
6న వస్తా: దిగ్విజయ్ సింగ్
రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవం ఎందుకు చేయలేకపోయారు?
ఆదాలను మేనేజ్ చేయలేకపోయారేం?
రాష్ర్ట కాంగ్రెస్‌పై దిగ్విజయ్ అసహనం
కేవీపీ, టీఎస్సార్, ఎంఏ ఖాన్‌లతో ఎయిర్‌పోర్టులోనే మంతనాలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్‌సింగ్ ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలపై దృష్టి సారించారు. పోలింగ్‌కు ఒకరోజు ముందే ఆరో తేదీన హైదరాబాద్‌లో మకాంవేసి, పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడి క్రాస్ ఓటింగ్‌కు అవకాశాల్లేకుండా వ్యూహం రూపొందించేందుకు సిద్ధమయ్యారు. కర్ణాటకలోని బీదర్ జిల్లాలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతూ ఆయన శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. మాజీమంత్రి షబ్బీర్‌అలీ, పీసీసీ ప్రోటోకాల్ ఛైర్మన్ హెచ్.వేణుగోపాల్, ఏఐసీసీ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి కలిసి రాజ్యసభ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు.
రాజ్యసభ అభ్యర్థులు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి, ఎంఏ ఖాన్ కూడా ఆయనను కలిశారు. రెబెల్ అభ్యర్ధిగా పార్టీ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి రంగంలో దిగడంతో రాజ్యసభ ఎన్నికలు అనివార్యమయ్యాయని ఏఐసీసీ కార్యదర్శి తిరునావుక్కరసు వివరించారు. దీంతో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవమయ్యేలా ఎందుకు చేయలేకపోయారని దిగ్విజయ్ రాష్ట్ర నేతలపై అసహనం వ్యక్తంచేశారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి మీ జిల్లా వాడే కదా... ఎందుకు మేనేజ్ చేయలేకపోయావని సుబ్బరామిరెడ్డిని ప్రశ్నించారు. ఆ తర్వాత విమానాశ్రయంలోని విశ్రాంతి మందిరంలో ముగ్గురు అభ్యర్థులతో ఐదు నిమిషాల చొప్పున ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు సీఎం తీరుపై ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.
సీఎం ప్రోత్సాహంతోనే బరిలో ఆదాల
ళి ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే చైతన్యరాజు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్లు వేశారు. సీఎం చెప్పడంవల్లే పార్టీ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. చివ రిరోజు చైతన్యరాజు నామినేషన్ ఉపసంహరించుకోవడం, ఆదాల ఎన్నికల్లో నిలబడటం కూడా సీఎం రాజకీయంలో భాగమే.
ళి రాజ్యసభకు నలుగురు అభ్యర్థులను పార్టీ తరపున బరిలో నిలపాలన్న సీఎం సూచనను హైకమాండ్ పట్టించుకోకపోవడంతో ఆయనే ఆదాలను బరిలో కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్‌కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం కచ్చితంగా నాలుగో సీటు కూడా గెలుస్తామనే ధీమాలో ఉన్నారు.
ళి ఎన్నికల్లో క్రాస్‌ఓటింగ్ జరిగే అవకాశమున్నట్లు తనకు కూడా సమాచారం ఉందని దిగ్విజయ్ చెప్పారు. దీనివల్ల మొదట సుబ్బరామిరెడ్డికి, ఆ తరువాత కేశవరావుతోపాటు టీడీపీ అభ్యర్ధి గరికపాటి మోహన్‌రావులకు కూడా కొంత నష్టం జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఎన్నికలకు ఒకరోజు ముందు రాష్ట్రానికి వచ్చి పరిస్థితులను చక్కదిద్దుతానని హామీనిచ్చినట్లు సమాచారం.
ళి తెలంగాణ మంత్రులు కె.జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా దిగ్విజయ్‌ను కలిశారు. తెలంగాణ బిల్లును తిర్కసరిస్తూ తీర్మానం చేయడంవల్ల ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయని తెలిపారు. మాజీమంత్రి షబ్బీర్‌అలీ కూడా దిగ్విజయ్‌తో కొద్ది నిమిషాలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ళి రంగారెడ్డి జిల్లా పరిగిలో ఆయన పీసీసీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి నివాసంలో భోజనం చేసి స్థానిక కార్యకర్తలతో కొద్దిసేపు మాట్లాడారు.