నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు | Parliament Winter Session From Nov 25 To December 20 | Sakshi
Sakshi News home page

నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Published Tue, Nov 5 2024 4:35 PM | Last Updated on Tue, Nov 5 2024 5:02 PM

Parliament Winter Session From Nov 25 To December 20

ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరుగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మంగళవారం ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. నవంబర్‌ 26(రాజ్యంగా దినోత్సవం)న పార్లమెంట్‌ సెంట్రల్ హాల్‌లో రాజ్యాంగం ఆమోదంపొంది 75 ఏళ్ల సందర్భంగా వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమం జరగనుందని పేర్కొన్నారు. ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జరగనున్న మొదటి పార్లమెంటు  సమావేశాలు కావటం గమనార్హం. 

వక్ఫ్ బిల్లుకు వివాదాస్పద సవరణలు, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనకు సంబంధించిన నిబంధనల బిల్లులు  ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వక్ఫ్ బిల్లు సవరణలను ప్రస్తుతం అధికార బీజేపీకి చెందిన జగదాంబిక పాల్ నేతృత్వంలోని సంయుక్త పార్లమెంటరీ కమిటీ అధ్యయనం చేస్తోంది. నవంబర్ 29లోగా కమిటీ తన నివేదికను పార్లమెంటుకు సమర్పించాల్సి ఉంది. అయితే.. ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయడంతో  జేపీసీ పనితీరు వివాదాస్పదమైంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement