'రచ్చెకెక్కి పార్టీకి నష్టం చేయొద్దు' | shabbir ali appeal to congress seniors | Sakshi
Sakshi News home page

'రచ్చెకెక్కి పార్టీకి నష్టం చేయొద్దు'

Published Sun, Jun 5 2016 3:53 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

'రచ్చెకెక్కి పార్టీకి నష్టం చేయొద్దు'

'రచ్చెకెక్కి పార్టీకి నష్టం చేయొద్దు'

హైదరాబాద్: సర్వే సత్యనారాయణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు. రచ్చెకెక్కి పార్టీకి నష్టం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఏమైనా సమస్యలు ఉంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చిద్దామని, లేదంటే హైకమాండ్ దృష్టికి తీసుకెళదామని అన్నారు.

సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పటికీ ఎన్నికల్లో గెలవలేక డీలాపడ్డ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేయొద్దని కోరారు. ఇలాంటి వ్యాఖ్యలు మరింత నష్టాన్ని కలిగిస్తాయని చెప్పారు. గత వైఫల్యాలను మర్చిపోయి, నష్టం చేసిన వారిని క్షమిస్తూ పార్టీ ఐక్యత కోసం సీనియర్లు కృషి చేయాలని షబ్బీర్ అలీ సలహాయిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement