కాకినాడ: కేంద్ర మంత్రి పదవికి పళ్లంరాజు రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పళ్లంరాజు తన పదవికి రాజీనామా చేయాలని..లేకుంటే ఆమరణ దీక్ష చేస్తానని చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీపై కూడా ఆయన మండిపడ్డారు. ఆంటోనీ కమిటీ వాదనలు చెప్పడం అంటే చెవిటివాని చెవిలో శంఖం ఊదినట్లేనని ఆయన ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందని అభిప్రాయపడ్డారు.