జవాన్లపై దాడి పాక్దే బాధ్యత: ఆంటోనీ | AK Antony to make statement on soldiers' killing at LoC in Parliament | Sakshi
Sakshi News home page

జవాన్లపై దాడి పాక్దే బాధ్యత: ఆంటోనీ

Published Thu, Aug 8 2013 12:35 PM | Last Updated on Mon, Oct 22 2018 8:44 PM

జవాన్లపై దాడి పాక్దే బాధ్యత: ఆంటోనీ - Sakshi

జవాన్లపై దాడి పాక్దే బాధ్యత: ఆంటోనీ

న్యూఢిల్లీ :  పాకిస్తాన్ చొరబాటుయత్నంపై రక్షణ శాఖమంత్రి ఏకే ఆంటోనీ గురువారం లోక్సభలో వివరణ ఇచ్చారు. మొన్న పాకిస్తాన్ హస్తం లేదన్న ఆయన.... విపక్షాల ఆందోళనల నేపథ్యంలో మాట మార్చారు. భారతీయ జవాన్లపై దాడికి పాకిస్తాన్దే పూర్తి బాధ్యత అని ఆంటోని మరో ప్రకటన చేశారు.

పాక్ సాయం లేనిదే సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఇటువంటి సంఘటనలు జరగవని అన్నారు. జవాన్లపై దాడి ఘటనలో పాక్ బలగాలు పాల్గొన్నాయన్నారు. పూంచ్ సెక్టార్లో ఆర్మీ చీఫ్ పర్యటించారని ఆయన తెలిపారు. మొన్న తనవద్ద ఉన్న సమాచారంతో ప్రకటన చేసినట్లు పేర్కొన్నారు. కాగా అంతకు ముందు ఆర్మీ చీఫ్ బిక్రమ్‌సింగ్‌ .... ఆంటోనీతో భేటీ అయ్యారు.

భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు భారతీయ జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. జవాన్ల మరణంపై రక్షణ మంత్రి ఆంటోని ప్రకటన చేయాలని విపక్షాలు  బుధవారం పార్లమెంట్లో డిమాండ్ చేశాయి. అయితే పాకిస్థాన్ సైనికులతోపాటు మరో 20 మంది తీవ్రవాదులు సైనికుల దుస్తులు ధరించి భారత్ సైనికులపై కాల్పులు జరిపారని ఆంటోని పార్లమెంట్లో వివరించారు.

దాంతో మంత్రి ప్రకటనతో విపక్షాలు ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. రక్షణ మంత్రి ఆంటోని పాకిస్థాన్కు పరోక్షంగా మద్దతిస్తున్నట్లు మాట్లాడుతున్నారని విపక్షాలు ఆందోళనబాట పట్టాయి. ఆంటోనీ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశాయి. దీంతో ఈ ఘటనపై ఆంటోని తాజా ప్రకటన చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement