సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల వ్యవహారాన్ని రక్షణ మంత్రి, కోర్ కమిటీ సభ్యుడు ఏకే ఆంటోనీ నేతృత్వంలోని కమిటీ చూసుకుంటుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేశారు. పార్టీలతో పొత్తు వ్యవహారం పూర్తిగా కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమన్నారు. బుధవారం ఆయన ఇక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికలకు సహకరిస్తారని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు.. ‘ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలపై దృష్టి పెట్టాం. శాసనసభ్యుల వ్యతిరేకతను పరిశీలిస్తున్నాం’ అని క్లుప్తంగా బదులిచ్చారు.