
సోనియా సీఎం పదవి ఇస్తే కాదనను: సర్వే
రాష్ట్రాలను విభజించవద్దని...తెలంగాణ ఇవ్వవద్దని ఇందిరాగాంధీ ఎప్పుడు చెప్పలేదని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ప్రజలకిచ్చిన మాట కోసమే సోనియాగాంధీ తెలంగాణ ఇస్తున్నారని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. జనవరికల్లా రెండు రాష్ట్రాలు, ప్రత్యేక పీసీసీలు ఏర్పడతాయని సర్వే సత్యనారాయణ వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో దళితుడికే ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సర్వే సత్యనారాయణ అన్నారు. తాను ముఖ్యమంత్రి పదవి రేసులో లేనంటూనే.... కావాలంటే సీఎం అవలేరని.... ఒకవేళ సోనియా గాంధీ ముఖ్యమంత్రి పదవి ఇస్తే కాదనే దమ్ము తనకు లేదని చెప్పుకొచ్చారు. ప్యాకేజీల సమయం అయిపోయిందని, ప్యాకేజీలకు ఎవరూ ఒప్పుకోరని సర్వే అన్నారు. తెలంగాణకు లక్ష కోట్ల రూపాయల ప్యాకేజి ఇస్తే సరిపోతుందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఆయనీ కామెంట్ చేశారు.