మాజీ సైనికులకు కేసీఆర్‌ వరాలు! | Double pension for retired ex-servicemen in Telangana | Sakshi
Sakshi News home page

మాజీ సైనికులకు కేసీఆర్‌ వరాలు!

Published Sun, Dec 25 2016 1:40 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమంపై జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌. - Sakshi

మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమంపై జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తే డబుల్‌ పెన్షన్‌కు ఓకే
మరణించిన తర్వాత భార్యకు సైతం పెన్షన్‌
దేశంలోనే అత్యధికంగా ‘గ్యాలెంటరీ’ పరిహారం
సైనికుల వాహనాలకు లైఫ్‌ ట్యాక్స్‌ మినహాయింపు
ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష
సైనికాధికారులు, మాజీ సైనికులతో కలసి భోజనం చేసిన సీఎం   


సాక్షి, హైదరాబాద్‌: మాజీ సైనికులు, వారి కుటుంబాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు వరాల జల్లు కురిపించారు. మాజీ సైనికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. దేశంలో ఇతర రాష్ట్రాల కన్నా మెరుగ్గా తాము మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఈ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నామని, త్వరలో మరి కొన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి సంబంధించి శనివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

మూడు గంటల పాటు జరిగిన ఈ భేటీలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఎంపీలు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, బి.వినోద్‌ కుమార్, ముఖ్య కార్యదర్శులు రాజీవ్‌ త్రివేదీ, ఎస్‌.నర్సింగ్‌రావు, హోంశాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, దక్షిణ భారత సైనిక కమాండెంట్‌ జనరల్‌ మేజర్‌ జనరల్‌ ఎస్‌.పచౌరి, సికింద్రాబాద్‌ స్టేషన్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ జస్విందర్‌సింగ్, కెప్టెన్‌ నవనీత్‌సింగ్, సైనిక సంక్షేమ కమిటీ సభ్యులు సురేశ్‌రెడ్డి, జగన్‌రెడ్డి, పోచయ్య, ప్రభాకర్‌రెడ్డి, మనోహర్‌ రెడ్డి తదితరులు ఇందులో పాలొ ్గన్నారు. ఈ భేటీకి ముందు ప్రగతి భవన్‌లోనే మాజీ సైనికోద్యోగులు, సైనికాధికారులతో కలసి సీఎం కేసీఆర్‌ భోజనం చేశారు. అనంతరం వారి సమస్యలు, విజ్ఞప్తులు విన్నారు. కాగా తమ సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్‌కు మాజీ సైనికోద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం ప్రకటించిన వరాలివీ..
మాజీ సైనికులు రాష్ట్రప్రభుత్వంలో ఉద్యోగం చేస్తే వారికి డబుల్‌ పెన్షన్‌ ఇచ్చే అంశంపై పరిశీలన. పెన్షన్‌ పొందుతున్న మాజీ సైనికోద్యోగి మరణిస్తే భార్యకు పెన్షన్‌ అందజేత. ప్రతి నెలా ఇతర ఉద్యోగులతో పాటు ఈ పెన్షన్‌ చెల్లింపు.
యుద్ధంలో మరణించిన సైనికుల కుటుం బాలకు అందుతున్న పరిహారం, సదు పాయాలను.. సర్వీసులో అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల వంటి కారణాలతో మర ణించిన సైనికుల కుటుంబాలకు కూడా వర్తింపజేయాలి. ఈ పెన్షన్‌ కూడా ప్రతి నెలా ఇతర ఉద్యోగులతో పాటు చెల్లింపు.
స్పెషల్‌ పోలీసాఫీసర్లుగా పనిచేస్తున్న వారికి మాజీ సైనికోద్యోగుల వేతనం.
సైనిక సంక్షేమ బోర్డుల బలోపేతానికి చర్యలు. పది జిల్లాల్లో ఉన్న బోర్డుల తరహాలో కొత్తగా ఏర్పాటైన 21 జిల్లా ల్లోనూ ఏర్పాటుకు నిర్ణయం. మెదక్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో సైనిక సంక్షేమ కార్యాలయ నిర్మాణానికి చర్యలు.
యుద్ధంలో మరణించిన సైనికులకిచ్చే గ్యాలంటరీ అవార్డుల ద్వారా అందించే పరిహారాన్ని మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉండేలా కొత్త విధానం.
సైనికులు, మాజీ సైనికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో రిజర్వే షన్‌. మిలటరీ స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు. విద్యా సంస్థల్లో స్కౌట్స్, గైడ్స్, ఎన్‌సీసీ శిక్షణ తీసుకునేవారికి, నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో చేరిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు.
వరంగల్‌లో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించినందున దీనికి సంబంధించి వెంటనే ఒప్పందం (ఎంఓయూ) చేసుకోవాలని నిర్ణయం.
ఉద్యోగ రీత్యా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సైనికులు తిరుగుతుంటారు. రాష్ట్రం మారిన ప్రతి సారి వారి సొంత వాహనాలకు తిరిగి లైఫ్‌ ట్యాక్సులు చెల్లించాల్సి వస్తోంది. దీంతో వారు దేశంలో ఇప్పటికే ఎక్కడ పన్ను చెల్లించినప్పటికీ తిరిగి తెలంగాణలో చెల్లించాల్సిన అవసరం లేకుండా చర్యలు.
సైనికులు నిర్మించుకునే ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు, డబుల్‌ బెడ్‌ రూం పథకంలో మాజీ సైనికులకు రెండు శాతం కేటాయింపు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement