తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాజీ సైనికుల మీద శీతకన్ను వేసింది. దేశ రక్షణ కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసే వీర సైనికులు కాశ్మీర్ సరిహద్దులలో ఎముకలు కొరికే చలిని, ఎడారి ప్రాంతంలో ఒళ్లు కాలే వేడిని తట్టుకొని నిలబడతారు. తమ కుటుంబాలకు, పుట్టినగడ్డకు దూరంగా ఉంటూ, రక్షణ నిమిత్తమై తమ ప్రాణాలను సైతం లెక్క చేయక నిరంతరం సరిహద్దులలో కాపలాకాస్తూ ఉంటారు. దేశమంతా నిద్రిస్తుంటే, తాము రాత్రులంతా మేల్కొని తమ కర్త వ్యం నిర్వహిస్తూ దేశాన్నీ దేశ ప్రజలను కాపాడుతూ ఉం టారు. సైన్యంలోకి వెళ్లిన వాళ్లు కొద్ది కాలమే ఉంటారు.
ఆ కాలంలో ఎప్పుడు ఎలాంటి విపత్తును ఎదుర్కోవాలో తెలియదు. అయినా అదంతా దేశం కోసమే. అలాంటి సైనికులు సర్వీసు నియమావళిని అనుసరించి చిన్న వయసులోనే పదవీ విరమణ చేస్తుంటారు. వారికి ప్రభుత్వం తరఫున సేద్యయోగ్యమైన భూమి, ఇంటి నిర్మాణానికి 200 చ॥స్థలంతోపాటు పునరావా సంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో 3 శాతం ఉద్యోగాలు (పునర్నియామకం) జరగాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం వీటి అమలు గురిం చి ఏమాత్రం పట్టించు కోలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై దృష్టిసారించి పునర్నియామకాలను సక్రమంగా అమలు చేసి మాజీ సైనికులను ఆదుకోవాలని ప్రార్థిస్తున్నాం.
- డా॥ఎ.సిద్ధన్న (మాజీ సైనికులు) కొల్లాపూర్, మహబూబ్‌నగర్
మాజీ సైనికుల్ని మరవొద్దు
Published Wed, May 27 2015 5:34 AM | Last Updated on Sun, Sep 3 2017 2:47 AM
Advertisement