వినతిపత్రాలు అందించారు. కెప్టెన్ డీజే రావు రచించిన బంగారు తెలంగాణ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. -
మాజీ జవాన్లపై పోలీసు జులుం
- ఢిల్లీలో ధర్నాచేస్తున్న వారిపై ఖాకీల బలప్రయోగం - ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ కోసం 62 రోజులుగా నిరసన - టెంట్లు తీసేసి, బలవంతంగా ఖాళీ చేయించిన పోలీసులు - ఖండించిన రాహుల్, మాజీ సైనికులకు సంఘీభావం - ‘ఓఆర్ఓపీ’అమలు తేదీ చెప్పాలని ప్రధానికి డిమాండ్ న్యూఢిల్లీ: రక్షణ శాఖలో ‘ఒకే ర్యాంకు ఒకే పెన్షన్(ఓఆర్ఓపీ)’ అమలు చేయాలన్న డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 62 రోజులుగా ధర్నా చేస్తున్న మాజీ సైనికులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. దేశం కోసం ప్రాణాలను అడ్డుపెట్టినవారిని భద్రతకు ముప్పంటూ బలవంతంగా ఖాళీ చేయించా రు. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ విజ్ఞప్తి మేరకు స్వాతంత్య్ర దిన భద్రతా ఏర్పాట్లలో భాగంగా మాజీ సైనికులను జంతర్ మంతర్ వద్ద నుంచి ఢిల్లీ పోలీసులు శుక్రవారం బలవంతంగా తరలించారు. ధర్నా వేదిక వద్ద టెంట్లను తొలగించారు. భద్రత పేరుతో పోలీసులు ఇలా మాజీ సైనికులపై బలప్రయోగం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం తర్వాత వెనక్కి తగ్గింది. ఘటనపై విచారం తెలిపింది. జంతర్ మంతర్ వద్ద మాజీ సైనికులు ధర్నా కొనసాగించేందుకు అనుమతించాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ఆదేశాలు జారీచేసినట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్ సైనికులకు తెలిపారు. కేంద్రం అనుమతించినందున తొలగించిన టెంట్లను మళ్లీ ఏర్పాటు చేయాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీకి మాజీ సైనికులు విజ్ఞప్తిచేశారు. కాగా, ఓఆర్ఓపీ విధానాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మాజీ సైనికులపై పోలీసులు బలప్రయోగాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ధర్నా స్థలికి చేరుకుని మాజీ జవాన్లకు సంఘీభావం ప్రకటించారు. ప్రధాని సులభంగా హామీలిస్తారని, కానీ వాటిని నెరవేర్చడంలో విఫలమవుతుంటారన్నారు. ‘యువతకు ఉద్యోగాల హామీనిచ్చారు. మేక్ ఇన్ ఇండియా విఫలమైంది. స్వచ్ఛ భారత్ ఫలప్రదం కాలేదు. తన కార్పొరేట్ మిత్రులకు భూ బిల్లును తెస్తానని హామీనిచ్చినా, సాధ్యం కాలేదు. ఓఆర్ఓపీనీ నెరవేర్చలేదు’ అని విమర్శించారు. అయితే, రాహుల్‌కు మాజీ సైనికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లుగా రాహుల్ ఎందుకు మౌనంగా ఉన్నారని వారు ప్రశ్నించారు. జంతర్‌మంతర్ వద్దకు రావడం కంటే ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్లమెంట్లో ప్రస్తావిస్తే బాగుండేదన్నారు. దీన్నిప్పుడు రాజకీయం చేయొద్దన్నారు. ఢిల్లీ సీఎంకేజ్రీవాల్ కూడా మాజీ సైనికులకు సంఘీభావం ప్రకటించారు. ఓఆర్ఓపీ అమలు గురించి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని ప్రకటించాలని కోరారు. హామీని నెరవేరుస్తాం.. ఓఆర్ఓపీపై రక్షణ మంత్రి మనోహర్ పారికర్ డెహ్రాడూన్‌లో మాట్లాడుతూ.. ఈ విధానం అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని, అయినా హామీని నెరవేరుస్తామన్నారు. ప్రభుత్వ పదవీకాలంలోపు ఈ హామీని నెరవేరుస్తామన్నామని, వీలైనంత త్వరగా అమలు చేస్తామన్నారు. ఓఆర్ఓపీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అరుణ్ జైట్లీ కూడా తెలిపారు. ఈ విధానం అమలుకు కసరత్తు జరుగుతోందన్నారు. రక్షణశాఖలో ఒకే ర్యాంకు, ఒకే సర్వీస్‌తో రిటైర్ అయ్యే సిబ్బందికి ఓఆర్ఓపీ విధానం అమలుచేయాలని మాజీ సైనికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విధానం అమలైతే తక్షణం 22 లక్షల మంది మాజీ సైనికులు, 6 లక్షలకు పైగా అమరసైనికుల భార్యలు లబ్ధి పొందనున్నారు. అయితే, ఓఆర్ఓపీ త్వరలోనే అమలు కానుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ జైపూర్‌లో విలేకరులకు తెలిపారు. మేం దేశ భద్రతకు ముప్పా? దేశం కోసం ఒకప్పుడు ప్రాణాలను అడ్డుపెట్టిన తాము ఇప్పుడు దేశ భద్రతకు ముప్పుగా కనిపిస్తున్నామా? అంటూ పోలీసుల తీరుపై మాజీ సైనికులు మండిపడ్డారు. ‘మమ్మల్ని ఎలా అనుమానిస్తారు? దేశాన్ని రక్షించిన మేం ఇప్పుడు ముప్పుగా మారామా?’ అని ఒకరన్నారు. ‘భద్రతా కారణాల రీత్యా మమ్మల్ని ఖాళీ చేయిస్తున్నట్లు చెప్పారు. కానీ నన్ను తోసేశారు. చొక్కా చిరిగింది’ అంటూ 82 ఏళ్ల మాజీ సైనికుడు తప్పుట్టారు. పంద్రా గస్టుకు ఒక రోజు ముందు తమ స్వాతంత్య్రాన్ని హరించడం ఆటవికమన్నారు. -
ఎన్నాళ్లీ నిరీక్షణ ?
♦ మాజీ సైనికులకు అందని సంక్షేమం ♦ ఏళ్లుగా పెండింగ్‌లోనే దరఖాస్తులు ♦ వ్యవసాయ భూమి, ఇళ్ల స్థలాలు లేక ఇక్కట్లు ♦ ఇక నుంచి రిటైర్డు అయిన ఏడాదిలోపే దరఖాస్తు చేయాలి నిజామాబాద్ స్పోర్ట్స్ : వారంతా సరిహద్దు ప్రాంతాల్లో దేశానికి రక్షణగా ఉంటారు.. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడుతారు... ఇలా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన సైనికులు.. దేశానికి చేసిన సేవలకు గౌరవంగా ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వం వ్యవసాయ భూమితో పాటు ఇంటి స్థలం ఇవ్వాలి. కానీ జిల్లాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఎంతోమంది దరఖాస్తులు అనేక సంవత్సరాలుగా మూలుగుతున్నాయే తప్ప వారికి భూమి ఇచ్చిన పాపాన పోవడం లేదు. వాళ్ల నిరీక్షణకు ఫలితం లేక నానా ఇక్కట్లు పడుతున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే.. జిల్లాలో మాజీ సైనికులు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనిక కుటుంబాలు చాలానే ఉన్నాయి. 1992 నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది మాజీ సైనికులు తమకు వ్యవసాయ భూమి, ఇంటి స్థలం ఇవ్వాలని దరఖాస్తులు పెట్టుకున్నారు. ఏళ్ల తరబడి దేశానికి సేవ చేసిన వీరికి ప్రభుత్వం మాత్రం తగిన గుర్తింపు ఇవ్వడం లేదు. మాజీ సైనికులకు, సైనిక కుటుంబాలకు జీ.ఓ ప్రకారం ఐదెకరాల వ్యవసాయ భూమి, 130 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి. కానీ ఈ నిబంధనలు జిల్లాలో అమలు కావడం లేదు. జిల్లా సైనిక కార్యాలయంలో వారు పెట్టుకుంటున్న దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉంటున్నారుు. సంవత్సరానికి 10 నుంచి 15 వరకు కొత్త దరఖాస్తులు వస్తున్నాయి. సైనిక సంక్షేమ శాఖ అధికారులు వీటీనీ పరీశీలించి కలెక్టర్ అనుమతితో సంబంధిత రెవెన్యూ డివిజన్, తహాశీల్దార్ కార్యాలయూలకు పంపుతున్నారు. గత 20 ఏళ్ల నుంచి ఇప్పటివరకు జిల్లాలో సుమారు 600 మంది మాజీ సైనికులు, 130 మంది వీర మరణం పొందిన సైనికుల భార్యలు ఉన్నారు. అరుుతే ఇందులో 2006కు ముందు దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరికి వ్యవసాయ భూమి ఇచ్చినట్లు అధికారులు చెపుతున్నప్పటికీ.. వారి డిశ్చార్జ్ బుక్‌లో మాత్రం ఆ వివరాలు లేవు. గతంలో ఇచ్చిన వారికి సైతం నిబంధనల ప్రకారం ఐదెకరాల వ్యవసాయ భూమికి బదులు .. ధరలు పెరిగాయనే సాకుతో రెండున్నర ఎకరాలకు తగ్గించారు. ఇప్పుడు చాలా మందికి ఆ భూమి కూడా ఇవ్వకపోవడంతో సైనిక కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగి వేసారుతున్నారు. ఇక తమకు భూమి రాదనే నిరాశ నిస్పృహలో పడిపోతున్నారు. మరి వీరి నిరీక్షణకు తెర పడుతుందో లేదో వేచి చూడాల్సిందే. ఏడాదిలోపే దరఖాస్తు చేసుకోవాలి... మాజీ సైనికులు ఉద్యోగ విరమణ పొందిన ఏడాది లోపే దరఖాస్తు చేసుకోవాలని 2007లో కొత్త నిబంధన విధించారు. అంతకుముందు డ్యూటీలో ఉన్నవారు, రిటైర్డ్ అరుున వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. కానీ 2007 జీఓ ప్రకారం రిటైర్డ్ అరుున ఏడాది లోపులోనే సైనిక కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రజావాణిలో నేరుగా కలెక్టర్‌కు కూడా వినతిపత్రాలు ఇవ్వవచ్చు. అరుుతే రిటైర్డ్ అరుు ఏడాది తర్వాత దరఖాస్తు చేస్తే మాత్రం వాటిని తిరస్కరిస్తారు. -
మాజీ సైనికుల్ని మరవొద్దు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాజీ సైనికుల మీద శీతకన్ను వేసింది. దేశ రక్షణ కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసే వీర సైనికులు కాశ్మీర్ సరిహద్దులలో ఎముకలు కొరికే చలిని, ఎడారి ప్రాంతంలో ఒళ్లు కాలే వేడిని తట్టుకొని నిలబడతారు. తమ కుటుంబాలకు, పుట్టినగడ్డకు దూరంగా ఉంటూ, రక్షణ నిమిత్తమై తమ ప్రాణాలను సైతం లెక్క చేయక నిరంతరం సరిహద్దులలో కాపలాకాస్తూ ఉంటారు. దేశమంతా నిద్రిస్తుంటే, తాము రాత్రులంతా మేల్కొని తమ కర్త వ్యం నిర్వహిస్తూ దేశాన్నీ దేశ ప్రజలను కాపాడుతూ ఉం టారు. సైన్యంలోకి వెళ్లిన వాళ్లు కొద్ది కాలమే ఉంటారు. ఆ కాలంలో ఎప్పుడు ఎలాంటి విపత్తును ఎదుర్కోవాలో తెలియదు. అయినా అదంతా దేశం కోసమే. అలాంటి సైనికులు సర్వీసు నియమావళిని అనుసరించి చిన్న వయసులోనే పదవీ విరమణ చేస్తుంటారు. వారికి ప్రభుత్వం తరఫున సేద్యయోగ్యమైన భూమి, ఇంటి నిర్మాణానికి 200 చ॥స్థలంతోపాటు పునరావా సంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో 3 శాతం ఉద్యోగాలు (పునర్నియామకం) జరగాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం వీటి అమలు గురిం చి ఏమాత్రం పట్టించు కోలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై దృష్టిసారించి పునర్నియామకాలను సక్రమంగా అమలు చేసి మాజీ సైనికులను ఆదుకోవాలని ప్రార్థిస్తున్నాం. - డా॥ఎ.సిద్ధన్న (మాజీ సైనికులు) కొల్లాపూర్, మహబూబ్‌నగర్ -
మాజీ సైనికులను ఆదుకుంటాం
నాలుగు రాష్ట్రాల లెఫ్టినెంట్ జనరల్ జగ్‌ధీర్‌సింగ్ విద్యానగర్(గుంటూరు) : మాజీ సైనికులను, దేశరక్షణలో భర్తలను కోల్పోయిన వితంతువులను అన్ని విధాలా ఆదుకుంటామని సేవాపురస్కార్, విశిష్ట సేవాపురస్కార్, జీవోసీ, అవార్డుల గ్రహీత, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఏరియా లెఫ్టినెంట్ జనరల్ జగ్‌ధీర్‌సింగ్ తెలిపారు. ఆదివారం గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆర్మీ ఆధ్వర్యంలో మాజీ సైనికుల రాష్ట్ర స్థాయి సదస్సు, సమస్యల పరిష్కారానికి అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా లెఫ్టినెంట్ జనరల్ జగ్‌ధీర్‌సింగ్ పాల్గొని మాట్లాడారు. మాజీ సైనికులు, సైనిక వితంతువుల సమస్యలను సమీప సైనిక సంక్షేమ శాఖ కార్యాలయం ద్వారా తెలియపరిస్తే వాటిని సంబంధిత శాఖల అధికారులతో చర్చించి పరిష్కరిస్తామన్నారు. ఇంటి పన్నులు, భూమి శిస్తు లేకుండా జీవోలున్నాయని వాటిని అనుసరించి సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. వితంతువులు, మాజీ సైనికుల కుమార్తెల పెళ్లిళ్లకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసు కోవాలన్నారు. అశోక చక్ర, విశిష్ట సేవామెడల్ ఆంధ్రా సబ్‌ఏరియా మేజర్ జనరల్ సీఏ పీఠావలా మాట్లాడుతూ మాజీ సైనికులకు ప్రభుత్వం మెట్ట అయితే ఐదు ఎకరాలు, మాగాణి భూమి అయితే 2.5 ఎకరాలు ఇస్తుందని తెలిపారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలకు, పొలాల కొనుగోలుకు మాజీ సైనికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రుణా లను అందిస్తున్నాయన్నారు. సికింద్రాబాద్ ఈఎమ్ఈ సెంటర్ బ్రిగేడియర్ జె. సిథానా మాట్లాడుతూ దేశ రక్షణలో పాల్గొన్న వారికి విశిష్ట పురస్కారాలు అందించనున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే మాట్లాడుతూ మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఇళ్ల స్థలాలు, ఇతర సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. జిల్లా అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి సోమవారం తన కార్యాలయంలో ఫిర్యాదుల దినోత్సవం జరుగుతుందని మాజీ సైనికులకు ఎటుంటి సమస్యలు న్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆర్మీ ఏఎమ్‌సీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో మాజీ సైనికులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. మాజీ సైనికులలో పేదలు, యుద్ధంలో పనిచేసి నేడు నడవలేని స్థితిలోఉన్న వారిని గుర్తించి మోటార్‌సైకిళ్లు, ట్రైసైకిళ్లు అందజేశారు. అలాగే దాదాపు 200 మంది వితంతువులకు చీరలు, ఆర్థిక సాయంగా రూ. 5వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కల్నల్ శేషా, రిక్రూట్మెంట్ సెక్టార్ కల్నల్ జాఫ్రి, ఈసీహెచ్ఎస్ గుంటూరు మేనేజర్ హనుమంతరావు, క్యాంటిన్ మేనేజర్ శ్రీనివాసరావు, మేజర్ అజిత్‌రెడ్డి, భాష్యం రామకృష్ణా, పద్మశ్రీ టౌన్షిప్ డెరైక్టర్ శ్రీనివాసరావు, రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సైనికులు, మహిళలు పాల్గొన్నారు. -
వారానికి ఒక్కరోజే!
వారానికి ఒకరోజు.. అనగానే వారాంతపు సెలవు గురించే ప్రస్తావిస్తున్నామనుకుంటున్నారా!.. అలా అనుకోవడం సహజమే కానీ.. మనం ఇక్కడ చెప్పుకొనేది వారాంతపు సెలవు గురించి కాదండోయ్!!.. వారంలో ఏడు రోజులుంటే ఉద్యోగులు, వ్యాపారులు.. ఆరు రోజులు పని చేసి.. ఏడో రోజు సెలవు తీసుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే.. కానీ ఒక జిల్లాస్థాయి కార్యాలయ అధికారి మాత్రం దీనికి పూర్తి రివర్స్‌లో పని చేస్తున్నారు. ఆయన పని చేసేది వారంలో ఒక్కరోజే.. మిగిలిన రోజులు ఆయన ఏం చేస్తున్నారో గానీ ఇదే అదనుగా కార్యాలయ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మాజీ సైనికులు, వారి కుటుంబాలతో ఆడుకుంటున్నారు. శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమాన్ని చూడాల్సిన కార్యాలయం పర్యవేక్షణ లేక గాడి తప్పుతోంది. జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయానికి పూర్తిస్థాయి అధికారి లేకపోవడం, అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారి వారంలో ఒక్కరోజే కార్యాల యానికి వస్తుండటంతో పనులు పెండింగులో పడిపోవడమే కాకుం డా సిబ్బంది ఆడిందే ఆటగా వ్యవహారం సాగుతోంది. మాజీ సైనికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, రాయితీలకు సంబంధించి ఈ కార్యాలయమే ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. అధికారి పర్యవేక్షణ లోపించడంతో కార్యాలయ సిబ్బంది ఒక్కో సర్టిఫికెట్‌కు ఒక్కో రేటు వసూలు చేస్తున్నారు. మాజీ సైనికుడిగా నిర్థారించే గుర్తింపు కార్డు ఇవ్వాలంటే రూ.500 చెల్లించాల్సిందేనని పలువురు మాజీ సైనికులు ఆరోపిస్తున్నారు. ఇక ప్రభుత్వ పథకాల వివరాలు తెలుసుకునేందుకు వెళ్లే వారి పట్ల సిబ్బంది దారుణంగా ప్రవర్తిస్తున్నారు. రెచ్చిపోయి నోరుపారేసుకుంటున్నారు. బదిలీ.. ఆ వెంటనే అదనపు బాధ్యతలు పూర్తిస్థాయి అధికారి లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని మాజీ సైనికులు వాపోతున్నారు. గత కొంత కాలంగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. 2003 నుంచి ఆరేళ్లపాటు జిల్లా సైనిక సంక్షేమాధికారిగా పని చేసిన అధికారి 2009లో విజయనగరం జిల్లాకు బదిలీ అయ్యారు. వెళ్లిన కొద్దిరోజులకే శ్రీకాకుళం జిల్లా కార్యాలయ ఇన్చార్జిగా పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్ఏసీ) కూడా అంది పుచ్చుకున్నారు. ఇక అప్పటి నుంచి విజయనగరంలో విధులు ఎలా నిర్వర్తిస్తున్నారన్నది పక్కనపెడితే.. శ్రీకాకుళం కార్యాలయానికి మాత్రం వారంలో ఒక్కరోజే (మంగళవారం) వస్తున్నారు. ఈ విషయాన్ని సదరు అధికారే అంగీకరిస్తున్నారు. పెండింగులో ఫైళ్లు, ధ్రువపత్రాలు ప్రభుత్వ కార్యాలయాల్లో రోజూ విధులు నిర్వహిస్తున్నా ఫైళ్లు, పనులు పెండింగులో ఉండిపోతున్నాయి. అలాంటిది ఒక జిల్లాస్థాయి అధికారి వారానికి ఒకరోజు... నెలలో నాలుగు రోజులే విధులకు హాజరైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫైళ్లు పరిష్కారం కాక పెద్ద సంఖ్యలో పెండింగులో ఉండిపోతున్నాయి. ఇక వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు అధికారి సంతకానికి నోచుకోక ఫైళ్లలో మగ్గిపోతున్నాయి. దరఖాస్తుదారులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. నిర్ణీత గడువులోగా ధ్రుపపత్రాలు అందక ప్రభుత్వ పథకాలకు అనర్హులవుతున్నామని మాజీ సైనికులు, వారి కుటుంబాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ జాప్యాన్నే అనువుగా మలచుకుంటున్న సిబ్బంది పని తొందరగా జరగాలంటే చెయ్యి తడపాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో 4575 మంది మాజీ సైనికులు త్రివిద దళాల్లో(ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) పనిచేసి పదవీ విరమణ చేసిన మాజీ సైనికులు, వితంతువులు జూలై 31 నాటికి జిల్లాలో 4575 మంది ఉన్నారు. వీరందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయానిదే. దేశ రక్షణలో ఆహారహం శ్రమించిన తమ పట్ల కార్యాలయ సిబ్బంది ప్రవరిస్తున్న తీరుపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మాజీ సైనికుల వివరాలు కేటగిరీ ఆర్మీ నేవీ ఎయిర్‌ఫోర్స్ మొత్తం మాజీ సైనికులు 3507 193 123 3823 వితంతువులు 717 20 15 752 నిజమే..కానీ..! వారానికి ఒక్కరోజు విధులకు హాజరవుతున్న మాట వాస్తవమే. నాకు అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. అయితే దీని వల్ల రోజువారీ పనులకు ఇబ్బంది ఉండదు. తాహశీల్దార్ కార్యాలయాల మాదిరిగా మా కార్యాలయంలో సర్టిఫికెట్ల కోసం రోజుల తరబడి తిప్పం. క్షణాల్లో జారీ చేసేస్తాం. ఫైళ్లను కూడా పెండింగ్‌లో ఉంచం. వారం రోజుల ఫైళ్లు ఒకేసారి పరిష్కరించేస్తాం. సిబ్బంది చేతివాటం గురించి నాకు తెలీదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తా. - వి.వి.రాజారావు, మాజీ సైనిక సంక్షేమాధికారి