మాజీ సైనికులకు ఉద్యోగమేళా
Published Sat, Aug 20 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
హన్మకొండ : మాజీ సైనికులకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారి వనజ తెలిపారు. రీ సెటిల్‌మెంట్ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన వారి కోసం పూణేలోని లోహగావు ఎయిర్‌ఫోర్సు స్టేషన్‌లో ఈ నెల 25వ తేదీన ఉద్యోగ మేళా ఉంటుందని వివరించారు.
50 నుంచి 75 వరకు సంస్థలు రానున్నాయని తెలిపారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఠీఠీఠీ.ఛీజటజీnఛీజ్చీ.ఛిౌఝ లేదా ఠీఠీఠీ.్టటజీఠిజ్డీ.ఛిౌఝ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని కోరారు.
Advertisement
Advertisement