శ్రీకాకుళం న్యూకాలనీ: దేశవ్యాప్తంగా మాజీ సైనికులు పొందుతున్న వివిధ పథకాలు, గ్రాంట్లకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వివాహాల గ్రాంటు నుంచి దహన సంస్కారాల వరకు ప్రభుత్వం అందించే ప్రతీ ఒక్క పథకం, గ్రాంటుకు ఇకపై ఆధార్ తప్పనిసరి కానుంది. ప్రస్తుతం పొందుతున్న పథకాలు, గ్రాంట్లతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు సైతం ఆధార్ ను తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సిందేనని కేంద్రం స్పష్టంచేసింది.
దరఖాస్తు సమయంలోనే ఆప్షన్..
ఇకపై మాజీ సైనికులు తమ పథకాలకు, గ్రాంట్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న సమయంలో ఆధార్ ఆప్షన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అది పూర్తి చేసిన తర్వాతే మిగిలిన వివరాలను నమోదు చేయాల్సి ఉం టుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో త్రివిధ దళాల్లో పనిచేసి పదవీవిరమణ పొందిన మాజీ సైనికులతోపాటు వితంతువులు కలిపి 6 వేల మంది వరకు ఉన్నారు. వీరిందరికీ ఆధార్ వర్తించనుం ది. అయితే హోం మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్న పారా మిలిటరీ సైనికులు, పోలీసులుగా పదివీ విరమణ చేసినవారికి ఆధార్ అనుసంధానంపై వివరాలు తెలియాల్సి ఉంది.
మాజీ సైనికులంతా మేల్కోవాలి
మాజీ సైనికులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, గ్రాంట్లకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పథకాలు, గ్రాంట్లు పొందుతున్న వారితో పాటు దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ నంబర్‌ను అనుసంధాల్సిందే. మాజీ సైనికులు, వితంతువులు, కుటుంబీకులంతా మేల్కొవాలి.
– జి.సత్యానందం, జిల్లా సైనిక సంక్షేమాధికారి
Comments
Please login to add a commentAdd a comment