టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సంబంధాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం బోడుప్పల్‌లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సర్వే చేసిన వ్యాఖ్యలతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కలిసిపోయేలా ఉన్నాయని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనతో కలిసి వచ్చే పరిస్థితి కనిపిస్తోందన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయం
Published Mon, Jul 30 2018 7:04 AM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM