సర్వే, మందకృష్ణల నుంచి ప్రాణహాని: ఆకుల రాజేందర్ | Death threat from Sarve Satyanarayana, Manda Krishna: Akula Rajender | Sakshi
Sakshi News home page

సర్వే, మందకృష్ణల నుంచి ప్రాణహాని: ఆకుల రాజేందర్

Published Thu, Apr 3 2014 3:22 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

సర్వే, మందకృష్ణల నుంచి ప్రాణహాని: ఆకుల రాజేందర్ - Sakshi

సర్వే, మందకృష్ణల నుంచి ప్రాణహాని: ఆకుల రాజేందర్

హైదరాబాద్: కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ నుంచి నాకు ప్రాణహాని ఉందని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌ ఆరోపించారు. ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని రాజేందర్ తెలిపారు. మంద కృష్ణ బెదిరింపు ఫోన్ కాల్స్ వెనుక ఉన్నది కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణే అని రాజేందర్ ఆరోపించారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశానని మీడియాకు వెల్లడించారు. 
 
ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నా ఆరోపణలు తప్పని తేలితే రాజకీయాల్లోంచి తప్పుకుంటాను... ఏ పార్టీ నుంచి పోటీచేయను అని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌ స్పష్టం చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement