పీసీసీ తీరును తప్పుపడుతున్న కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి చట్టబద్ధత లేకుండా కేవలం పార్టీ నేతల కోసం ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ వల్ల అనుకున్న రాజకీయ ఫలితాన్ని సాధించలేమన్న ఆందోళన కాంగ్రెస్ సీమాంధ్ర నేతల్లో వ్యక్తమవుతోంది. ఆంటోనీ కమిటీ వేశామని చెప్పుకుని, ఆ కమిటీ ద్వారా తెలంగాణపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తామని చెప్పిన నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా వెనక్కి తగ్గారు. ఆంటోనీ కమిటీ వేసిన నేపథ్యంలో సీమాంధ్రలో ఉద్యమ తీవ్రత తగ్గుతుందని భావించామని సీమాంధ్ర నేత ఒకరు చెప్పారు.
అయితే ఉద్యమం మరింత తీవ్రతరం కావడంతో పార్టీ నాయకులే కాకుండా బయటివారు కూడా ఆ కమిటీ ముందు తమ అభ్యంతరాలు చెప్పొచ్చని కాంగ్రెస్ నేతలు కొత్త పల్లవి మొదలుపెట్టారు. ఒక మొబైల్ ఫోన్ నంబర్ కూడా ఇచ్చి ఆంటోనీ కమిటీ ముందు తమ వాదనలు వినిపించే వారు ఎవరైనా ఉంటే ఆ నంబర్‌కు ఫోన్ చేయాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పడంపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. ‘ఆంటోనీ కమిటీ కాంగ్రెస్ అంతర్గత కమిటీ మాత్రమే. చట్టబద్ధత లేని కమిటీ ముందు ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి ఎందుకు తమ వాదనలు వినిపిస్తాయి? అయినా ఏదో ఒకటి చేస్తున్నామని చెప్పుకోవడాని కోసమే ఆ కమిటీ’ అని కాంగ్రెస్ నేతలే బహిరంగంగా చెబుతున్నారు.
చట్టబద్ధత లేని కమిటీకి ఎందుకింత సీన్?
Published Wed, Aug 14 2013 2:44 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM
Advertisement
Advertisement