సింగరేణి (కొత్తగూడెం)/గోదావరిఖని: సింగ రేణి కార్మికులకు 11వ వేజ్‌బోర్డ్ ప్రకారం కొత్త వేతనాలను సంస్థ సోమవారం చెల్లించనుంది. కోల్ ఇండియా పరిధిలోని సింగరేణితో పాటు మరో 8 బొగ్గు పరిశ్రమలకు చెందిన సుమారు 3.50 లక్షల మంది కార్మికులకు జూలై నుంచి కొత్త వేతనాలు అందించేందుకు సర్క్యులర్ విడుదల చేసింది. 10వ వేజ్‌బోర్డ్‌లో 1వ కేట గిరీ నుంచి ఏ1 గ్రేడ్ కార్మికులు, సూపర్‌వైజర్లు కలిపి సుమారు 42వేల మంది పనిచేస్తున్నా రు.
వీరికి జూన్ వరకు నెలకు రూ.320 కోట్లు వేతనాల రూపంలో చెల్లించగా, 11వ వేతన సవరణలో అదనంగా రూ.70 కోట్ల మేర పెరి గాయి. గతంలో కేటగిరీ–1 కార్మికులకు రోజు కు రూ.1011.27 చెల్లించగా, ఇప్పుడు రూ.1502.66 చెల్లిస్తారు. ఏ1 గ్రేడ్, సూపర్ వైజర్లకు వేతనం గతంలో రూ.47,802.52 ఉండగా, 11వ వేజ్‌బోర్డు అమలుతో రూ.71, 030.56కు పెరిగింది. ఇంకా వీటికి అలవెన్స్‌లు అదనంగా లభిస్తాయి.
బకాయి వేతనాలు విడుదల..
10వ వేజ్‌బోర్డ్ కాల పరిమితి 2021 జూన్ 30 తో ముగిసింది. అంటే 2021 జూలై 1 నుంచి 11వ వేజ్‌బోర్డు అమలు కానుంది. ఈ నేపథ్యంలో 23 నెలల బకాయిలు కూడా కార్మికుల ఖా తాల్లో జమ కానున్నాయి. 11వ వేజ్‌బోర్డ్‌లో 19 శాతం మినిమమ్ గ్యారెంటీ బెనిఫిట్ (ఎంజీ బీ) జీతం పెరుగుదలతోపాటు 25 శాతం అల వెన్స్‌లు కలిపి ఒకొక్క కార్మికుడికి వారి వేతన స్థాయిని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు బకాయిలు అందే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment