వైద్యానికీ ఆధార్ తప్పదు | aadhaar link to Medical Services | Sakshi
Sakshi News home page

వైద్యానికీ ఆధార్ తప్పదు

Published Thu, Mar 24 2016 11:17 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

aadhaar link to Medical Services

 శ్రీకాకుళం సిటీ: రోగులకు అందించే వైద్యసేవలు ఇక ఆన్‌లైన్ కానున్నాయి. జిల్లాలో అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులతోపాటు రిమ్స్‌లో రోగుల తాకిడి అధికంగానే ఉంటోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోజుకి సుమారుగా వంద, సీహెచ్‌సీల్లో 200ల మంది వరకూ, ఏరియా ఆస్పత్రుల్లో 200లకు పైగా ఓపీలు నమోదవుతున్నారుు. కాగా జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్‌లో రోజుకి 700 మందికి పైగా రోగులు వ చ్చి వైద్యసేవలు పొందుతున్నారు. ఈ ఆస్పత్రుల్లో రోగులకు లభిస్తున్న ఉచిత సేవల వివరాలు ఇక నుంచి ఆన్‌లైన్ కానున్నాయి.
 
 ఇప్పటికే ఇ-ఔషధి పేరుతో గత ఏడాది జూలై 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రుల్లో శ్రీకారం చుట్టగా, జిల్లాలో ఇ-ఔషధిని ఈమధ్యనే అమలులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆస్పత్రికి వైద్యసేవల కోసం వచ్చే రోగులు వారి వెంట ఆధార్‌కార్డును తప్పనిసరి తీసుకురావలసి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఈ విధానాన్ని ్రపభుత్వం అమలు చేసేందుకు నిర్ణయించింది. ఆస్పత్రికి వచ్చే రోగులకు రిజిస్ట్రేషన్ సదుపాయంతో పాటు ఆధార్‌ను సంఖ్యను అనుసంధానం చేయనున్నారు.
 
  ఇదిలా ఉండగా జిల్లాలో శతశాతం ఆధార్ ప్రక్రియ పూర్తి చేశామని అధికారులు పేర్కొంటుండగా, వాస్తవానికి 85 శాతం మాత్రమే పూర్తయినట్టు తెలుస్తోంది. ఇక వైద్యసేవలు ఆన్‌లైన్ చేస్తే ఆధార్‌కార్డు లేని 15 శాతం మందికి వైద్యసేవలు ప్రశ్నార్థకంగా మారనుంది. కాగా, ఆస్పత్రిలో ైవె ద్యసేవలు పొందేందుకు ఆధార్ ప్రక్రియ తప్పనిసరని, అయితే, జీఓ ఇంకా  జిల్లాకు రాలేదని అధికారులు చెప్పడం విశేషం.
 
 ఆస్పత్రుల్లో కంప్యూటర్లు, సిబ్బంది కొరత
 ఇ-ఔషధి విధానం పూర్తిగా ఆస్పత్రుల్లో అమలు జరుగుతున్న నే పథ్యంలో కంప్యూటర్లు, ఆపరేటర్లు, ఫార్మశిస్టుల కొరత వేధిస్తోంది. దీనికి తోడు ఆన్‌లైన్ లో సర్వర్ సిగ్నల్ నెమ్మదిగా ఉండడంతో నెట్‌లో సమాచారం పొందుపరిచేందుకు కూడా సమయం పట్టే అవకాశం ఉందని వైద్యసిబ్బంది పేర్కొంటున్నారు.
 
 కాగా రిమ్స్ ఆస్పత్రిలో నిత్యం ఓపీ తాకిడి అధికమవుతున్న నేపథ్యంలో ఓపీలో సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉంది. కాగా డేటాఎంట్రీ ఆపరేటర్లు, ఫార్మశిస్టుల పోస్టులను మరింత పెంచితే ఇ-ఔషధి కార్యక్రమం విజయవంతంగా అయ్యే అవకాశం ఉంటుందని వైద్య సిబ్బంది చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement