
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) యాజమాన్యం11వ వేజ్ బోర్డు ఏరియర్స్ విడుదల చేసింది. ఇందుకుగానూ రూ.1450 కోట్లను కేటాయించింది. సంస్థ డైరెక్టర్(పర్సనల్, ఫైనాన్స్) ఎన్.బలరామ్ ఆదేశాలపై కార్మికుల అకౌంట్‌లలో గురువారం మధ్యాహ్నం ఈ నగదు జమ చేసింది.
ప్రస్తుత 39, 413 మంది ఉద్యోగుల కోసం రూ. 1450 కోట్లు విడుదల చేసింది సింగరేణి యాజమాన్యం. సింగరేణి భవన్ నుంచి గురువారం మధ్యాహ్నం ఆన్‌లైన్ ద్వారా ఎరియర్స్ విడుదల చేసిన చేశారు డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్) ఎన్.బలరామ్, జీఎం(కో ఆర్డినేషన్) ఎం.సురేష్. సగటున ఒక్కో కార్మికుడికి మూడు లక్షల డెబ్బై వేల రూపాయల ఎరియర్స్ అందనుంది. అయితే.. ఉద్యోగులకు వాళ్ల వాళ్ల సర్వీస్ సీనియారిటీని బట్టి నగదు జమ అవుతుంది.
ఎరియర్స్ చెల్లింపుపై సింగరేణి సీ&ఎండీ ఎన్.శ్రీధర్, డైరెక్టర్ ఎన్ బలరామ్‌కు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా.. త్వరలో దసరా, దీపావళి బోనస్‌ల చెల్లింపు ఉంటుందని డైరెక్టర్ బలరామ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment