
సాక్షి, శ్రీకాకుళం : రిమ్స్ ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి మరణించిన మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ఇస్తామని మంత్రి అచ్చన్నాయుడు ప్రకటించారు. శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇంజక్షన్ బాధితులను ఆయన సోమవారం పరామర్శించారు. బాధితులకు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నంలో చికిత్స పొందుతున్న వారికి కూడా అవసరమైన చికిత్సను అందిస్తామన్నారు. ఘటనపై జ్యుడీషియల్ విచారణ చేపట్టామని, విచారణ పూర్తి అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తీసుకుంటామని తెలిపారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఇంజెక్షన్ వికటించి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment