ఆస్పత్రిలో పళ్లంరాజు ప్రచారం | pallam raju Violates Election Code in kakinada government hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో పళ్లంరాజు ప్రచారం

Published Tue, May 6 2014 1:06 PM | Last Updated on Mon, Mar 25 2019 3:03 PM

ఆస్పత్రిలో పళ్లంరాజు ప్రచారం - Sakshi

ఆస్పత్రిలో పళ్లంరాజు ప్రచారం

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లాలో కేంద్రమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి పళ్లంరాజు యధేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. ఎన్నికల ప్రచారం ముగిసినా ఆయన మాత్రం ఓటు వేయాలంటూ మంగళవారం ప్రచారం నిర్వహించారు. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన పళ్లంరాజు తనకు ఓటు వేయాలని రోగులను, ఆస్పత్రి సిబ్బందిని అభ్యర్థించారు.

ఆయనతో పాటు వచ్చిన అనుచరులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పళ్లంరాజును గెలిపించాలని కోరారు. కాగా నిన్నటితోనే ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఓ వైపు ఎన్నికల కమిషన్ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే పళ్లంరాజు ప్రయివేటు వాహనంలో ఆస్పత్రికి వచ్చి ప్రచారం చేశారు. అయితే ఈ ఘటనపై ఈసీ ఇంకా స్పందించలేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement