ఎడ్యుకేషన్ గ్రాంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి
Published Thu, Jul 21 2016 11:24 PM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
హన్మకొండ : మాజీ సైనికులు, వితంతువుల వారి పిల్లల చదువుకు ఆర్థిక సహాయం (ఎడ్యుకేషన్ గ్రాంట్)కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సైనిక సంక్షేమ అధికారిణి టి.వనజ కోరారు.
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ 2015– 16 విద్యా సంవత్సరానికి ఈ ఆర్థిక సహాయం అందిస్తుందని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆర్థిక సహాయం కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పంపుకోవాలని సూచిం చారు. 10వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఈనెల 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, డిగ్రీ చదివిన వారు ఆగష్టు 20వ తేదీ లోపు ఠీఠీఠీ.జుటb.జౌఠి.జీn వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యా రాయితీలకు ఆన్‌లైన్‌లో కావాల్సిన ధ్రువపత్రాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అనంతరం దరఖాస్తు చేసిన పత్రం, ఒరిజనల్ ధ్రువపత్రాలు జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. వివరాలకు 99080 56298, 0870–2456018 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
Advertisement
Advertisement