సాక్షి,ఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభమవనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేవం నిర్వహిస్తోంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన అఖిలపక్షం ఆదివారం(నవంబర్ 24) సమావేశమైంది. అఖిలపక్ష సమావేశానికి పలు పార్టీల ఫ్లోర్‌లీడర్లతో పాటు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి , లోక్ సభపక్ష నేత మిథున్‌రెడ్డి హాజరయ్యారు.
పోలవరం ఎత్తు , ప్రత్యేక హోదా, వక్ఫ్ బిల్లు , విశాఖ స్టీలు ప్రైవేటీకరణ అంశాలను వైఎస్సార్‌సీపీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు లేవనెత్తనున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసుల అక్రమ కేసులను నేతలు ప్రస్తావించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పార్లమెంట్‌లో గళం విప్పనున్నారు.
కాగా, సోమవారం(నవంబర్ 25) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవనున్నాయి. డిసెంబర్ 20దాకా సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ చట్టం సవరణ బిల్లు, ఒకే దేశం ఒకే ఎన్నికలు(జమిలి ఎన్నికలు) బిల్లులతో పాటు మరో 16 బిల్లులను ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వక్ఫ్, జమిలి ఎన్నికల చట్టాలను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: మహాయుతి దెబ్బకు ఎల్‌వోపీ సీటు గల్లంతు
Comments
Please login to add a commentAdd a comment