గ్రూపులతో వేజ్‌బోర్డు ఏర్పాటులో జాప్యం
-
దసరాకు ముందే లాభాల వాటా
-
టీబీజీకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు, మల్లయ్య
శ్రీరాంపూర్ : ఐఎన్టీయూసీలో ఉన్న గ్రూపుల వల్ల ఈ10వ వేతన ఒప్పందం ఆలస్యం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయని గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ నేతలు తెలిపారు. శుక్రవారం ఆయూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి వెంకట్రావు, కెంగర్ల మల్లయ్యలు శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జేబీసీసీఐలో ఐఎన్టీయూసీలో ఒక వర్గం నేత చంద్రశేఖర్ దూబే వేసిన కేసు మేరకు సంజీవరెడ్డి వర్గం పేర్లను తీసుకోవద్దని ఈ నెల 16న డిల్లీ హైకోర్టు స్టే ఇచ్చినట్లు తెలిపారు.
అయితే మిగిలిన 4 సంఘాలతో కలిసి జేబీసీసీఐ చర్చలు నిర్వహించుకోచ్చని కోర్టు చెప్పినా కూడా ఆ సమావేశాల్లో పాల్గొనడానికి మిగిలిన 4 సంఘాలు ముందుకు రావడం లేదన్నారు. 9వ వేజ్‌బోర్డు నుంచే ఐఎన్టీయూసీ నేతలు సంజీవరెడ్డి, చంద్రశేఖర్ దూబే వర్గాలుగా చీలిపోయారన్నారు. వీరిద్దరి ప్రభావం ఈ వేతన ఒప్పందంపై పడే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉంటే మరో 45 రోజుల్లో గుర్తింపు సంం ఎన్నికలు జరుగనున్నాయని ఈ సమయంలో ఏఐటీయూసీ నేతలు తమను సమ్మెకు పిలుపునివ్వాలని ఏఐటీయూసీ కోరడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.
ఈ సంవత్సరం కంపెనీకి రూ. 1066 కోట్ల లాభం వచ్చిందని ఇందులో నుంచి 21 శాతంకు మించి వాటా ఇప్పిస్తామని వారు అన్నారు. ఇది కూడా దసరాలోగా కార్మికులకు అందేలా ముఖ్యమంత్రితో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. ఆయూనియన్ బ్రాంచి ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, కేంద్ర కమిటీ నాయకులు పెద్దపల్లి కోటిలింగం, ఏనుగు రవిందర్‌రెడ్డి, మంద మల్లారెడ్డి, వీరబధ్రయ్య, బ్రాంచీ నేతలు బంటు సారయ్య, పానుగంటి సత్తయ్య, నెల్కి మల్లేశ్, పోశెట్టి, బండి రమేశ్, అద్దు శ్రీనివాస్, సీహెచ్ అశోక్, లెక్కల విజయ్, సంజీవ్, లు పాల్గొన్నారు.
త్వరలోనే వారసత్వ ఉద్యోగాల ప్రకటన చేయిస్తాం
బెల్లంపల్లి : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిసి ఈ నెలాఖరులోగా ప్రకటన చేయిస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావ్ తెలిపారు. శుక్రవారం మందమర్రి ఏరియా శాంతిఖని గనిపై నిర్వహించిన గేట్‌మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా వారసత్వ ఉద్యోగాలను ఇప్పించేందుకు తగిన రీతిలో కషి చేస్తున్నామన్నారు. రాబోయే గుర్తింపు ఎన్నికల్లో కార్మికులు టీబీజీకేఎస్‌ను ఆదరించాలని కోరారు.
సమావేశంలో టీబీజీకేఎస్ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, రవీందర్, కేంద్ర కమిటీ కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు వెంకటరమణ, శాంతిఖని గని ఫిట్ సెక్రెటరీ yì . శ్రీనివాస్, అసిస్టెంట్ ఫిట్ సెక్రెటరీ జె.శేఖర్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. .