కిశోర్ చంద్రదేవ్ నామినేషన్లో ఉద్రిక్తత | tension prevailed in kishore chandre deo nomination | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 17 2014 3:04 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

అరకు కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కిశోర్‌ చంద్రదేవ్‌ నామినేషన్‌ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్ దాఖలు చేసేందుకు బయల్దేరిన కిశోర్‌ చంద్రదేశ్‌ కాన్వాయ్‌పై కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి గంగాధర్‌ వర్గీయులు దాడి చేశారు. దాంతో ఆ ప్రాంతంలో శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతో పాటు అక్కడ 144 సెక్షన్‌ విధించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది. కిశోర్ చంద్రదేవ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ గంగాధర్ రెబెల్గా నామినేషన్ దాఖలు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement