Wage Board
-
సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) యాజమాన్యం11వ వేజ్ బోర్డు ఏరియర్స్ విడుదల చేసింది. ఇందుకుగానూ రూ.1450 కోట్లను కేటాయించింది. సంస్థ డైరెక్టర్(పర్సనల్, ఫైనాన్స్) ఎన్.బలరామ్ ఆదేశాలపై కార్మికుల అకౌంట్లలో గురువారం మధ్యాహ్నం ఈ నగదు జమ చేసింది. ప్రస్తుత 39, 413 మంది ఉద్యోగుల కోసం రూ. 1450 కోట్లు విడుదల చేసింది సింగరేణి యాజమాన్యం. సింగరేణి భవన్ నుంచి గురువారం మధ్యాహ్నం ఆన్లైన్ ద్వారా ఎరియర్స్ విడుదల చేసిన చేశారు డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్) ఎన్.బలరామ్, జీఎం(కో ఆర్డినేషన్) ఎం.సురేష్. సగటున ఒక్కో కార్మికుడికి మూడు లక్షల డెబ్బై వేల రూపాయల ఎరియర్స్ అందనుంది. అయితే.. ఉద్యోగులకు వాళ్ల వాళ్ల సర్వీస్ సీనియారిటీని బట్టి నగదు జమ అవుతుంది. ఎరియర్స్ చెల్లింపుపై సింగరేణి సీ&ఎండీ ఎన్.శ్రీధర్, డైరెక్టర్ ఎన్ బలరామ్‌కు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా.. త్వరలో దసరా, దీపావళి బోనస్‌ల చెల్లింపు ఉంటుందని డైరెక్టర్ బలరామ్ వెల్లడించారు. -
సింగరేణి కార్మికులకు 11వ వేజ్‌బోర్డ్ వేతనాలు నేడు
సింగరేణి (కొత్తగూడెం)/గోదావరిఖని: సింగ రేణి కార్మికులకు 11వ వేజ్‌బోర్డ్ ప్రకారం కొత్త వేతనాలను సంస్థ సోమవారం చెల్లించనుంది. కోల్ ఇండియా పరిధిలోని సింగరేణితో పాటు మరో 8 బొగ్గు పరిశ్రమలకు చెందిన సుమారు 3.50 లక్షల మంది కార్మికులకు జూలై నుంచి కొత్త వేతనాలు అందించేందుకు సర్క్యులర్ విడుదల చేసింది. 10వ వేజ్‌బోర్డ్‌లో 1వ కేట గిరీ నుంచి ఏ1 గ్రేడ్ కార్మికులు, సూపర్వైజర్లు కలిపి సుమారు 42వేల మంది పనిచేస్తున్నా రు. వీరికి జూన్ వరకు నెలకు రూ.320 కోట్లు వేతనాల రూపంలో చెల్లించగా, 11వ వేతన సవరణలో అదనంగా రూ.70 కోట్ల మేర పెరి గాయి. గతంలో కేటగిరీ–1 కార్మికులకు రోజు కు రూ.1011.27 చెల్లించగా, ఇప్పుడు రూ.1502.66 చెల్లిస్తారు. ఏ1 గ్రేడ్, సూపర్ వైజర్లకు వేతనం గతంలో రూ.47,802.52 ఉండగా, 11వ వేజ్‌బోర్డు అమలుతో రూ.71, 030.56కు పెరిగింది. ఇంకా వీటికి అలవెన్స్‌లు అదనంగా లభిస్తాయి. బకాయి వేతనాలు విడుదల.. 10వ వేజ్‌బోర్డ్ కాల పరిమితి 2021 జూన్ 30 తో ముగిసింది. అంటే 2021 జూలై 1 నుంచి 11వ వేజ్‌బోర్డు అమలు కానుంది. ఈ నేపథ్యంలో 23 నెలల బకాయిలు కూడా కార్మికుల ఖా తాల్లో జమ కానున్నాయి. 11వ వేజ్‌బోర్డ్‌లో 19 శాతం మినిమమ్ గ్యారెంటీ బెనిఫిట్ (ఎంజీ బీ) జీతం పెరుగుదలతోపాటు 25 శాతం అల వెన్స్‌లు కలిపి ఒకొక్క కార్మికుడికి వారి వేతన స్థాయిని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు బకాయిలు అందే అవకాశం ఉంది. -
బొగ్గు గని కార్మికుల వేజ్‌బోర్డు ఐదేళ్లు
శ్రీరాంపూర్ (మంచిర్యాల)/గోదావరిఖని: సింగరేణి సహా దేశంలోని అన్ని బొగ్గు గనుల 11వ వేజ్ బోర్డు కాలపరిమితి ఐదేళ్లు ఉండేలా ఒప్పందం జరిగింది. బుధవారం ఢిల్లీలోని సామ్రాట్ హోటల్లో కోలిండియా చైర్మన్ అగర్వాల్ అధ్యక్షతన జరిగిన 11వ జేబీసీసీఐ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భేటీలో భాగంగా వేతన ఒప్పందంపై కోలిండియా, సింగరేణి కంపెనీ, 4 జాతీయ సంఘాల ప్రతినిధులు చర్చించారు. నవరత్న, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో వేతన ఒప్పంద కాలపరిమితి 10 ఏళ్లుగా ఉందని, బొగ్గు పరిశ్రమల్లోనూ ఇలానే ఒప్పందాలు చేసుకోవాలని కోలిండియా యాజమాన్యం పట్టుబట్టింది. సంస్థలో పనిచేస్తున్న అధికారులతో పోల్చితే కార్మికుల బేసిక్ ఎక్కువగా ఉంటోందని పేర్కొంది. అయితే ఈ ఒప్పందానికి జాతీయ సంఘాలు ససేమిరా అన్నాయి. ఐదేళ్ల కాలపరిమితికే అంగీకరిస్తామని చెప్పాయి. దీంతో యాజమాన్యం వెనక్కి తగ్గి అంగీకరిస్తూ ఒప్పందం చేసుకుంది. మిగతా జీతభత్యాల విషయం ఈ చర్చల్లో కొలిక్కి రాలేదు. డీపీఈ ప్రకారం వేతనాలు మాకొద్దు కార్మిక సంఘాల డిమాండ్లను పరిష్కరిస్తే ఎంత ఆర్థిక భారం పడుతుందో యాజమాన్యం లెక్కలేసి చెప్పింది. పీఎస్‌యూల్లో ఉన్న వేతనాలకు అనుగు ణంగా బొగ్గు పరిశ్రమల్లోనూ వేతనాలు ఉండాలని సూచించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (డీపీఈ) గైడ్‌లైన్స్ మార్గదర్శకాల ప్రకారం వేతనాలు పెంచుతామంది. కానీ కార్మిక సంఘాల నేతలు డీపీఈ గైడ్‌లైన్స్ ప్రకారం వేతనాలు అంగీకరించబోమన్నారు. వేతనాలు, అలవెన్సు పెరుగుదల, కేడర్ స్కీం, సీపీఆర్ఎంఎస్ మెడికల్ స్కీం సవరణ, పెన్షన్ సవరణ, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వంటి డిమాండ్లను 5 విభాగాలుగా చేసి ప్రత్యేక కమిటీల ద్వారా చర్చిస్తామని యాజమాన్యం ప్రతిపాదించగా కార్మిక సంఘాల నేతలు ఖండించారు. అన్నింటినీ తదుపరి సమావేశాల్లోనే చర్చించాలని డిమాండ్ చేశారు. మిగతా డిమాండ్లపై ఏప్రిల్‌లో జరిగే సమావేశంలో చర్చిస్తామని వేజ్‌బోర్డు సభ్యుడు వి.సీతారామయ్య తెలిపారు. సమావేశంలో లక్ష్మారెడ్డి, మాధవ్నాయక (బీఎంఎస్), రియాజ్ అహ్మద్ (హెచ్ఎమ్మెస్), మంద నర్సింహారావు (సీఐటీయూ) పాల్గొన్నారు. -
వేజ్‌బోర్డు బకాయిలు ఏవి?
గోదావరిఖని(రామగుండం) : సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు 2016 జూలై ఒకటి నుంచి 10వ వేజ్‌బోర్డు అమలవుతోంది. కోల్ఇండియాలో చేసిన ఒప్పందం సింగరేణిలో కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఈ వేతన ఒప్పందానికి సంబంధించిన బకాయిల్లో కొంత మొత్తం చెల్లించగా...మిగిలిన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారనేది ఇంకా తేలకపోవడంతో కార్మికులకు ఎదురుచూపులు తప్పడం లేదు. దేశవ్యాప్తంగా ఎనిమిది సబ్సిడరీ సంస్థలతో కూడిన కోల్ఇండియాలో పనిచేస్తున్న మూడున్నర లక్షల మంది, స్వతంత్ర ప్రతిపత్తి కలిగి తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సింగరేణిలో పనిచేస్తున్న 53 వేల మంది కార్మికులకు ప్రతీ ఐదేళ్లకోసారి వేతనాలు పెంచుతారు. ఇందుకోసం కోల్ఇండియా, సింగరేణిలో పనిచేస్తున్న జాతీయ కార్మిక సంఘాలు, యాజమాన్యాల నుంచి ప్రతినిధులను ఎంపికచేసి జాయింట్ బైపార్టియేటెడ్ కమిటీ ఫర్ కోల్ ఇండస్ట్రీ (జేబీసీసీఐ) అనే కమిటీని నియమిస్తారు. ఈ కమిటీ పలుమార్లు చర్చలు జరిపిన అనంతరం వేతనాలు ఎంత మేరకు పెంచాలనే నిర్ణయం తీసుకుంటుంది. ఆ మేరకు పెరిగిన వేతనాలను కోల్ఇండియా యాజమాన్యం, సింగరేణి యాజమాన్యం కార్మికులకు అందజేస్తుంది. 2017 నవంబర్ నుంచి కొత్త వేతనాలు.. పదో వేతన ఒప్పందం 2016 జూలై ఒకటి నుంచి అమలు కావాల్సిఉంది. పెరిగిన వేతనాలు అప్పటి నుంచి ఇవ్వాల్సి ఉండగా.. యాజమాన్యాలు 2017 నవంబర్ నెల నుంచి ఇస్తున్నాయి. అయితే 2016 జూలై నుంచి 2017 అక్టోబర్ వరకు 16 నెలలకు సంబంధించి ఇవ్వాల్సిన వేతనాలు యాజమాన్యాలు కార్మికులకు బకాయి పడ్డాయి. అయితే ఆనాడు చేసుకున్న ఒప్పందంలో భాగంగా ప్రతీకార్మికుడికి బకాయిలలో రూ.51 వేలను ప్రతీ కార్మికుడికి 2017 నవంబర్ 3న చెల్లించాయి. కానీ.. పెరిగిన వేతనాల ప్రకారం ఒక్కో కార్మికుడికి కనీసంగా లక్ష రూపాయల నుంచి రూ.2.50 లక్షల వరకు ఈ 16 నెలలకు సంబంధించి రావాల్సి ఉంది. ఇందులో రూ.51 వేలను ముందస్తుగా ఇవ్వగా మిగిలిన బకాయిలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. కానీ యాజమాన్యాలు ఇప్పటి వరకు వేతన బకాయిలను చెల్లించడానికి ముందుకు రాకపోవడంతో కార్మికులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఈనెల 15 లోపు ఇవ్వడం అనుమానమే.. కోల్ఇండియా యాజమాన్యం ఈనెల 15 లోపు వేతన ఒప్పంద బకాయిల్లో 70 శాతం వరకు చెల్లింపులు చేస్తామని మే 31న ఉత్తర్వుల జారీచేసింది. కానీ జేబీసీసీఐ కమిటీలోని జాతీయ కార్మిక సంఘాలకు చెందిన సభ్యుల సంఖ్య విషయంలో తారుమారు కావడంతో ఆయా సంఘాల సభ్యుల సమావేశం కాలేదు. దీంతో ఈ నెల 15లోపు ఇవ్వాలనుకున్న వేతన బకాయిలు కూడా చెల్లించేది అనుమానంగా ఉంది. కోల్ఇండియాలో చేసేచెల్లింపుల ఆ«ధారంగానే సింగరేణిలో కూడా వేతన బకాయిలు చెల్లిస్తారు. కానీ... కోల్ఇండియాలో వేతన బకాయిల చెల్లింపు జరిగే అవకాశాలు కనిపించకపోవడంతో ఇక్కడ కూడా చెల్లింపులు చేయడం జరగదనే ఊహగానాలు బయలుదేరుతున్నాయి. అయితే కోల్‌ఇండియాతో సంబంధం లేకుండా సింగరేణి యాజమాన్యం కార్మికులకు పదో వేతన ఒప్పంద బకాయిలను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
కొత్త వేజ్‌బోర్డుకు మరింత సమయం
సాక్షి, హైదరాబాద్: బొగ్గు పరిశ్రమల యాజమాన్యాలు, జాతీయ కార్మిక సంఘాల మధ్య ఇటీవల కుదిరిన 10వ జాతీయ బొగ్గు కార్మికుల వేతనాల ఒప్పందం (ఎన్సీడబ్ల్యూఏ) అమలుకు కొంత సమయం పట్టే అవకాశముందని సింగరేణి బొగ్గు గనుల సంస్థ యాజమాన్యం తెలిపింది. అయితే, ఈ ఒప్పందం ప్రకారం 2016 జూలై 1 నుంచి కార్మికులకు కొత్త వేజ్‌బోర్డు అమలు చేయాల్సి ఉంది. కాగా కొత్త వేజ్‌బోర్డు వేతనాల బకాయిల నుంచి రూ.51 వేలను దీపావళి సందర్భంగా కార్మికులకు అడ్వాన్స్‌గా చెల్లిస్తామని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం సింగరేణి కార్మికుల ఖాతాల్లో ఈ సొమ్మును జమ చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని వెల్లడించారు. కొత్త వేజ్‌బోర్డు వేతనాలు అమల్లోకి వచ్చినప్పుడు ఈ రూ.51 వేల అడ్వాన్స్‌ను మినహాయించుకుని మిగిలిన బకాయిలను కార్మికులకు చెల్లిస్తామని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థ గత నెల రోజుల్లో 3 పర్యాయాలు కార్మికులకు వివిధ రూపాల్లో చెల్లింపులు జరిపిందని.. దసరా అడ్వాన్స్‌గా రూ.120 కోట్లు, దీపావళి బోనస్‌గా రూ.336 కోట్లు, లాభాల బోనస్‌గా రూ.98.84 కోట్లు మొత్తం కలిపి రూ.554.84 కోట్లు చెల్లించిందని వివరించారు. తాజాగా కొత్త వేజ్‌బోర్డు వేతన బకాయిల నుంచి రూ.265 కోట్లను చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
గ్రూపులతో వేజ్‌బోర్డు ఏర్పాటులో జాప్యం
దసరాకు ముందే లాభాల వాటా టీబీజీకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు, మల్లయ్య శ్రీరాంపూర్ : ఐఎన్టీయూసీలో ఉన్న గ్రూపుల వల్ల ఈ10వ వేతన ఒప్పందం ఆలస్యం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయని గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ నేతలు తెలిపారు. శుక్రవారం ఆయూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి వెంకట్రావు, కెంగర్ల మల్లయ్యలు శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జేబీసీసీఐలో ఐఎన్టీయూసీలో ఒక వర్గం నేత చంద్రశేఖర్ దూబే వేసిన కేసు మేరకు సంజీవరెడ్డి వర్గం పేర్లను తీసుకోవద్దని ఈ నెల 16న డిల్లీ హైకోర్టు స్టే ఇచ్చినట్లు తెలిపారు. అయితే మిగిలిన 4 సంఘాలతో కలిసి జేబీసీసీఐ చర్చలు నిర్వహించుకోచ్చని కోర్టు చెప్పినా కూడా ఆ సమావేశాల్లో పాల్గొనడానికి మిగిలిన 4 సంఘాలు ముందుకు రావడం లేదన్నారు. 9వ వేజ్‌బోర్డు నుంచే ఐఎన్టీయూసీ నేతలు సంజీవరెడ్డి, చంద్రశేఖర్ దూబే వర్గాలుగా చీలిపోయారన్నారు. వీరిద్దరి ప్రభావం ఈ వేతన ఒప్పందంపై పడే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉంటే మరో 45 రోజుల్లో గుర్తింపు సంం ఎన్నికలు జరుగనున్నాయని ఈ సమయంలో ఏఐటీయూసీ నేతలు తమను సమ్మెకు పిలుపునివ్వాలని ఏఐటీయూసీ కోరడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ సంవత్సరం కంపెనీకి రూ. 1066 కోట్ల లాభం వచ్చిందని ఇందులో నుంచి 21 శాతంకు మించి వాటా ఇప్పిస్తామని వారు అన్నారు. ఇది కూడా దసరాలోగా కార్మికులకు అందేలా ముఖ్యమంత్రితో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. ఆయూనియన్ బ్రాంచి ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, కేంద్ర కమిటీ నాయకులు పెద్దపల్లి కోటిలింగం, ఏనుగు రవిందర్‌రెడ్డి, మంద మల్లారెడ్డి, వీరబధ్రయ్య, బ్రాంచీ నేతలు బంటు సారయ్య, పానుగంటి సత్తయ్య, నెల్కి మల్లేశ్, పోశెట్టి, బండి రమేశ్, అద్దు శ్రీనివాస్, సీహెచ్ అశోక్, లెక్కల విజయ్, సంజీవ్, లు పాల్గొన్నారు. త్వరలోనే వారసత్వ ఉద్యోగాల ప్రకటన చేయిస్తాం బెల్లంపల్లి : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిసి ఈ నెలాఖరులోగా ప్రకటన చేయిస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావ్ తెలిపారు. శుక్రవారం మందమర్రి ఏరియా శాంతిఖని గనిపై నిర్వహించిన గేట్‌మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా వారసత్వ ఉద్యోగాలను ఇప్పించేందుకు తగిన రీతిలో కషి చేస్తున్నామన్నారు. రాబోయే గుర్తింపు ఎన్నికల్లో కార్మికులు టీబీజీకేఎస్‌ను ఆదరించాలని కోరారు. సమావేశంలో టీబీజీకేఎస్ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, రవీందర్, కేంద్ర కమిటీ కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు వెంకటరమణ, శాంతిఖని గని ఫిట్ సెక్రెటరీ yì . శ్రీనివాస్, అసిస్టెంట్ ఫిట్ సెక్రెటరీ జె.శేఖర్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. . -
వేతనాలు 50 శాతం పెంచాలి
► ఐఎన్టీయూసీలో ► గ్రూపుల వల్లే వేజ్‌బోర్డు ఆలస్యం ► ఏబీకేఎంఎస్ అధ్యక్షుడు, ► వేజ్‌బోర్డు మెంబర్ బీకే.రాయ్ గోదావరిఖని(కరీంనగర్) : బొగ్గు గని కార్మికులకు 10వ వేజ్‌బోర్డులో 50 శాతం వేతనాలు పెంచాలని బీఎంఎస్ అనుబంధ అఖిల భారతీయ ఖదాన్ మజ్దూర్ సంఘ్(ఏబీకేఎంఎస్) జాతీయ అధ్యక్షుడు, వేజ్‌బోర్డు సభ్యుడు బీకే.రాయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పలు వేజ్‌బోర్డు ప్రతిపాదనలను ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా కేంద్ర ప్రభుత్వం, కోలిండియా యాజమాన్యానికి అందజేసినట్లు తెలిపారు. ఆదివారం స్థానిక శారదానగర్ శ్రీసరస్వతీ శిశుమందిర్ ఆవరణలో ఏర్పాటు చేసిన రామగుండం రీజియన్ బీఎంఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐఎన్‌టీయూసీలోని మూడు గ్రూపులకు సంబంధించిన సభ్యులను నామినే ట్ చేసే విషయం తేలకపోవడంతో వేతన ఒప్పంద కమిటీ ఏర్పాటు ఆలస్యమవుతోందని చెప్పా రు. ప్రస్తుతం గ్రాట్యూటీ రూ.10లక్షల వరకే సీలింగ్‌ను నిర్ణయిం చారని, అరుుతే చాలా మందికి రూ.20 లక్షల వరకు గ్రాట్యూటీ వచ్చే అవకాశం ఉన్నందున సీలింగ్ ఎత్తివేయాలన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న శ్రమజీవులైన గని కార్మికులకు ఆదాయపు పన్ను విధించడం సరికాదని, దీనిపై ఉద్యమం చేస్తున్నామని చెప్పారు. ఈ విషయమై బీజేపీ శ్రేణులు కూడా కేంద్రం పై ఒత్తిడి తేవాలని కోరారు. ఉత్పత్తి అయ్యే ప్రతీ టన్ను బొగ్గుకు రూ.20 చొప్పున తీసి సీఎంపీఎఫ్ నిధికి జమచేస్తే కార్మికులకు అవసరమైన రుణాలు సకాలంలో చెల్లించే వీలు కలుగుతుందని చెప్పారు. కాంట్రాక్టు కార్మికులకు రూ.18వేల వేతనం చెల్లించాల్సి ఉండగా కోలిండియూ యూజమాన్యం తాజాగా రూ.12వేలు ఇవ్వడానికి ముందుకు వచ్చిందని తెలిపారు. గతంలో జేబీసీసీఐ హైపవర్ కమిటీ నిర్ణయించిన వేతనాలతో పాటు మహిళా కార్మికులకు వీఆర్ఎస్, ఉద్యోగ విరమ ణ పొందిన కార్మికులు, వారి కుటుంబాలకు పోస్ట్ రిటైర్మెంట్ స్కీమ్ కింద వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. ఏబీకేఎంఎస్, సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ ప్రతినిధులు చింతల సూర్యనారాయణ, లట్టి జగన్మోహన్రావు, కౌశిక హరి, పులి రాజిరెడ్డి మాట్లాడు తూ సింగరేణిలో బీఎంఎస్‌ను బలోపేతం చేయడంలో భాగంగా గనులపై ‘భరోసా యాత్ర’ నిర్వహిస్తున్నామ ని, ఇందులో గుర్తింపు సంఘం వైఫల్యాలను ఎండగడుతున్నామని వివరించారు. కార్యక్రమంలో టుంగుటూరి కొమురయ్య, నాగరాజు, వడ్డేపల్లి రాంచందర్, గొట్టిముక్కల నారాయణచారి, బాలరాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిని వేజ్‌బోర్డు నుంచి తప్పించే కుట్ర
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి. సీతారామయ్య శ్రీరాంపూర్ : వేజ్‌బోర్డు నుంచి సింగరేణిని వేరుచేసే కుట్ర జరుగుతోందని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి సీతారామయ్య తెలిపారు. ఆదివారం నస్పూర్‌లోని నర్సయ్య భవన్లో ఆర్కే 7 గని ఫిట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేజ్‌బోర్డులో ఉంటేనే కార్మికులకు మేలు జరుగుతుందని దాని నుంచి విడగొట్టితే రాష్ట్ర ప్రభుత్వ చేతిలో కీలుబొమ్మగా మారి కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. దీని వెనుక కున్న కుట్రదారులు బయటికి రావాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం, గుర్తింపు సంఘం కలిసి కేంద్రానికి వేజ్బోర్డులోనే సింగరేణి ఉండేలా లేఖ రాసి వారి నిర్ధోశిత్వాన్ని నిలుపుకోవాలన్నారు. ఇదిలా ఉంటే జూన్ 2న జరిగిన ఆవిర్భావ దినోత్సవం రోజును సింగరేణి కార్మికుల డిమాండ్లపై సీఎం ప్రసంగిస్తారని కార్మికులు ఎంతో ఆశగా ఎదురుచూస్తే నిరాశే మిగిలిందన్నారు. తదితర డిమాండ్లపై కలిసి వచ్చే సంఘాలతో కలిసి రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అవసరమైతే సమ్మెకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ డిమాండ్లపై జరిగే ఆందోళనల్లో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఆయూనియన్ బ్రాంచీ సెక్రెటరీ కొట్టె కిషన్‌రావు, కేంద్ర కార్యదర్శి ముస్కె సమ్మయ్య, నాయకులు అశోక్, పీ రాజేందర్, రావుల కృష్ణమూర్తి, మల్లేశ్, కోడి వెంకటేశ్‌లు పాల్గొన్నారు. -
మాజీ సైనికులకు వేజ్‌బోర్డు అమలు చేయాలి
ముషీరాబాద్: మాజీ సైనికులకు 7వ వేతన సవరణ సంఘం సిఫార్సులను అమలు చేయాలని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు అన్నారు. శనివారం ముషీరాబాద్‌లోని గంగపుత్ర సంఘం హాల్లో మాజీ సైనికుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ సైనికుల సమస్యల పరిష్కారంపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించే మాజీ సైనికుల సమస్యలను ప్రభుత్వాలు వెంటనే పరిష్కరిచాలని కోరారు. సైనికులకు వన్‌ర్యాంకు, వన్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళల్లో రెండు శాతం సైనికులకు కేటాయించాలని కోరారు. టీపీసీసీ పరీక్షల్లో సైనికుల కోటా పెంచాలన్నారు. ప్రతి నెలా సైనికుల పెన్షన్ సమస్యలపై సైనిక్ ట్రిబ్యునల్ ద్వారా చర్చించి పరిష్కరించాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు భీమర్తి అశోక్, నాయకులు కెప్టెన్ సురేష్‌రెడ్డి, రామయ్య, నాయీమ్ ఖాన్, అంజయ్య, శంకర్‌గౌడ్, వసంతరావు, శిరాజ్దుద్దీన్, గౌస్ఉద్దీన్ పాల్గొన్నారు.