సెకీ తనంతకు తానుగా అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49కు ఇస్తానని ముందుకొచ్చింది
ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం.. ఇందులో లంచాలకు తావెక్కడ?
అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి
హాజరైన రాజ్యసభ పక్షనేత విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంపై టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్షనేత, ఎంపీ మిథున్‌రెడ్డి చెప్పారు. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రక్షణశాఖ రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. వైఎస్సార్‌సీపీ తరపున రాజ్యసభ పక్షనేత విజయసాయిరెడ్డి, లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి హాజరయ్యారు.
మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ రంగసంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) తనంతకు తాను అత్యంత చౌకగా యూనిట్ విద్యుత్ రూ.2.49తో ఇస్తామని ముందుకొచ్చిందన్నారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం అని, ఇందులో లంచాలకు తావెక్కడ ఉందని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి సెకీతోనే ఒప్పందాలు జరిగాయి తప్ప.. అదానీతో కాదని తేల్చిచెప్పారు. కావాలనే టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందన్నారు.
పోలవరంపై భిన్న వ్యాఖ్యలు
అనంతరం లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం విషయంలో ఇటీవల మంత్రుల నుంచి భిన్నమైన స్టేట్‌మెంట్స్ వస్తున్నాయన్నారు. మొదట్లో ఉన్న ఎత్తు ఇప్పుడు ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఈ విషయంపై పార్లమెంట్‌లో చర్చిస్తామన్నారు. పునర్విభజన చట్టంలోని అనేక హామీలను కేంద్రం అమలు చేయలేదని విమర్శించారు.
ఈ హామీలను అమలు చేయాలని కోరామన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొద్దని అఖిలపక్షం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ సమావేశాల్లోనే కేంద్రం వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్టు తెలిపిందన్నారు. మైనార్టీలకు అన్యాయం జరగకుండా, వారి పక్షాన వైఎస్సార్‌సీపీ నిలబడుతుందన్నారు. ఇప్పటికే వక్ఫ్ బిల్లుపై రాజ్యసభ పక్షనేత విజయసాయిరెడ్డి తమ పార్టీ వైఖరేమిటో తెలిపారన్నారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు కఠిన విధానాలు అవసరమని చెప్పామన్నారు.
‘సోషల్’ అరెస్టులపై గొంతెత్తుతాం
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచి వైఎస్సార్‌సీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులపై దారుణంగా వ్యవహరిస్తున్నారని, అక్రమంగా అరెస్టులు చేస్తున్న విషయాన్ని అఖిలపక్షం దృష్టికి తీసుకెళ్లామని మిథున్‌రెడ్డి తెలిపారు. సోషల్ మీడియా పోస్టులపై కార్యకర్తలపై పెట్టాల్సిన సెక్షన్లు కాకుండా.. సంబంధం లేని సెక్షన్లు నమోదు చేస్తూ జైలుకు పంపుతున్న విషయాన్ని వివరించామన్నారు. దీనిపై పార్లమెంట్ సమావేశాల్లో గొంతెత్తుతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment