రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఏకే ఆంటోనీ కమిటీ మంగళవారం నుంచి పనిచేస్తుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు.
9581141230కు సమాచారమివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఏకే ఆంటోనీ కమిటీ మంగళవారం నుంచి పనిచేస్తుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆంటోనీ కమిటీ సభ్యులను కలిసి తమ అభ్యంతరాలు, అభిప్రాయాలను తెలియజేయాలని ఆసక్తి కలిగినవారు ‘‘9581141230’’ మొబైల్ నెంబర్‌కు సమాచారం పంపాలని కోరారు. సమాచారం అందుకున్న తరువాతే ఆంటోనీ కమిటీని ఎక్కడ, ఎప్పుడు కలవాలనే సమాచార సందేశాన్ని సదరు సంఘాలకు తెలియజేసే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలంగాణ, సీమాంధ్రకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్ధి, కార్మిక , ప్రజా సంఘాలతోపాటు కాంగ్రెసేతర పార్టీలు కూడా కమిటీని సంప్రదించవచ్చని సూచించారు. అయితే వ్యక్తులను కాకుండా గ్రూపులను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు.