హైదరాబాద్ నుంచి ఢిల్లీ దూరమే: దిగ్విజయ్
రాజ్యసభ అభ్యర్థులు ఎవరనేది ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీయే నిర్ణయిస్తారని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ దూరమేనని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలలో కొత్త విషయం ఏమీ లేదని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను చెప్పే వీలుంటుందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చకు గడువు పెంపు విషయాన్ని రాష్ట్రపతే నిర్ణయిస్తారని ఆయన చెప్పారు.