వేతనాలు 50 శాతం పెంచాలి
► ఐఎన్‌టీయూసీలో
► గ్రూపుల వల్లే వేజ్‌బోర్డు ఆలస్యం
► ఏబీకేఎంఎస్ అధ్యక్షుడు,
► వేజ్‌బోర్డు మెంబర్ బీకే.రాయ్
గోదావరిఖని(కరీంనగర్) : బొగ్గు గని కార్మికులకు 10వ వేజ్‌బోర్డులో 50 శాతం వేతనాలు పెంచాలని బీఎంఎస్ అనుబంధ అఖిల భారతీయ ఖదాన్ మజ్దూర్ సంఘ్(ఏబీకేఎంఎస్) జాతీయ అధ్యక్షుడు, వేజ్‌బోర్డు సభ్యుడు బీకే.రాయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పలు వేజ్‌బోర్డు ప్రతిపాదనలను ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా కేంద్ర ప్రభుత్వం, కోలిండియా యాజమాన్యానికి అందజేసినట్లు తెలిపారు. ఆదివారం స్థానిక శారదానగర్ శ్రీసరస్వతీ శిశుమందిర్ ఆవరణలో ఏర్పాటు చేసిన రామగుండం రీజియన్ బీఎంఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐఎన్‌టీయూసీలోని మూడు గ్రూపులకు సంబంధించిన సభ్యులను నామినే ట్ చేసే విషయం తేలకపోవడంతో వేతన ఒప్పంద కమిటీ ఏర్పాటు ఆలస్యమవుతోందని చెప్పా రు.
ప్రస్తుతం గ్రాట్యూటీ రూ.10లక్షల వరకే సీలింగ్‌ను నిర్ణయిం చారని, అరుుతే చాలా మందికి రూ.20 లక్షల వరకు గ్రాట్యూటీ వచ్చే అవకాశం ఉన్నందున సీలింగ్ ఎత్తివేయాలన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న శ్రమజీవులైన గని కార్మికులకు ఆదాయపు పన్ను విధించడం సరికాదని, దీనిపై ఉద్యమం చేస్తున్నామని చెప్పారు. ఈ విషయమై బీజేపీ శ్రేణులు కూడా కేంద్రం పై ఒత్తిడి తేవాలని కోరారు. ఉత్పత్తి అయ్యే ప్రతీ టన్ను బొగ్గుకు రూ.20 చొప్పున తీసి సీఎంపీఎఫ్ నిధికి జమచేస్తే కార్మికులకు అవసరమైన రుణాలు సకాలంలో చెల్లించే వీలు కలుగుతుందని చెప్పారు. కాంట్రాక్టు కార్మికులకు రూ.18వేల వేతనం చెల్లించాల్సి ఉండగా కోలిండియూ యూజమాన్యం తాజాగా రూ.12వేలు ఇవ్వడానికి ముందుకు వచ్చిందని తెలిపారు.
గతంలో జేబీసీసీఐ హైపవర్ కమిటీ నిర్ణయించిన వేతనాలతో పాటు మహిళా కార్మికులకు వీఆర్‌ఎస్, ఉద్యోగ విరమ ణ పొందిన కార్మికులు, వారి కుటుంబాలకు పోస్ట్ రిటైర్మెంట్ స్కీమ్ కింద వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. ఏబీకేఎంఎస్, సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ ప్రతినిధులు చింతల సూర్యనారాయణ, లట్టి జగన్మోహన్‌రావు, కౌశిక హరి, పులి రాజిరెడ్డి మాట్లాడు తూ సింగరేణిలో బీఎంఎస్‌ను బలోపేతం చేయడంలో భాగంగా గనులపై ‘భరోసా యాత్ర’ నిర్వహిస్తున్నామ ని, ఇందులో గుర్తింపు సంఘం వైఫల్యాలను ఎండగడుతున్నామని వివరించారు. కార్యక్రమంలో టుంగుటూరి కొమురయ్య, నాగరాజు, వడ్డేపల్లి రాంచందర్, గొట్టిముక్కల నారాయణచారి, బాలరాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.