ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ | Former Union Minister Vyricherla Kishore Chandra Deo Resigns Congress Party | Sakshi
Sakshi News home page

ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌

Published Sun, Feb 3 2019 2:33 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Former Union Minister Vyricherla Kishore Chandra Deo Resigns Congress Party - Sakshi

సాక్షి, విజయనగరం : కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్‌ చంద్రదేవ్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలో మిత్రులతో చర్చించిన అనంతరం ఏ పార్టీలో చేరేది త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు. రాజీనామా పత్రాన్ని శనివారమే పార్టీ అధిష్టానానికి పంపానని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని అన్నారు.  కాంగ్రెస్‌ రూపొందించిన ఏపీ విభజన చట్టంలో లోపాలున్నాయని విమర్శించారు. పార్టీలో తనలాంటి సీనియర్లకు గౌరవం లేదని వాపోయారు. ఏళ్ల నుంచి పనిచేస్తున్నా గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వ పాలనతో దేశం ప్రమాదంలో పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసే పరిస్థితి తలెత్తిందని ధ్వజమెత్తారు. బీజేపీతో కలిసి ఉండే పార్టీలోకి వెళ్లనని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement