ఎన్నాళ్లీ నిరీక్షణ ? | Being deprived of former soldiers | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ నిరీక్షణ ?

Published Sat, Aug 1 2015 3:36 AM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM

ఎన్నాళ్లీ నిరీక్షణ ?

ఎన్నాళ్లీ నిరీక్షణ ?

♦ మాజీ సైనికులకు అందని సంక్షేమం
♦ ఏళ్లుగా పెండింగ్‌లోనే దరఖాస్తులు
♦ వ్యవసాయ భూమి, ఇళ్ల స్థలాలు లేక ఇక్కట్లు
♦ ఇక నుంచి రిటైర్డు అయిన ఏడాదిలోపే దరఖాస్తు చేయాలి
 
  నిజామాబాద్ స్పోర్ట్స్ : వారంతా సరిహద్దు ప్రాంతాల్లో దేశానికి రక్షణగా ఉంటారు.. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడుతారు... ఇలా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన సైనికులు.. దేశానికి చేసిన సేవలకు గౌరవంగా ఉద్యోగ విరమణ  అనంతరం ప్రభుత్వం వ్యవసాయ భూమితో పాటు ఇంటి స్థలం ఇవ్వాలి. కానీ జిల్లాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఎంతోమంది దరఖాస్తులు అనేక సంవత్సరాలుగా మూలుగుతున్నాయే తప్ప వారికి భూమి ఇచ్చిన పాపాన పోవడం లేదు. వాళ్ల నిరీక్షణకు ఫలితం లేక నానా ఇక్కట్లు పడుతున్నారు.

  ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే..
  జిల్లాలో మాజీ సైనికులు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనిక కుటుంబాలు చాలానే ఉన్నాయి. 1992 నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది మాజీ సైనికులు తమకు వ్యవసాయ భూమి, ఇంటి స్థలం ఇవ్వాలని దరఖాస్తులు పెట్టుకున్నారు. ఏళ్ల తరబడి దేశానికి సేవ చేసిన వీరికి ప్రభుత్వం మాత్రం తగిన గుర్తింపు ఇవ్వడం లేదు. మాజీ సైనికులకు, సైనిక కుటుంబాలకు జీ.ఓ ప్రకారం ఐదెకరాల వ్యవసాయ భూమి, 130 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి. కానీ ఈ నిబంధనలు జిల్లాలో అమలు కావడం లేదు. జిల్లా సైనిక కార్యాలయంలో వారు పెట్టుకుంటున్న దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉంటున్నారుు.

 సంవత్సరానికి 10 నుంచి 15 వరకు కొత్త దరఖాస్తులు వస్తున్నాయి. సైనిక సంక్షేమ శాఖ అధికారులు వీటీనీ పరీశీలించి కలెక్టర్ అనుమతితో సంబంధిత రెవెన్యూ డివిజన్, తహాశీల్దార్ కార్యాలయూలకు పంపుతున్నారు. గత 20 ఏళ్ల నుంచి ఇప్పటివరకు జిల్లాలో సుమారు 600 మంది మాజీ సైనికులు, 130 మంది వీర మరణం పొందిన సైనికుల భార్యలు ఉన్నారు. అరుుతే ఇందులో 2006కు ముందు దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరికి వ్యవసాయ భూమి ఇచ్చినట్లు అధికారులు చెపుతున్నప్పటికీ.. వారి డిశ్చార్జ్ బుక్‌లో మాత్రం ఆ వివరాలు లేవు. గతంలో ఇచ్చిన వారికి సైతం నిబంధనల ప్రకారం ఐదెకరాల వ్యవసాయ భూమికి బదులు .. ధరలు పెరిగాయనే సాకుతో రెండున్నర ఎకరాలకు తగ్గించారు. ఇప్పుడు చాలా మందికి ఆ భూమి కూడా ఇవ్వకపోవడంతో సైనిక కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగి వేసారుతున్నారు. ఇక తమకు భూమి రాదనే  నిరాశ నిస్పృహలో పడిపోతున్నారు. మరి వీరి నిరీక్షణకు తెర పడుతుందో లేదో వేచి చూడాల్సిందే.

 ఏడాదిలోపే దరఖాస్తు చేసుకోవాలి...
 మాజీ సైనికులు ఉద్యోగ విరమణ పొందిన ఏడాది లోపే దరఖాస్తు చేసుకోవాలని 2007లో కొత్త నిబంధన విధించారు. అంతకుముందు డ్యూటీలో ఉన్నవారు, రిటైర్డ్ అరుున వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. కానీ 2007 జీఓ ప్రకారం రిటైర్డ్ అరుున ఏడాది లోపులోనే సైనిక కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రజావాణిలో నేరుగా కలెక్టర్‌కు కూడా వినతిపత్రాలు ఇవ్వవచ్చు. అరుుతే రిటైర్డ్ అరుు ఏడాది తర్వాత దరఖాస్తు చేస్తే మాత్రం వాటిని తిరస్కరిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement