సమ్మె బాట పట్టిన కార్మిక లోకం | The world had turned a labor strike | Sakshi
Sakshi News home page

సమ్మె బాట పట్టిన కార్మిక లోకం

Published Fri, Sep 2 2016 11:28 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

The world had turned a labor strike

  • 13 వేల టన్నుల నష్టం
  • కార్మిక సంఘాల రాస్తారోకో
  • శ్రీరాంపూర్‌ : డివిజన్‌లో సమ్మె విజయవంతమయ్యింది. దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా డివిజన్‌లోని అన్ని గనుల్లో సమ్మె పూర్తిగా జరిగింది. దీంతో సుమారు 13 వేల టన్నుల ఉత్పత్తికి విఘాతం కలిగింది. కార్మికులు వేతనాల రూపంలో సుమారు. రూ 2 కోట్లు నష్టపోయారు. సమ్మె విజయవంతం కోసం ఏఐటీయూసీ, హెచ్‌ఎమ్మెస్,  టీఎన్టీయూసీ, ఎస్పీఎంఎల్‌యూ, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్, ఐఎఫ్‌టీయూలు కషి చే శాయి. వీరంతా గనులపైకి వెళ్లి బంద్‌ను సమీక్షించారు.
    గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌ నేతలు బంద్‌కు మద్దతిచ్చారు. ముఖ్య నేతలు ప్రత్యక్షంగా బంద్‌లో పాల్గొనకున్నా ఆయా గనులపై వారి ఫిట్‌ సెక్రెటరీలు బంద్‌లో భాగస్వామ్యం వహించారు. అన్ని సంఘాలు కూడా సమ్మెలో ఉండటంతో యాజమాన్యం ఏమీ చేయలేక చేతులెత్తాయాల్సి వచ్చింది. ఒక్క ఎస్సార్పీ ఓసీపీలో కొంత బొగ్గు ఉత్పత్తి జరిగింది. యూనియన్ల నేతలను గనులపై తిరిగి వచ్చి అనంతరం శ్రీరాంపూర్‌ బస్టాండ్‌ వద్ద రాస్తారోకో చేశారు.
     
    కార్మిక వ్యతిరేక ప్రభుత్వం
     
    ఈ రాస్తారోకోలో పాల్గొన్న ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వీ సీతారామయ్య మాట్లాడుతూ కేంద్రం కార్మిక వ్యతిరేక విదానాలకు పాల్పడుతుందన్నారు. ఈ సమ్మె విజయవంతం చేసిన కార్మికులను ఆయన అభినందించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరావాలన్నారు.  కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణను ఉపసంహరించుకోవాలని, ధరలు తగ్గించాలని, 10వ వేజ్‌బోర్డు ఒప్పందం వెంటనే చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ పార్టీ నేతలు ప్రత్యేకంగా మోటర్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు.
    ఐఎఫ్‌టీయూ కాంట్రాక్ట్‌ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నస్పూర్, సీసీసీలో ర్యాలీ నిర్వహించారు. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి పీ బానుదాస్, ముస్కె సమ్మయ్య, బ్రాంచీ సెక్రెటరీలు ల్యాగల శ్రీనివాస్, కొట్టె కిషన్‌రావు, బాజసైదా, సీపీఐ జిల్లా కార్యదర్శి శంకర్, నియోజకవర్గం కార్యదర్శి కలవేని శ్యాం, మార్కెట్‌ కమిటీ మాజీ  చైర్మన్‌ కమలాకర్‌రావు, కొండ్ర లింగయ్య, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఉపాధ్యక్షుడు బాపురావు, టీఎన్టీయూసీ నేతలు జక్కుల రాజేశం, బ్రహ్మచారీ, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి టీ శ్రీనివాస్, మేకల దాసు, బ్రహ్మానందం, మరో వర్గం నేతలు కొండపర్తి శంకర్‌లు పాల్గొన్నారు.
    సమ్మె విజయవంత కావడం కార్మికుల విజయమని ఎస్సీఎంఎల్‌యూ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డి అన్నయ్య తెలిపారు. హెచ్‌ఎమ్మెస్‌ నేతలు సీసీసీ కార్నర్‌ వద్ద ప్రత్యేకంగా రాస్తారోకో చేశారు. ఇందులో బ్రాంచీ ఉపాధ్యక్షుడు పేరం రమేశ్, నాయకులు రాజేంద్రప్రసాద్, తిరుపతిగౌడ్, జోయల్, వినయ్‌కుమార్, సింగరేణి కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మంతెన మల్లేశ్‌లు పాల్గొన్నారు. శ్రీరాంపూర్‌ ఓసీపీ వద్ద బైక్‌ షెడ్డు వద్ద ఏఐటీయూసీ నేతలు ముస్కె సమ్మయ్య, ఎస్కే బాజీసైదాలను అక్కడి నుంచి వెళ్లిపోమ్మని సీఐ చెప్పగా కొద్ది సేపు వారి మద్య వాగ్వాదం జరిగింది. ఓసీపీ వద్ద జీఎం సుభాని బంద్‌ను సమీక్షించారు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement