
భద్రాచలం ముమ్మాటికీ సీమాంధ్రదే
భద్రాచలం డివిజన్ ముమ్మాటికీ సీమాంధ్రకు చెందినదేనని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిశోర్ చంద్రదేవ్ అన్నారు.
హైదరాబాద్ : భద్రాచలం డివిజన్ ముమ్మాటికీ సీమాంధ్రకు చెందినదేనని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిశోర్ చంద్రదేవ్ అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ అందుకు తగిన ఆధారాలు ఉన్నాయన్నారు. తెలంగాణ బిల్లు వెనక్కి పంపడం సరైన విధానం కాదని కిశోర్ చంద్రదేవ్ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీకి వచ్చింది ముసాయిదా మాత్రమేనని... దీనిపై సుదీర్ఘ చర్చ జరిపి మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొండ కుమ్మరులను ఎస్టీ జాబితాలోకి చేర్చేందుకు ప్రభుత్వం తక్షణం ప్రతిపాదనలు పంపాలని ఆయన డిమాండ్ చేశారు.