coal workers
-
బొగ్గు కార్మికులకు కనీస పెన్షన్ ఇకపై రూ. వెయ్యి
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ బొగ్గు గని కార్మికుల కనీస పెన్షన్ రూ.1000కి పెరిగింది. ఈ మేరకు ‘ది కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్–1998’కి సవరణలను ప్రకటిస్తూ గత నెల 8న కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు కొన్ని కేటగిరీల కార్మికులకు కనీస పెన్షన్ రూ.250 ఉండగా, మరికొన్ని కేటగిరీల వారీకి రూ.350 ఉంది. పెరిగిన పెన్షన్ మార్చి 2024 నుంచి అమల్లోకి వచ్చింది. నామమాత్రంగా ఉన్న బొగ్గు గని కార్మికుల పెన్షన్‌ను పెంచాలని దేశ వ్యాప్తంగా ఉన్న పెన్షనర్స్ అసోసియేన్లు సుదీర్ఘకాలంగా పోరాడుతున్నాయి. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిన ప్రస్తుత తరుణంలో కేవలం రూ.వెయ్యికి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల రిటైర్డ్ కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదవీ విరమణ చేసిన బొగ్గు ఉద్యోగుల కుటుంబాలు రూ.1000 పెన్షన్‌తో ఎలా జీవించాలని ప్రశ్నిస్తున్నారు. బొగ్గు మంత్రిత్వ శాఖలోని పెన్షన్ల సవరణ కమిటీ కేవలం రూ.వెయ్యి పెంచుతూ ఎలా సిఫార్సు చేస్తుందని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దండంరాజు రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గును వెలికితీసి దేశానికి వెలుగులు అందిస్తున్న బొగ్గు గని కార్మికులు రిటైర్మెంట్ తర్వాత తమ జీవితపు చరమాంకంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా పెంచాలనీ, కరువు భత్యం సైతం చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
వేతనాలు 50 శాతం పెంచాలి
► ఐఎన్టీయూసీలో ► గ్రూపుల వల్లే వేజ్‌బోర్డు ఆలస్యం ► ఏబీకేఎంఎస్ అధ్యక్షుడు, ► వేజ్‌బోర్డు మెంబర్ బీకే.రాయ్ గోదావరిఖని(కరీంనగర్) : బొగ్గు గని కార్మికులకు 10వ వేజ్‌బోర్డులో 50 శాతం వేతనాలు పెంచాలని బీఎంఎస్ అనుబంధ అఖిల భారతీయ ఖదాన్ మజ్దూర్ సంఘ్(ఏబీకేఎంఎస్) జాతీయ అధ్యక్షుడు, వేజ్‌బోర్డు సభ్యుడు బీకే.రాయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పలు వేజ్‌బోర్డు ప్రతిపాదనలను ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా కేంద్ర ప్రభుత్వం, కోలిండియా యాజమాన్యానికి అందజేసినట్లు తెలిపారు. ఆదివారం స్థానిక శారదానగర్ శ్రీసరస్వతీ శిశుమందిర్ ఆవరణలో ఏర్పాటు చేసిన రామగుండం రీజియన్ బీఎంఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐఎన్‌టీయూసీలోని మూడు గ్రూపులకు సంబంధించిన సభ్యులను నామినే ట్ చేసే విషయం తేలకపోవడంతో వేతన ఒప్పంద కమిటీ ఏర్పాటు ఆలస్యమవుతోందని చెప్పా రు. ప్రస్తుతం గ్రాట్యూటీ రూ.10లక్షల వరకే సీలింగ్‌ను నిర్ణయిం చారని, అరుుతే చాలా మందికి రూ.20 లక్షల వరకు గ్రాట్యూటీ వచ్చే అవకాశం ఉన్నందున సీలింగ్ ఎత్తివేయాలన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న శ్రమజీవులైన గని కార్మికులకు ఆదాయపు పన్ను విధించడం సరికాదని, దీనిపై ఉద్యమం చేస్తున్నామని చెప్పారు. ఈ విషయమై బీజేపీ శ్రేణులు కూడా కేంద్రం పై ఒత్తిడి తేవాలని కోరారు. ఉత్పత్తి అయ్యే ప్రతీ టన్ను బొగ్గుకు రూ.20 చొప్పున తీసి సీఎంపీఎఫ్ నిధికి జమచేస్తే కార్మికులకు అవసరమైన రుణాలు సకాలంలో చెల్లించే వీలు కలుగుతుందని చెప్పారు. కాంట్రాక్టు కార్మికులకు రూ.18వేల వేతనం చెల్లించాల్సి ఉండగా కోలిండియూ యూజమాన్యం తాజాగా రూ.12వేలు ఇవ్వడానికి ముందుకు వచ్చిందని తెలిపారు. గతంలో జేబీసీసీఐ హైపవర్ కమిటీ నిర్ణయించిన వేతనాలతో పాటు మహిళా కార్మికులకు వీఆర్ఎస్, ఉద్యోగ విరమ ణ పొందిన కార్మికులు, వారి కుటుంబాలకు పోస్ట్ రిటైర్మెంట్ స్కీమ్ కింద వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. ఏబీకేఎంఎస్, సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ ప్రతినిధులు చింతల సూర్యనారాయణ, లట్టి జగన్మోహన్రావు, కౌశిక హరి, పులి రాజిరెడ్డి మాట్లాడు తూ సింగరేణిలో బీఎంఎస్‌ను బలోపేతం చేయడంలో భాగంగా గనులపై ‘భరోసా యాత్ర’ నిర్వహిస్తున్నామ ని, ఇందులో గుర్తింపు సంఘం వైఫల్యాలను ఎండగడుతున్నామని వివరించారు. కార్యక్రమంలో టుంగుటూరి కొమురయ్య, నాగరాజు, వడ్డేపల్లి రాంచందర్, గొట్టిముక్కల నారాయణచారి, బాలరాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బొగ్గు కార్మికుల సమ్మె విరమణ
కేంద్ర ప్రభుత్వం, యూనియన్లు ఒక అంగీకారానికి రావడంతో దేశవ్యాప్తంగా బొగ్గు కార్మికులు బుధవారం సమ్మె విరమించారు. సింగరేణిలో కూడా కార్మిక సంఘాలు సమ్మెను విరమించాయి. న్యూఢిల్లీ/కొత్తగూడెం: కేంద్ర ప్రభుత్వం, యూనియన్లు ఒక అంగీకారానికి రావడంతో దేశవ్యాప్తంగా బొగ్గు కార్మికులు బుధవారం సమ్మె విరమించారు. సుమారు ఆరు గంటల సేపు బొగ్గు శాఖ మంత్రి పియుష్ గోయల్‌తో జరిగిన కార్మిక సంఘాల సమావేశం అనంతరం ఏఐటీయూసీ నేత లఖన్ లాల్ మహతో.. ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే, ఒప్పందం షరతులు, నిబంధనల గురించి మాత్రం వెల్లడించలేదు. బొగ్గు సరఫరాపై సందిగ్ధం వీడటం .. విద్యుత్ కంపెనీలకు ఊరట కల్పించనుంది. మరోవైపు, సింగరేణిలో కూడా కార్మిక సంఘాలు సమ్మెను విరమించాయి. కోల్ ఇండియాలో డిజిన్వెస్మెంట్, ఈ-వేలం ద్వారా బొగ్గు గనుల కేటాయింపు తదితర అంశాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె రెండు రోజుల పాటు సాగింది. మరోవైపు, కోల్ ఇండియాను ప్రైవేటీకరించే యోచనేదీ లేదని, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడతామని పియుష్ గోయల్ స్పష్టం చేశారు.