డిసెంబరు 5 నుంచి పార్లమెంటు! | Brief Parliament session likely from December first week | Sakshi
Sakshi News home page

డిసెంబరు 5 నుంచి పార్లమెంటు!

Published Mon, Nov 11 2013 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM

Brief Parliament session likely from December first week

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు 5 నుంచి 22 వరకూ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ మేరకు స్వల్పకాలమే డిసెంబరు మొదటి వారం నుంచి నిర్వహించాలంటూ ప్రతిపాదనలు వచ్చాయి. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో పార్లమెంటు వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సోమవారం నిర్వహించే సమావేశంలో సమావేశాల తేదీలపై నిర్ణయం తీసుకోనున్నారు.
 
 పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్, ఆ శాఖ సహాయ మంత్రి రాజీవ్ శుక్లా కూడా సమావేశానికి హాజరు కానున్నారు. సాధారణంగా శీతాకాల సమావేశాలు నెల రోజుల పాటు జరుగుతాయి. కానీ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఢిల్లీ, మిజోరంలలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమావేశాలను కుదించనున్నట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు డిసెంబరు 4 నాటికి ముగియనుండగా, డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement